Skip to content
అల్-బఖరహ్ /

ఆయత్ 203

2 : 203

ఆయత్ 203 of అల్-బఖరహ్ (2 : 203). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-బఖరహ్ ఆయతులు 286
సూరా · అల్-బఖరహ్
తెలుగు · Muhammad
2 : 203

۞ وَٱذۡكُرُواْ ٱللَّهَ فِيٓ أَيَّامٖ مَّعۡدُودَٰتٖۚ فَمَن تَعَجَّلَ فِي يَوۡمَيۡنِ فَلَآ إِثۡمَ عَلَيۡهِ وَمَن تَأَخَّرَ فَلَآ إِثۡمَ عَلَيۡهِۖ لِمَنِ ٱتَّقَىٰۗ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱعۡلَمُوٓاْ أَنَّكُمۡ إِلَيۡهِ تُحۡشَرُونَ

మరియు నియమిత రోజులలో అల్లాహ్ ను స్మరించండి. ఎవడైనా త్వరగా రెండు రోజులలోనే వెళ్ళిపోయినా, అతనిపై ఎలాంటి దోషం లేదు. మరెవడైనా నిదానించి (పదమూడవ తేదీ వరకు) నిలిచి పోయినా, అతనిపై ఎలాంటి దోషం లేదు, వాడికి, ఎవడైతే దైవభీతి కలిగి ఉంటాడో! మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా మీరంతా ఆయన సన్నిధిలో హాజరు చేయబడుతారనేది తెలుసుకోండి.

Explanation & meanings · 2
  1. తష్రీక్ దినాలలో అంటే జు'ల్-'హిజ్జహ్ 11, 12, 13 తేదీలలో ఫ'ర్ద్ నమా'జ్ ల తరువాత తక్బీర్ చదవాలి : "అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వ లిల్లాహిల్ హమ్ద్." కంకర రాళ్ళు విసురునపుడు ప్రతి కంకరరాయి విసిరిన తర్వాత ఈ తక్బీర్ చదవటం సున్నత్. (నీల్ అల్ అవ్ తార్ పుస్తకం - 5, పేజీ - 86.
  2. మూడు జమరాతులపై 11 మరియు 12 జు'ల్ - 'హిజ్జహ్ తేదీలలో కంకర రాళ్ళను రువ్వాలి. 12వ తేదీన మ'గ్రిబ్ కు ముందు మీనా విడువ లేక పోతే, 13వ తేదీన కూడా "జుహ్ర్ నమా'జ్ తరువాత మూడు జమరాతులపై కంకరరాళ్ళను విసిరి మీనాను విడవాలి.