«విన్నారా! నిశ్చయంగా మీలో ప్రతి ఒక్కరూ తమ ప్రభువుతో ఏకాంతంగా సంభాషిస్తున్నారు, కాబట్టి ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవద్దు
అబూ సయీద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదులో ఏతికాఫ్ లో ఉన్నారు, అప్పుడు వారు (ప్రజలు) బిగ్గరగా ఖుర్’ఆన్ పఠనం చేయడాన్ని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం విన్నారు. ఆయన తెరను తొలగించి, ఇలా అన్నారు: «విన్నారా! నిశ్చయంగా మీలో ప్రతి ఒక్కరూ తమ ప్రభువుతో ఏకాంతంగా సంభాషిస్తున్నారు, కాబట్టి ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవద్దు, మరియు పఠనంలో ఒకరిపై ఒకరు తమ స్వరాలను పెంచవద్దు», లేదా వారు ఇలా అన్నారు: «సలాహ్ లో».
اعْتَكَفَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي المَسْجِدِ، فَسَمِعَهُمْ يَجْهَرُونَ بِالقِرَاءَةِ، فَكَشَفَ السِّتْرَ، فَقَالَ: «أَلَا إِنَّ كُلَّكُمْ مُنَاجٍ رَبَّهُ، فَلَا يُؤْذِيَنَّ بَعْضُكُمْ بَعْضًا، وَلَا يَرْفَعْ بَعْضُكُمْ عَلَى بَعْضٍ فِي القِرَاءَةِ»، أَوْ قَالَ: «فِي الصَّلَاةِ».
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సామీప్యం పొందడానికి తన మస్జిదు లోపల ఒక గుడారంలో ఏతికాఫ్’లో ఉన్నారు, అప్పుడు ఆయన తన సహాబాలు ఒకరికొకరు ఇబ్బంది కలిగించేలా చాలా బిగ్గరగా ఖుర్ఆన్ పఠించడం విన్నారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గుడారం పైనున్న తెరను తొలగించి, అలా చేసిన వారిని మందలించి, ఇలా అన్నారు: "మీరందరూ ఖుర్ఆన్ పఠనం ద్వారా మీ ప్రభువుతో సంభాషిస్తున్నారు, కాబట్టి మీరు ఒకరికొకరు ఇబ్బంది కలిగించుకోకండి, మరియు పఠనంలో లేదా నమాజులో ఒకరిపై ఒకరు మీ స్వరాన్ని పెంచకండి."
ఎవరికైనా ఇబ్బంది కలిగే విధంగా ఖుర్ఆన్ పారాయణంలో స్వరాన్ని పెంచడం నిషిద్ధం (హరామ్).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలకు దివ్యఖుర్ఆన్ పారాయణ పద్దతులను బోధించినారు.
సునన్ అబీదావూద్ (2/ 494) (1332).
ఇంకా (4)
شرح سنن أبي داود للعباد (162/ 18).
شرح أبي داود للعيني (5/238).
شرح سنن ابي داود لابن رسلان (6/515).
ذخيرة العقبى (11/669).