Skip to content

“నిశ్చయంగా అల్లాహ్ ప్రతి విషయంలోనూ కారుణ్యం కలిగి ఉండాలని ఆదేశించినాడు

షద్దాద్ బిన్ ఔస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి రెండు విషయాలను కంఠస్థం చేసుకున్నాను. వారు ఇలా అన్నారు:

“నిశ్చయంగా అల్లాహ్ ప్రతి విషయంలోనూ కారుణ్యం కలిగి ఉండాలని ఆదేశించినాడు. కనుక ఒకవేళ ఏదైనా ప్రాణిని చంపితే (చంప వలసి వస్తే), ఆ ప్రక్రియను యుక్తమైన విధంగా నిర్వహించండి, అలాగే ఏదైన ప్రాణిని అల్లాహ్ పేరున జిబహ్ చేస్తే (చేయవలసి వస్తే), ఆ ప్రక్రియను కూడా యుక్తమైన విధంగా నిర్వహించండి. మీలో ఒకరు (ఎవరు ఆ పనిని నిర్వహిస్తారో వారు) ఆ ప్రాణికి బాధ తెలియనంత పదునుగా ఉండేలా తన కత్తికి పదును పెట్టాలి”.

«إِنَّ اللهَ كَتَبَ الْإِحْسَانَ عَلَى كُلِّ شَيْءٍ، فَإِذَا قَتَلْتُمْ فَأَحْسِنُوا الْقِتْلَةَ، وَإِذَا ذَبَحْتُمْ فَأَحْسِنُوا الذَّبْحَ، وَلْيُحِدَّ أَحَدُكُمْ شَفْرَتَهُ، فَلْيُرِحْ ذَبِيحَتَهُ».

ముస్లిం నమోదు చేసినారు:
ప్రామాణికమైన హదీథు
వ్యాఖ్యానము

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు – ‘ప్రతి విషయంలోనూ ‘అల్ ఇహ్’సాన్’ కలిగి ఉండడాన్ని అల్లాహ్ మనపై విధిగావించినాడు. (అల్ ఇహ్’సాన్: అంటే, ఉచితమైన స్థాయి కంటే కూడా ఎక్కువగా కరుణ కలిగి ఉండుట అనే అర్థం ఉన్నది). అది (అల్ ఇహ్’సాన్) అల్లాహ్ పట్ల అన్ని వేళలా చేతన కలిగి ఉండుట, ఆయన ఆరాధనలలో, అన్ని వేళలా మంచిని చేయటలో, దాతృత్వ గుణాన్ని కలిగి ఉండుటలో, అల్లాహ్ సృష్టితాలకు నష్టం కలిగించకుండా ఉండుట - మొదలైన విషయాలలో చేతన కలిగి ఉండుట ద్వారా సాధించ బడుతుంది. అదే విధంగా ‘అల్ ఇహ్’సాన్’ కలిగి ఉండ వలసిన విషయాలలో, ఏదైనా ప్రాణం తీయుట మరియు అల్లాహ్ పేరున జిబహ్ చేయుట కూడా ఉన్నాయి. అల్’ఖిసాస్ విషయంలో ‘అల్ ఇహ్’సాన్’ పాటించుట: (అల్ ఖిసాస్ – అంటే షరియత్ ప్రకారం ‘ప్రాణానికి ప్రాణము’ అనే నియమం క్రింద, హతుని కుటుంబము క్షమాభిక్ష ప్రసాదించక పోతే, హంతకునికి విధించబడే మరణ శిక్ష): ఆ సందర్భములో హంతకునికి కష్టము, బాధ కలుగకుండా, తేలికగా, అత్యంత వేగంగా అతని ప్రాణం పోయే విధానాన్ని ఎంచుకోవడం. అల్లాహ్ పేరున జంతువు జిబహ్ చేయ బడునప్పుడు ‘అల్ ఇహ్’సాన్’ పాటించుట: జిబహ్ చేయబడే జంతువు ఎదురుగా (అది చూస్తుండగా) కత్తిని పదును చేయరాదు మరియు ( మందలోని) ఇతర జంతువులు చూస్తుండగా జిబహ్ చేయరాదు.

పదాల అర్థాలు

الشفرة: السكين العريضة.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

ఇందులో సృష్టి పట్ల సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క దయ మరియు కారుణ్యమూ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఏదైనా ప్రాణం తీయునపుడు లేదా అల్లాహ్ పేరున జిబహ్ చేయునపుడు షరియత్ ప్రకారము అల్ ఇహ్’సాన్ పాటించడం జరగాలి.

ఇందులో షరియత్ యొక్క పరిపూర్ణత తెలుస్తున్నది. అది అన్నిరకాల శుభాలను కూడి ఉన్నది, వాటిలో పశుపక్ష్యాదుల పట్ల దయ కరుణ మరియు స్నేహభావన కలిగి ఉండుట ఒకటి.

ఒక మనిషిని, (షరియత్ ప్రకారం) అతడి ప్రాణం తీసిన తరువాత, అతడి దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేయడం నిషేధించబడినది.

పశుపక్ష్యాదులను ఏవిధమైన కృరత్వానికి అయినా గురి చేయడం నిషేధించబడినది.

సమీక్షకుడు

సహీహ్ ముస్లిం. (3/ 1548) (1955).

ఇంకా (8)

التحفة الربانية في شرح الأربعين حديثا النووية (ص38).

شرح الأربعين النووية.

لابن عثيمين (ص185).

فتح القوي المتين في شرح الأربعين وتتمة الخمسين.

للعباد (ص65).

فتح الباري.

لابن حجر (9/ 644).

شرح النووي على مسلم (13/ 107).