القواعد الأربع

القواعد الأربع

يهدف "متن القواعد الأربعة" للعلامة محمد بن عبد الوهاب إلى توضيح أربعة قواعد أساسية في فهم التوحيد والشرك.

Language: lang_te
Prepared by:
Version: 1.0
Translations 12
Bengali English Finnish French +8
Attachments 7
PDF
Audio
Video
+3

నాలుగు నియమాలు

ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం

ఇహపరలోకాలలో మిమ్మల్ని రక్షించమని సర్వశక్తిమంతుడు, అద్భుతమైన సింహాసనానికి ప్రభువు అయిన అల్లాహ్ ను అర్థిస్తున్నాను.

మీరెక్కడ ఉన్నా మిమ్మల్ని అనుగ్రహించమనీ; శుభాలు పొంది సుఖసంతోషాలతో ఉన్నప్పుడు కృతజ్ఞతతో, బాధలలో ఉన్నప్పుడు సహనంతో జీవితం గడిపే వారిలో మిమ్మల్ని ఒకరిగా చేయమనీ, ఒకవేళ ఏదైనా పాపం జరిగితే వెంటనే పశ్చాత్తాప పడుతూ, క్షమాపణ కోరేవారిలో మిమ్మల్ని ఒకరిగా చేయమనీ నేను వేడుకుంటున్నాను.

తెలుసుకోండి! అల్లాహ్ తనకు విధేయత చూపే సన్మార్గాన్ని మీకు చూపుగాక! హనీఫియ్య ఇబ్రాహీం మిల్లత్ అంటే మీరు ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ ను మాత్రమే, ఆయన అవతరింపజేసిన ఇస్లాం ధర్మాన్ని అనుసరిస్తూ ఆరాధించాలి. దీని గురించే అల్లాహ్ ప్రజలందరికీ ఆదేశించాడు. మరియు వారిని దాని కొరకే సృష్టించాడు. అల్లాహ్ తఆలా ఇలా సెలవిస్తున్నాడు: {మరియు నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నా ఆరాధన కొరకే సృష్టించాను.} [జారియాతు :56] తనను ఆరాధించడానికి మాత్రమే అల్లాహ్ మిమ్మల్ని సృష్టించాడని మీకు తెలిసిన తరువాత ఆచార శుద్ధి (పవిత్రత) లేకుండా ప్రార్థన చెల్లనట్లుగా ఆరాధనను ఏకేశ్వరోపాసనతో (తౌహీద్ తో) చేస్తే తప్ప అది "ఆరాధన" అని పిలవబడదని మీరు గ్రహించాలి. కాబట్టి, ఆరాధన బహుదైవారాధనతో కలుషితమై పోతే, హదత్ (మలమూత్రాల విసర్జన, వీర్యస్ఖలనం, బహిష్టు మొదలైనవి) ద్వారా ఒకరి ఆచార శుద్ధి (పరిశుద్ధత) చెడి పోయినట్లే, ఆరాధన కూడా చెడిపోతుంది. బహుదైవారాధన అల్లాహ్ యొక్క ఆరాధనను నిర్వీర్యం చేస్తుందని, ఒకరి సత్కార్యాలకు విలువ లేకుండా చేస్తుందని మరియు ఒకరిని శాశ్వతంగా నరకాగ్నికి పంపుతుందనే ముఖ్యవిషయాన్ని గ్రహించి, దీని గురించి తెలుసుకోవడం మీ గొప్ప కర్తవ్యంగా పరిగణిస్తే, తద్వారా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు సాటిగా భాగస్వాములను కల్పించే ఈ ఉచ్చు నుండి అల్లాహ్ మిమ్మల్ని రక్షించగలడు. అల్లాహ్ ప్రకటన: నిశ్ఛయంగా అల్లాహ్ తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. [అన్నిసా :116] అల్లాహ్ తన గ్రంథంలో పేర్కొన్న నాలుగు నియమాలను తెలుసుకోవడం ద్వారా దీనిని సాధించవచ్చు.

మొదటి నియమం:

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎవరికి వ్యతిరేకంగా పోరాడారో అలాంటి బహుదైవారాధకులు కూడా అల్లాహ్ సృష్టికర్త మరియు వ్యవహారాలను చక్కదిద్దేవాడనే సత్యాన్ని అంగీకరించారని తెలుసు కున్నప్పటికీ, ఇది వారిని ఇస్లాం మార్గంలోకి తీసుకురాలేక పోయిందని ఈ ఖుర్ఆన్ ఆయతులో నిరూపించబడింది. {వారిని అడుగు: "ఆకాశం నుండి,భూమి నుండి, మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు? వినేశక్తీ, చూసేశక్తీ ఎవడి ఆధీనంలో ఉన్నాయి? ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని తీసేవాడు ఎవడు? మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు?" వారు: "అల్లాహ్!" అని తప్పకుండా అంటారు. అప్పుడను: "అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా?"} (యూనుస్:31)

రెండవ నియమం:

వారిలా అన్నారు: “మేము వారిని ప్రార్థించాము మరియు అల్లాహ్ వద్ద సామీప్యత మరియు మధ్యవర్తిత్వం కోసం మాత్రమే వారి వైపు మరలినాము”. ఆ సామీప్యత మరియు మధ్యవర్తిత్వం గురించిన వాదన ఈ ఆయతులో ఇలా ఉన్నది: {వినండి! భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది! ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునే వారు (ఇలా అంటారు): "వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము!" నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ అసత్యవాదికి, కృతఘ్నునికి మార్గదర్శకత్వం చేయడు.} [జుమర్:3] మధ్యవర్తిత్వ వాదన గురించి వారి అసత్య వాదన గురించి ఈ ఆయతులో ప్రస్తావించ బడినది: మరియు వారు అల్లాహ్ ను వదిలి తమకు నష్టాన్ని గానీ,లాభాన్ని గానీ చేకూర్చలేని వాటిని ఆరాదిస్తున్నారు. ఇంకా అల్లాహ్ సమక్షంలో ఇవి మాకు సిఫారసు చేస్తాయి అని చెబుతున్నారు. [యూనుస్ : 18]

మధ్యవర్తిత్వం రెండు రకాలు: తిరస్కరించబడే మధ్యవర్తిత్వం మరియు ఆమోదించబడే మధ్యవర్తిత్వం.

తిరస్కరించబడే మధ్యవర్తిత్వం: అల్లాహ్ తప్ప ఇతరుల నుండి కోరేదే తిరస్కరించబడే మధ్యవర్తిత్వం. అల్లాహ్ తప్ప మరెవరూ ప్రసాదించలేరని ఈ ఆయతులో ప్రకటించబడింది. ఓ విశ్వాసులారా! ఏ బేరం గానీ, స్నేహం గానీ, సిఫారసు గానీ పనికిరాని దినం రాకముందే, మేము మీకు ప్రసాదించిన జీవనోపాధి నుండి (మా మార్గంలో) ఖర్చు పెట్టండి. మరియు సత్యతిరస్కారులు, వారే! దుర్మార్గులు. [అల్ బఖరహ్ 254]

ఆమోదించబడే మధ్యవర్తిత్వం: కేవలం అల్లాహ్ నుండి కోరేదే ఆమోదించబడే మధ్యవర్తిత్వం. మధ్యవర్తిత్వం ద్వారా మధ్యవర్తి గౌరవించబడతాడు. అల్లాహ్ అనుమతి మంజారు చేసిన వాని ద్వారా మాత్రమే సిఫారసు కోరబడుతుంది. అతని మాటలు మరియు పనులతో అల్లాహ్ సంతోషిస్తాడు. ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రకటన: {ఆయన సమ్ముఖంలో ఆయన అనుజ్ఞ లేకుండా – సిఫారసు చేయగల వాడెవడు?} [అల్ బఖర :255 ].

మూడవ నియమం:

వివిధ రకాల ఆరాధనలు చేస్తున్న బహుదైవారాధక ప్రజల మధ్య ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉద్భవించారు. కొందరు దేవదూతలను ఆరాధించేవారు, కొందరు ప్రవక్తలను మరియు సత్పురుషులను ఆరాధించేవారు, కొందరు చెట్లను మరియు రాళ్లను ఆరాధించేవారు, మరికొందరు సూర్యచంద్రులను ఆరాధించేవారు. ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారందరితో ధర్మపోరాటం జరిపినారు. ఖుర్ఆన్ ప్రకటన: మరియు అధర్మం (ఫిత్నా) ఏ మాత్రం మిగలకుండా పోయే వరకు మరియు ఆరాధన (ధర్మం) కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడనంత వరకు వారితో (సత్యతిరస్కారులతో) పోరాడుతూ ఉండండి. [అల్ అన్ఫాల్:39] సూర్యచంద్రుల ఆరాధన చేయకూడదనే ఆజ్ఞ ఖుర్ఆన్ లోని ఈ ఆయతులో ఉన్నది: {మరియు ఆయన సూచనలలో (ఆయాత్ లలో) రేయింబవళ్ళు మరియు సూర్యచంద్రులున్నాయి. మీరు సూర్యునికి గానీ చంద్రునికి గానీ సాష్టాంగం (సజ్దా) చేయకండి, కాని కేవలం వాటిని సృష్టించిన అల్లాహ్ కు మాత్రమే సాష్టాంగం (సజ్దా) చేయండి - నిజంగానే మీరు ఆయనను ఆరాధించేవారే అయితే}. [ఫుస్సిలత్ : 37] దైవదూతల ఆరాధన చేయకూడదనే ఆజ్ఞ ఈ ఆయతులో ఉన్నది: మరియు మీరు దైవదూతలనో లేదా ప్రవక్తలనో ప్రభువులుగా చేసుకోండని ఆయన మిమ్మల్ని ఎన్నడూ ఆజ్ఞాపించడు. [ఆలే ఇమ్రాన్:80] ప్రవక్తల ఆరాధన చేయరాదనే ప్రస్తావన ఈ ఆయతులో ఉన్నది: {మరియు (జ్ఞాపకముంచుకోండి!) అప్పుడు (పునరుత్థాన దినమున), అల్లాహ్ :"ఓ మర్యమ్ కుమారుడా! ఈసా (ఏసు) ఏమీ? నీవు ప్రజలతో: 'అల్లాహ్ కు బదులుగా నన్నూ మరియు నా తల్లినీ ఆరాధ్యులుగా చేసుకోండి!" అని చెప్పావా?" అని ప్రశ్నించగా! దానికి అతను (ఈసా) అంటాడు: "నీవు సర్వలోపాలకు అతీతుడవు. నాకు పలకటానికి అర్హతలేని మాటను నేను పలకటం తగినపని కాదు. ఒకవేళ నేను అలా చెప్పి ఉంటే నీకు తప్పక తెలిసి ఉండేది. నా మనస్సులో ఉన్నది నీకు తెలుసు, కాని నీ మనస్సులో ఉన్నది నాకు తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వ అగోచర విషయాలు తెలిసినవాడవు!} [అల్ మాయిదా:116]

సత్పురుషుల ఆరాధన చేయరాదనే ప్రస్తావన ఈ ఆయతులో ఉన్నది: {వారు, ఎవరినైతే వీరు ప్రార్థిస్తూ ఉన్నారో, వారే తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు. మరియు వారిలో ఆయనకు ఎవరు ఎక్కువ సాన్నిధ్యం పొందుతారో అని ప్రయత్నిస్తున్నారు. మరియు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు మరియు ఆయన శిక్షకు భయపడుతున్నారు. నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష, దానికి భయపడ వలసిందే!} {అల్ ఇస్రా : 57} అలాగే చెట్లు మరియు విగ్రహాల ఆరాధన చేయకూడదనే ప్రస్తావన ఈ ఆయతులో ఉన్నది: మీరు, అల్ లాత్ మరియు అల్ ఉజ్జాను గురించి ఆలోచించారా? మరియు మూడవదీ చివరిది అయిన మనాత్ ను (గురించి కూడా)? [అన్నజమ్: 19-20]

అబూ వాఖిద్ అల్ లైథి (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీథులో కూడా ఇలా పేర్కొనబడింది: “మేము ఇస్లాం స్వీకరించి ఎక్కువ సమయం గడవక ముందే, అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో హునైన్ యుద్ధం కొరకు బయలుదేరాము. ఆ మార్గంలో బహుదైవారాధకులు ఆరాధించే ఒక చెట్టు ఉన్నది. దానిని వారు "ధాత్ అన్వాత్" అని పిలిచేవారు మరియు దానిపై వారు తమ ఆయుధాలను (దీవెన కోసం) వేలాడదీసేవారు. మేము ఆ చెట్టు మీదుగా వెళుతున్నప్పుడు, ఇలా అన్నాము: 'ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! వారి కొరకు ధాత్ అన్వాత్ ఉన్నట్లేమా కోసం కూడా ఒక ధాత్ అన్వాత్ (చెట్టు)ను సూచించండి. . . .’ ”

నాలుగవ నియమం:

బహుదైవారాధనాపరంగా మన కాలంలోని బహుదైవారాధకులు మునుపటి బహుదైవారాధకుల కంటే అధ్వాన్నంగా ఉన్నారు. ఎందుకంటే పూర్వీకులు ఐశ్వర్యం పొందినపుడు, సుఖసంతోషాలతో ఉన్నప్పుడు ఇతరులను అల్లాహ్ కు భాగస్వామిగా కల్పించేవారు. కానీ కష్టనష్టాలలో అల్లాహ్ కు హృదయ పూర్వకంగా అంకితభావంతో వేడుకునేవారు. కాని ఈనాటి బహుదైవారాధకులు మంచికాలంలో మరియు కష్టకాలంలో, రెండింటిలోనూ నిరంతరం అల్లాహ్ కు భాగస్వాములను కల్పిస్తున్నారు. దీని గురించి ఈ ఆయతులో ఇలా ప్రస్తావించబడింది: వారు నావలోకి ఎక్కినప్పుడు తమ భక్తిని కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించుకొని ఆయననే ప్రార్థిస్తారు; కాని ఆయన వారిని రక్షించి నేల మీదకు తీసుకు రాగానే ఆయనకు సాటి కల్పించ సాగుతారు. [అన్కబూత్ : 65]

నిశ్చయంగా అల్లాహ్ బాగా ఎరుగును. మరియు అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ (స) పై, ఆయన కుటుంబముపై శుభాలను,శాంతిని కలిగించుగాక!