Skip to content
సూరాల జాబితా /

الجُمعَة

الجُمعَة is chapter 62 of the Quran and has 11 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

11 ఆయతులు సూరా సంఖ్య 62
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

يُسَبِّحُ لِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِ ٱلۡمَلِكِ ٱلۡقُدُّوسِ ٱلۡعَزِيزِ ٱلۡحَكِيمِ

ఆకాశాలలో నున్నవి మరియు భూమిలో నున్నవి, సమస్తమూ విశ్వసార్వభౌముడు, పరమ పవిత్రుడు, సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు అయన అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి.

Explanation & meanings · 1
  1. చూడండి, 20:114 వ్యాఖ్యానం 3.

هُوَ ٱلَّذِي بَعَثَ فِي ٱلۡأُمِّيِّـۧنَ رَسُولٗا مِّنۡهُمۡ يَتۡلُواْ عَلَيۡهِمۡ ءَايَٰتِهِۦ وَيُزَكِّيهِمۡ وَيُعَلِّمُهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡحِكۡمَةَ وَإِن كَانُواْ مِن قَبۡلُ لَفِي ضَلَٰلٖ مُّبِينٖ

ఆయనే ఆ నిరక్ష్యరాస్యులైన వారిలో నుండి ఒక సందేశహరుణ్ణి లేపాడు. అతను వారికి ఆయన సూచనలను (ఆయాత్ లను) చదివి వినిపిస్తున్నాడు మరియు వారిని సంస్కరిస్తున్నాడు మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు. మరియు వాస్తవానికి వారు, అంతకు పూర్వం స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉండేవారు.

Explanation & meanings · 1
  1. అల్-ఉమ్మియ్యూన: నిరక్షరాస్యులు. అంటే ఆ కాలంలో అరబ్బులలో చాలా మందికి చదవటం వ్రాయటం వచ్చేది కాదు. స్వయంగా ప్రవక్త ('స'అస) కూడా నిరక్షరాస్యులే. చూడండి, 7:157-158.

وَءَاخَرِينَ مِنۡهُمۡ لَمَّا يَلۡحَقُواْ بِهِمۡۚ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ

మరియు ఇంకా వారిలో చేరని ఇతరులకు కూడా (బోధించటానికి). మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

ذَٰلِكَ فَضۡلُ ٱللَّهِ يُؤۡتِيهِ مَن يَشَآءُۚ وَٱللَّهُ ذُو ٱلۡفَضۡلِ ٱلۡعَظِيمِ

ఇది అల్లాహ్ అనుగ్రహం, ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ అనుగ్రహశాలి, సర్వోత్తముడు.

مَثَلُ ٱلَّذِينَ حُمِّلُواْ ٱلتَّوۡرَىٰةَ ثُمَّ لَمۡ يَحۡمِلُوهَا كَمَثَلِ ٱلۡحِمَارِ يَحۡمِلُ أَسۡفَارَۢاۚ بِئۡسَ مَثَلُ ٱلۡقَوۡمِ ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِ ٱللَّهِۚ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ

తౌరాత్ బాధ్యత (భారం) మోపబడిన తరువాత దానిపై అమలు చేయలేక పోయిన వారి పోలిక, పుస్తకాల భారాన్ని మోసే ఆ గాడిద వలే ఉంది. (వారు ఆ భారాన్ని భరించారే గానీ, దానిని అర్థం చేసుకోలేక పోయారు). అల్లాహ్ సూచన (ఆయాత్) లను తిరస్కరించిన వారి దృష్టాంతము ఎంత చెడ్డది. మరియు అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు.