5 : 73
لَّقَدۡ كَفَرَ ٱلَّذِينَ قَالُوٓاْ إِنَّ ٱللَّهَ ثَالِثُ ثَلَٰثَةٖۘ وَمَا مِنۡ إِلَٰهٍ إِلَّآ إِلَٰهٞ وَٰحِدٞۚ وَإِن لَّمۡ يَنتَهُواْ عَمَّا يَقُولُونَ لَيَمَسَّنَّ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡهُمۡ عَذَابٌ أَلِيمٌ
"నిశ్చయంగా, అల్లాహ్ ముగ్గురిలో మూడవవాడు!" అని అనేవారు వాస్తవానికి సత్యతిరస్కారులే. మరియు ఒకే ఒక్క ఆరాధ్యదేవుడు (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు. మరియు వారు తమ ఈ మాటనలు మానుకోకపోతే, వారిలో సత్యతిరస్కారులైన వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది.
Explanation & meanings · 1
- ఇది క్రైస్తవులలో ఒక తెగ వారి ప్రస్తావన. వారు అల్లాహ్ (సు.తా.), జిబ్రీల్ మరియు 'ఈసా ('అలైహిమ్ స.) ముగ్గురు, దైవాలున్నారు అంటారు. చూడండి, 5:116 మరియు 5:75.