48 : 18
۞ لَّقَدۡ رَضِيَ ٱللَّهُ عَنِ ٱلۡمُؤۡمِنِينَ إِذۡ يُبَايِعُونَكَ تَحۡتَ ٱلشَّجَرَةِ فَعَلِمَ مَا فِي قُلُوبِهِمۡ فَأَنزَلَ ٱلسَّكِينَةَ عَلَيۡهِمۡ وَأَثَٰبَهُمۡ فَتۡحٗا قَرِيبٗا
వాస్తవానికి విశ్వాసులు చెట్టు క్రింద నీతో చేసిన శపథం చూసి అల్లాహ్ సంతోషించాడు; మరియు వారి హృదయాల స్థితి ఆయనకు తెలిసిందే. కావున ఆయన వారి మీద శాంతిని అవతరింప జేశాడు. మరియు బహుమానంగా వారికి సమీప విజయాన్ని ప్రసాదించాడు.
Explanation & meanings · 2
- ఇది 'హుదైబియాలో 6వ హిజ్రీలో 'ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర'ది.'అ) మరణవార్త విని, దైవప్రవక్త ('స'అస) చేతిపై ఒక తుమ్మచెట్టు క్రింద 'స'హాబాలు ('రది.'అన్హుమ్) అందరూ, తమ చివరి ప్రాణాల వరకు 'ఉస్మాన్ ('రది.'అ.) మరణపు ప్రతీకారం తీర్చుకోవటానికి పోరాడుతామని, చేసిన ప్రతిజ్ఞ.
- ఇది 'ఖైబర్ విజయమని చాలామంది వ్యాఖ్యాతలు అంటారు. కొందరు ఇది 8వ హిజ్రీ మక్కా విజయమని, ఆ తరువాత ముస్లింలకు లభించిన ఇతర విజయాలని అంటారు.