2 : 112
بَلَىٰۚ مَنۡ أَسۡلَمَ وَجۡهَهُۥ لِلَّهِ وَهُوَ مُحۡسِنٞ فَلَهُۥٓ أَجۡرُهُۥ عِندَ رَبِّهِۦ وَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُونَ
వాస్తవానికి ఎవడైతే అల్లాహ్ కు విధేయుడై (ఇస్లాం స్వీకరించి) తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు అంకితం చేసుకుని, సజ్జనుడై ఉంటాడో! దానికి అతడు తన ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం పొందుతాడు. మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!
Explanation & meanings · 1
- "అస్లమ వహ్ హహు లిల్లాహ్." అంటే, కేవలం అల్లాహ్ (సు.తా.) ప్రసన్నత కొరకే ఏదైనా చేయాలి. "వహువ ము'హ్ సినున్:" అంటే ఏ పనైనా హృదయపూర్వకంగా, మహా ప్రవక్త ('స'అస) ఆదేశాల ప్రకారం చేయాలి. చేసిన కార్యాలకు మంచి ప్రతిఫలం పొందటానికి, ఈ రెండు విషయాలను దృష్టిలో ఉంచుకోవటం ఎంతో అవసరం. (ఇబ్నె-కసీ'ర్).