Skip to content
الكَهف /

ఆయత్ 28

18 : 28

ఆయత్ 28 of الكَهف (18 : 28). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الكَهف ఆయతులు 110
సూరా · الكَهف
తెలుగు · Muhammad
18 : 28

وَٱصۡبِرۡ نَفۡسَكَ مَعَ ٱلَّذِينَ يَدۡعُونَ رَبَّهُم بِٱلۡغَدَوٰةِ وَٱلۡعَشِيِّ يُرِيدُونَ وَجۡهَهُۥۖ وَلَا تَعۡدُ عَيۡنَاكَ عَنۡهُمۡ تُرِيدُ زِينَةَ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۖ وَلَا تُطِعۡ مَنۡ أَغۡفَلۡنَا قَلۡبَهُۥ عَن ذِكۡرِنَا وَٱتَّبَعَ هَوَىٰهُ وَكَانَ أَمۡرُهُۥ فُرُطٗا

మరియు (ఓ ప్రవక్తా!) ఎవరు ఆయన ముఖ దర్శనం (ప్రసన్నతను) కోరుతూ, ఉదయం మరియు సాయంత్రం తమ ప్రభువును ప్రార్థిస్తున్నారో, వారి సహచర్యంలోనే సహనం వహించి ఉండు. ఇహలోక ఆడంబరాలను అపేక్షించి నీ దృష్టిని వారి నుండి దాటనివ్వకు (వారిని ఉపేక్షించకు). మరియు అలాంటి వానిని అనుసరించకు (మాట వినకు), ఎవడి హృదయాన్ని మా ధ్యానం నుండి తొలగించామో మరియు ఎవడు తన మనోవాంఛలను అనుసరిస్తున్నాడో మరియు ఎవడి వ్యవహారాలు (కర్మలు) వ్యర్థమయ్యాయో!

Explanation & meanings · 1
  1. ఈ వాక్యం 6:52లో కూడా ఉంది. స'ఆద్ బిన్ అబీ- వఖ్ఖా'స్ కథనం: ఒకసారి దైవప్రవక్త '(స'అస) స'ఆద్ బిన్ అబీ-వఖ్ఖా'స్, బిలాల్, ఇబ్నె-మసూ'ద్, ఒక 'హజ'లీ మరియు ఇద్దరు 'స'హాబీ (ర'ది. 'అన్హుమ్)లతో కలిసి కూర్చొని ఉంటారు. అప్పుడు కొందరు ఖురైష్ నాయకులు వచ్చి, దైవప్రవక్త ('స'అస)తో: 'వీరిని మీ దగ్గర నుండి పంపండి. మేము మీతో మాట్లాడదలచాము.' అని అంటారు. అప్పుడు దైవప్రవక్త ('స'అ)కు తట్టుతుంది: 'బహుశా వీరు నా మాట వింటారేమో.' అని, కాని అల్లాహుతా'ఆలా అతనిని ('స'అ) నివారించాడు.' ('స.ముస్లిం)