Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 5 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“ఒక ప్రయాణములో నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాను. (వారు వుదూ చేస్తూ కాళ్ళు కడగడం దగ్గరికి వచ్చేసరికి) నేను, వారు కాళ్ళకు తొడుగుకుని ఉన్న, పలుచని తోలుతో చేసిన మేజోళ్ళను (ఖుఫ్ఫైన్ లను) తొలిగించడానికి ముందుకు వంగాను. అపుడు ఆయన ఇలా అన్నారు “వాటిని అలాగే ఉండనివ్వు (ఓ ముఘీరహ్), నేను వాటిని (పూర్తిగా) వుదూ చేసుకున్న తరువాత కాళ్ళకు తొడిగినాను”. అలా అని వారు తోలుతో చేసిన ఆ మేజోళ్ళపై తడి చేతులతో తడిమినారు (మసహ్ చేసినారు).
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“మీలో ఎవరైనా ఉదూ చేసి, తరువాత (పాదములకు) “ఖుఫ్”లను (“ఖుఫ్ఫైన్” – పలుచని తోలుతో చేయబడిన మేజోళ్ళు) తొడుగుకున్నట్లయితే, వాటిని తొడిగి ఉన్న స్థితిలోనే అతడు నమాజు ఆచరించవచ్చును, “జనాబత్” స్థితికి (సంభోగానంతర అశుద్ధ స్థితికి) లోనైతే తప్ప వాటిని కాళ్ళనుండి తీయకుండా వాటి పైన తడి చేతులతో ‘మసహ్’ చేయవచ్చును (తడమవచ్చు).”
ప్రామాణికమైన హదీథు దారు ఖుత్నీ నమోదు చేసినారు:
నేను మేజోళ్ళపై మసహ్ గురించి అడుగుదామని సఫ్వాన్ బిన్ అస్సాల్ అల్-మురాదీ వద్దకు వెళ్ళాను. ఆయన నన్ను "జిర్! ఏమిటి ఇలా వచ్చావ్?” అనడిగారు. అందుకు నేను “జ్ఞానసముపార్జన కోసం” అని జవాబిచ్చాను. అది విని ఆయన “దైవదూతలు జ్ఞానం ఆర్జించే వ్యక్తి పట్ల ప్రసన్నులై తమ రెక్కల్ని పరుస్తారు" అని చెప్పారు. నేను ఆయనతో "మల మూత్ర విసర్జన అనంతరం మేజోళ్ళపై మసాహ్ చేసే విషయంలో నాకు సందేహముంది. తమరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు కదా! అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం గురించి బోధిస్తుండగా మీరేమైనా విన్నారేమో అడుగుదామని వచ్చాను” అని విన్నవించుకున్నాను. దానికి ఆయన "అవును, ప్రయాణంలో ఉన్నప్పుడు మూడు పగళ్ళు మరియు మూడు రాత్రుల వరకు జనాబత్ అశుద్ధావస్థ ఎదురైతే తప్ప, మలమూత్ర విసర్జన మరియు నిద్ర కారణంగా మేజోళ్ళు తీయవలసిన అవసరం లేదని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించేవారు, అని వివరించారు. ఆ తరువాత నేను “మరి ప్రేమ (అభిమానం) గురించి ఆయన ఏమైనా ప్రబోధిస్తుండగా మీరు విన్నారా?” అనడిగాను. దానికి కూడా ఆయన “అవును, ఒకానొక ప్రయాణంలో మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఆయన దగ్గరే ఉన్నాము. అప్పుడు పల్లెటూరి వ్యక్తి ఒకడు ‘ఓ ముహమ్మద్!' అని బిగ్గరగా అరిచాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతే స్వరంతో “ఇక్కడున్నాను" అని బదులు పలికారు. మేము అతనికి, “నీ ధోరణి కడు శోచనీయం. కాస్త గొంతు తగ్గించి మాట్లాడు. నువ్వు ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో ఉన్నావు. ఆయన సమక్షంలో నువ్విలా బిగ్గరగా మాట్లాడటం నిషిద్ధం” అని హితవు పలికాము. కాని అతను "దైవసాక్షి! నేను తగ్గించను” అన్నాడు. ఆ పల్లెటూరి వ్యక్తి “మనిషి కొందరిని ప్రేమిస్తాడు, కానీ వారిని కలుసుకోలేకపోతాడు” అని అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, “మనిషి ప్రళయ దినాన తాను ప్రేమించిన వారితో పాటే ఉంటాడు” అని చెప్పారు. తరువాత ఆయన మాతో మాట్లాడుతూ పడమటి దిక్కున ఉన్న ఓ ద్వారాన్ని గురించి ప్రస్తావించారు. దాని వెడల్పు నలభై లేక డెభ్భై సంవత్సరాల ప్రయాణమంత ఉంటుంది లేదా దాని వెడల్పులో ఒక రౌతు నలభై లేక డెభ్భై సంవత్సరాలు ప్రయాణించగలడు.
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“(ఒకసారి) నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉన్నాను. (దారిలో) ఆయన ఒక తెగవారు తమ చెత్తాచెదారం వేసే స్థలం వద్దకు వచ్చారు. అక్కడ ఆయన నిలబడి మూత్ర విసర్జన చేసారు, నేను ఒక ప్రక్కకు వెళ్ళిపోయాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను దగ్గరికి రమ్మని పిలిచినారు. నేను ఆయన మడమల వెనుక భాగాన నిలబడేటంత దగ్గరగా వెళ్ళాను. తరువాత ఆయన వుజూ చేసి, తన కాళ్ళకు తొడిగుకుని ఉన్న మేజోళ్ళపై (సాక్సులపై) మసహ్ చేసినారు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
జరీర్ మూత్ర విసర్జన చేసిన తర్వాత ఉదూ చేసి, తన మేజోళ్లపై మసాహ్ చేశారు. అప్పుడు ఆయన్ని, 'మీరు ఇలా చేస్తారా?' అని ప్రశ్నించగా, ఆయన ఇలా బదులిచ్చారు: 'అవును, నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మూత్ర విసర్జన చేసిన తర్వాత ఉదూ చేసి, తన మేజోళ్లపై మసాహ్ చేయడాన్ని చూశాను. అల్-అఅమష్ తెలిపారు: ఇబ్రాహీం ఇలా అన్నారు: 'వారు ఈ హదీథును చాలా ఇష్టపడేవారు; ఎందుకంటే సూరహ్ మాయిదహ్ అవతరించిన తర్వాత జరీర్ ఇస్లాం స్వీకరించడం జరిగింది.'
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు