ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చెంప యొక్క తెలుపు కనబడేంతగా తన కుడి వైపునకు తిరిగి మరియు ఎడమ వైపునకు తిరిగి సలాం చేయగా నేను చూశాను.
సాద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చెంప యొక్క తెలుపు కనబడేంతగా తన కుడి వైపునకు తిరిగి మరియు ఎడమ వైపునకు తిరిగి సలాం చేయగా నేను చూశాను.
كُنْتُ أَرَى رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يُسَلِّمُ عَنْ يَمِينِهِ، وَعَنْ يَسَارِهِ، حَتَّى أَرَى بَيَاضَ خَدِّهِ.
సఅద్ బిన్ అబీ వఖ్ఖాస్ రదియల్లాహు అన్హు తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన నమాజులో సలాం పలికేటప్పుడు, మొదటి సలాం కోసం తన కుడి వైపునకు మరియు రెండవ సలాం కోసం తన ఎడమ వైపునకు ఎంతగా ముఖాన్ని తిప్పేవారంటే, (వెనుక ఉన్నవారికి) ఆయన చెంప యొక్క తెలుపు కనిపించేది.
కుడి, ఎడమ వైపులకు పూర్తిగా తల తిప్పడం ధర్మబద్దమైనదే.
కుడివైపుకు, ఎడమవైపుకు కలిపి మొత్తం రెండుసార్లు సలాం చెప్పుట షరియత్’లోని భాగమే.
ఇమాం అన్నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఎవరైనా రెండు సలాంలను (తస్లీమ్‌లను) రెండింటినీ కుడివైపుకు గానీ లేదా ఎడమవైపుకు గానీ లేదా ముఖానికి ఎదురుగా గానీ పలికినట్లయితే లేదా మొదటి సలాంను ఎడమవైపుకు మరియు రెండవ సలాంను కుడివైపుకు పలికినట్లయితే, వారి నమాజ్ చెల్లుతుంది మరియు రెండు తస్లీమ్‌లు నెరవేరుతాయి. అయితే, వాటిని ఆచరించే విధానంలో ఉన్న శ్రేష్ఠతను, శుభాన్ని వారు కోల్పోతారు.
సహీహ్ ముస్లిం. (1/ 409) (582).
ఇంకా (2)
البحر المحيط الثجاج في شرح صحيح الإمام مسلم بن الحجاج (13/ 99).
مرقاة المصابيح شرح مشكاة المصابيح (4 /30).