“ఎవరైతే ఉత్తమ రీతిలో ఉదూ చేస్తాడో అతని పాపాలు అతని శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి, చివరికి అతని గోళ్ళ క్రింద నుండి కూడా బయటకు వెళ్ళిపోతాయి.”
ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే ఉత్తమ రీతిలో ఉదూ చేస్తాడో అతని పాపాలు అతని శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి, చివరికి అతని గోళ్ళ క్రింద నుండి కూడా బయటకు వెళ్ళిపోతాయి.”
«مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ خَرَجَتْ خَطَايَاهُ مِنْ جَسَدِهِ حَتَّى تَخْرُجَ مِنْ تَحْتِ أَظْفَارِهِ».
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే సున్నత్ విధానాన్ని అనుసరించి, ఉదూ చేయునపుడు ఆచరించవలసిన అన్ని విషయాలను ఆచరిస్తూ, పరిపూర్ణంగా ఉదూ చేస్తాడో, అటువంటి ఉదూ అతని వల్ల జరిగిన చెడు పనులు,మరియు పాపములకు పరిహారంగా మారుతుంది – చివరికి అతని కాలి మరియు చేతుల వేళ్ళ క్రిందనుంచి అవి అతడి నుంచి దూరమవుతాయి.
...:
ఇందులో ఉదూ సున్నత్ విధానం ప్రకారం ఏ విధంగా చేయాలి, ఉదూ ఆచరణలో ఏఏ విషయాలున్నాయి మొదలైన వాటిని నేర్చుకోవాలనే ప్రొత్సాహం ఉన్నది.
అలాగే ఇందులో ఉదూ యొక్క ఘనత గురించి తెలుస్తున్నది – ఉదూ చెడుపనులకు, పాపకార్యాలకు పరిహారంగా మారుతుంది అని తెలుస్తున్నది. అయితే ‘కబాయిర్ పాపములు’ అతడి నుంచి దూరం కావు. వాటి కొరకు అతడు మనస్ఫూర్తిగా పశ్చాత్తాప పడాలి, అల్లాహ్ ను క్షమాభిక్ష కొరకు వేడుకోవాలి.
ఉదూ చేయు వాని నుండి అతని పాపములు దూరం కావడం కొరకు నియమం ఏమిటంటే,ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన విధంగా, అతడు ఆ ఉదూ ను ప్రారంభము నుండి చివరి వరకు ఎటువంటి భంగము, తొందర లేకుండా ఆచరించడం.
ఈ హదీసులో తెలుపబడిన “పాపములు తొలగిపోవుట” అనే విషయము, ఉదూ చేయు వాడు ‘కబాయిర్’ లనుండి (పెద్ద పాపముల నుండి) దూరంగా ఉండుట అనే దానితో ముడిపడి ఉన్నది. దివ్య ఖుర్’ఆన్’లో అల్లాహ్ ఇలా పేర్కొన్నాడు: “ఒకవేళ మీకు నిషేధించబడినటువంటి మహా పాపాలకు మీరు దూరంగా ఉంటే, మేము మీ చిన్నచిన్న దోషాలను మన్నించి, మిమ్మల్ని గౌరవ స్థానాల్లోకి ప్రవేశింపజేస్తాము. (సూరహ్ అన్’నిసా 4:31)
సహీహ్ ముస్లిం. (1/ 216) (245).
ఇంకా (6)
شرح رياض الصالحين.
لابن عثيمين (5/ 9).
نزهة المتقين شرح رياض الصالحين.
لمصطفى الخِن وغيره (2/ 763).
بهجة الناظرين.
سليم الهلالي (2/ 247).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
8 గ్రంథాలు- ఒక ముస్లిం కొరకు ఉపయోగకరమైన సంక్షిప్త రచనఎవరైతే ఉత్తమ రీతిలో ఉదూ చేస్తాడో అతని పాపాలు అతని శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి, చివరికి అతని గోళ్ళ క్రింద నుండి కూడా బయటకు వెళ్ళిపోతాయి.
- పరిశుద్ధత, నమాజు మరియు జనాజాకు సంబంధించిన ఫిఖీ నియమాలు (ఇస్లామీయ శాస్త్ర విధానాలు):«ఎవరైతే ఉత్తమ రీతిలో ఉదూ చేస్తాడో అతని పాపాలు అతని శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి, చివరికి అతని గోళ్ళ క్రింద నుండి కూడా బయటకు వెళ్ళిపోతాయి.»
ఇంకా (6)
- المختصر المفيد للمسلم الجديد(من توضأ فأحسن الوضوء خرجت خطاياه من جسده).
- المنتقى من المتجر الرابح في ثواب العمل الصالح - المعتمدالمنتقى من المتجر الرابح في ثواب العمل الصالح“من توضأ فأحسن الوضوء خرجت خطاياه من جسده حتى تخرج من تحت أظفاره”.
- خطب تعظيم قدر الصلاة"مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ خَرَجَتْ خَطَايَاهُ مِنْ جَسَدِهِ، حَتَّى تَخْرُجَ مِنْ تَحْتِ أَظْفَارِهِ" رواه مسلم [26]،
- رياض الصالحينرياض الصالحين مع فوائد وهدايات - 5«مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الوُضُوءَ، خَرَجَتْ خَطَايَاهُ مِنْ جَسَدِهِ حَتَّىٰ تَخْرُجَ مِنْ تَحْتِ أَظفارِه».
- مجموعة زاد الحديث(3)1«من توضَّأ فأحْسَنَ الوُضُوءَ خَرَجَت خطاياه من جَسَدِهِ حتى تخرجَ من تحتِ أظفارِهِ»
- مشروع منهاج زادكزادك 1 طالب«مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ خَرَجَتْ خَطَايَاهُ مِنْ جَسَدِهِ، حَتَّى تَخْرُجَ مِنْ تَحْتِ أَظْفَارِهِ»