“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “(ఓ ప్రవక్తా!) అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఘోరమైన పాపము ఏది?”; దానికి ఆయన “అల్లాహ్’యే నిన్ను సృష్టించినప్పటికీ (నీ సృష్టికర్త అయినప్పటికీ)
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “(ఓ ప్రవక్తా!) అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఘోరమైన పాపము ఏది?”; దానికి ఆయన “అల్లాహ్’యే నిన్ను సృష్టించినప్పటికీ (నీ సృష్టికర్త అయినప్పటికీ), అల్లాహ్ కు సాటిగా నీవు మరొకరిని తీసుకు రావడం, ” అన్నారు. దానిని నేను “నిశ్చయంగా అది ఘోరమైనదే” అన్నాను. తరువాత అడిగాను “(దాని) తరువాత ఏది?”; దానికి ఆయన “(నీవు తినే దానిలో) నీతో పాటు తింటాడు అనే భయంతో నీ బిడ్డను నీవు చంపడం” అన్నారు; నేను మళ్ళి అడిగాను: “దాని తరువాత ఏది?” అని. దానికి ఆయన “నీ పొరుగు వాని భార్యతో నీవు వ్యభిచరించడం” అన్నారు.
سَأَلْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: أَيُّ الذَّنْبِ أَعْظَمُ عِنْدَ اللهِ؟ قَالَ: «أَنْ تَجْعَلَ لِلهِ نِدًّا وَهُوَ خَلَقَكَ» قُلْتُ: إِنَّ ذَلِكَ لَعَظِيمٌ، قُلْتُ: ثُمَّ أَيُّ؟ قَالَ: «وَأَنْ تَقْتُلَ وَلَدَكَ؛ تَخَافُ أَنْ يَطْعَمَ مَعَكَ» قُلْتُ: ثُمَّ أَيُّ؟ قَالَ: «أَنْ تُزَانِيَ حَلِيلَةَ جَارِكَ».
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఘోరమైన పాపములను గురించి ప్రశ్నించడం జరిగింది, దానికి ఆయన ఇలా అన్నారు: వాటిలో అన్నింటికన్నా ఘోరమైనది “అష్’షిర్క్ అల్ అక్బర్” (పెద్ద షిర్క్); అంటే అల్లాహ్ యొక్క “ఉలూహియత్’లో” (కేవలం ఆయన మాత్రమే అన్ని ఆరాధనలకు ఏకైక నిజ ఆరాధ్యుడు అనే విషయములో); అల్లాహ్ యొక్క “రుబూబియత్”లో (కేవలం అల్లాహ్ మాత్రమే ఈ విశ్వం మొత్తానికీ ప్రభువు అనే విషయములో); మరియు అల్లాహ్ యొక్క “శుభ నామములలో”, మరియు ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన గుణగణాలలో - ఆయనకు సమానమైన వాడిగా, లేక ఆయనను పోలిన వానిగా, ఆయనకు సాటిగా మరొకరిని తీసుకు రావడం – ఇది అన్నింటికన్నా ఘోరమైన పాపము. ఈ పాపాన్ని అల్లాహ్ ఏ మాత్రమూ క్షమించడు – దీనికి పాల్బడినవాడు పశ్చాత్తాపము చెందితే తప్ప. ఒకవేళ అతడు ప్రశ్చాత్తపము చెందకుండా, దానిపైనే చనిపోతే అటువంటి వాడు శాశ్వతముగా నరకములో పడి ఉంటాడు. తరువాత – తనతో పాటు తింటాడు అనే భయంతో ఒక వ్యక్తి తన బిడ్డను తానే చంపడం. ఎవరినైనా ధర్మవిరుద్ధంగా చంపడం హరాం (నిషేధము). కానీ దాని తీవ్రత ఇంకా అధికమవుతుంది ఒకవేళ హతుడు, హంతకుడి బంధువు అయినట్లయితే; దాని తీవ్రత మరింత అధికమవుతుంది అల్లాహ్ ప్రాసాదించిన ఉపాధిలో అతడు కూడా భాగస్వామి అవుతాడు అనే ఉద్దేశ్యముతో హత్య చేసినట్లయితే. తరువాత – తన పొరుగువాని భార్యను మాయమాటలు చెప్పి, చివరికి మోసపూరితంగా లోబడిపోయేలా చేసుకుని ఆమెతో వ్యభిచరించడం. (ఇస్లాం లో) వ్యభిచారం హరాం (నిషేధము). ఆ పాపము యొక్క తీవ్రత మరింతగా ఎక్కువ అవుతుంది, అది తన పొరుగువాని భార్యతో అయినట్లయితే – ఎందుకంటే షరియత్ పొరుగువాని పట్ల దయతో, అతనితో మంచినడవడితో, ఒక మంచి పొరుగువానిగా ఉండమని ఆదేశిస్తున్నది.
......:
ఏ విధంగానైతే సత్కార్యాలు భిన్నమైన స్థాయిలు కలిగి ఉంటాయో, పాపకార్యాలు కూడా తీవ్రతలో హెచ్చుతగ్గులు కలిగి ఉంటాయి.
ఘోరమైన పాపములు: అల్లాహ్ కు సాటి కల్పించుట, నీతో పాటు (నీ ఉపాధి నుండి) తింటాదు అనే ఉద్దేశ్యముతో నీ సంతానాన్ని నీవే చంపుట; మరియు పొరుగువాని భార్యతో వ్యభిచరించుట.
నిశ్చయంగా, జీవనోపాధి అంతా అల్లాహ్ చేతిలోనే ఉంది. సర్వలోకాలకు జీవనోపాధిని ప్రసాదించేవాడు పరమ పవితుడైన ఆయనే (అల్లాహ్’యే).
(ఇస్లాం లో) పొరుగు వాని హక్కులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. అతనికి ఏ విధంగానైనా హాని, నష్టం కలిగించడం, ఇతరులకు హాని, నష్టం కలిగించిన దాని కంటే చాలా తీవ్రమైనది.
సృష్టికర్తయైన అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు ఏకైక అర్హుడు; ఆయనకు సాటి, సమానులు ఎవరూ లేరు.
సహీహ్ అల్ బుఖారీ. (6/ 18) (4477).
సహీహ్ ముస్లిం. (1/ 90) (86).
ఇంకా (5)
شرح النووي على مسلم (2/ 79).
فتح ذي الجلال والاكرام بشرح بلوغ المرام.
لابن عثيمين (6/ 288).
توضيح الأحكام من بلوغ المرام.
للبسام (7/ 335).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
11 గ్రంథాలు- మహాపాపాల నిఘంటువునేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఘోరమైన పాపము ఏది?”; దానికి ఆయన, “అల్లాహ్’యే నిన్ను సృష్టించినప్పటికీ, అల్లాహ్ కు సాటిగా నీవు మరొకరిని తీసుకు రావడం,” అన్నారు. [22]
- మహాపాపాల నిఘంటువునేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఘోరమైన పాపము ఏది?”; దానికి ఆయన “అల్లాహ్’యే నిన్ను సృష్టించినప్పటికీ, అల్లాహ్ కు సాటిగా నీవు మరొకరిని తీసుకు రావడం, ” అన్నారు. దానిని నేను “నిశ్చయంగా అది ఘ
ఇంకా (9)
- الخطب المنبريةموسوعة الخطب المنبرية (القسم الأول)«أَنْ تَجعَلَ لِلَّهِ نِدًّا وَهُوَ خَلَقَكَ»
- الصراط المستقيم(أي الذنب أعظم عند الله؟ قال: «أن تجعل لله نداً وهو خلقك». قلت: إن ذلك لعظيم، قلت: ثم أي؟ قال: «وأن تقتل ولدك تخاف أن يطعم معك». قلت: ثم أي؟ قال: «أن تزاني حليلة جارك).[58]
- حراسة التوحيدإقامة البراهين على حكم من استغاث بغير الله«أَنْ تَجْعَلَ لِلهِ نِدًّا وَهُوَ خَلَقَكَ».
- عقيدة الأئمة الأربعة«أَنْ تَجْعَلَ لِلَّهِ نِدًّا وَهُوَ خَلَقَكَ»
- قاموس الكبائر موسوعة الكبائر - المجموعة الأولىسَأَلْتُ النَّبِيَّ ﷺ: أَيُّ الذَّنْبِ أَعْظَمُ عِندَ اللَّهِ؟ قَالَ: «أَنْ تَجْعَلَ لِلهِ نِدًّا وَهُوَ خَلَقَكَ» [22].
- قاموس الكبائر موسوعة الكبائر - المجموعة الأولىسَألْتُ النَّبِيَّ ﷺ: أَيُّ الذَّنْبِ أَعْظَمُ عِنْدَ اللَّهِ؟ قَالَ: «أَنْ تَجْعَلَ لِلَّهِ نِدًّا وَهُوَ خَلَقَكَ»، قُلْتُ: إِنَّ ذَلِكَ لَعَظِيمٌ، قُلْتُ: ثُمَّ أَيُّ؟ قَالَ: «وَأَنْ تَقْتُلَ وَلَدَكَ تَخَافَ أَنْ يَطْعَمَ مَعَكَ»، قُلْت
- مجموعة زاد الحديث(3)1«أَنْ تَجْعَلَ لِلَّهِ نِدًّا وَهُوَ خَلَقَكَ»، قُلْتُ: إِنَّ ذَلِكَ لَعَظِيمٌ، قُلْتُ: ثُمَّ أَيُّ؟ قَالَ: «ثُمَّ أَنْ تَقْتُلَ وَلَدَكَ تَخَافُ أَنْ يَطْعَمَ مَعَكَ»، قُلْتُ: ثُمَّ أَيُّ؟ قَالَ: «ثُمَّ أَنْ تُزَانِيَ بِحَلِيلَةِ جَارِكَ»
- مشروع منهاج زادكزادك 2 طالب نهائي«أَنْ تُزَانِيَ حَلِيلَةَ جَارِكَ»
- نبراس طالب (5)1«أَنْ تَجْعَلَ للهِ نِدًّا وَهُوَ خَلَقَكَ». قُلتُ: ثُمَّ أيٌّ؟ قال: «أنْ تَقْتُلَ وَلَدَكَ مِنْ أجْلِ أنْ يَطْعَمَ مَعَكَ». قُلتُ: ثُمَّ أيٌّ؟ قال: «أنْ تُزَانِيَ حَلِيلَةَ جَارِكَ»