చెడు ఎందుకు సృష్టించబడింది?
- محاور التعريف بالإسلام
- الغاية من خلق الإنسان ومعنى الحياةالخير والشر
- مصدر الإجابة
- قسم الإيمان
- الباب / الفصل
- (قسم الإيمان)
السؤال
చెడు ఎందుకు సృష్టించబడింది?
الجواب
అల్లాహ్ ఎందుకు చెడును సృష్టించాడు అనే ప్రశ్న వేయడం లేదా దానిపై అభ్యంతరం వ్యక్తం చేయడం తగదు; ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ సృష్టికర్త మరియు ఆయన చేసే పనుల గురించి ఆయనను ఎవరూ ప్రశ్నించలేరు, బదులుగా ఆయనే ప్రశ్నిస్తాడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾తాను చేసే దానిని గురించి ఆయన (అల్లాహ్) ప్రశ్నించబడడు, కాని వారు ప్రశ్నించబడతారు﴿
[అల్ అంబియా :23]
ఇక మంచి, చెడుల ఉనికి మరియు సృష్టిలో ఉన్న కొంత విజ్ఞత (హిక్మత్) ఈ క్రింది విధంగా ఉంది:
- బాధ్యత గలవారికి మంచి మరియు చెడుల ద్వారా పరీక్ష మరియు శోధన ఉంటుంది, తద్వారా సహనం పాటించేవారు ఇతరుల నుండి, మరియు విశ్వాసపరులు ఇతరుల నుండి స్పష్టమవుతారు. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:
﴾ఆయనే! మీలో మంచిపనులు చేసే వారెవరో పరీక్షించటానికి, చావు-బ్రతుకులను సృష్టించాడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు.﴿
[ముల్క్ : 2]
పరిశుద్ధుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:
﴾... మరియు మేము మీ అందరినీ, మంచి మరియు చెడు స్థితులకు గురి చేసి, పరీక్షిస్తాము. మరియు మీరందరూ మా వైపునకే మరలింపబడతారు.﴿
అల్లాహ్ దాసులను ఇహలోకంలో సృష్టించాడు, వారికి ఆదేశించాడు మరియు వారిని నిషేదించాడు. మరియు మంచి మరియు చెడుల ద్వారా, సిరిసంపదలు మరియు పేదరికం ద్వారా, గౌరవం మరియు అవమానం ద్వారా, జీవితం మరియు మరణం ద్వారా వారిని పరీక్షించాడు, ఇది సర్వోన్నతుడైన ఆయన వైపు నుండి ఒక పరీక్ష; తద్వారా వారిలో ఎవరి క్రియలు అత్యుత్తమమైనవో, మరియు పరీక్షల సమయాలలో ఎవరు దానికి గురవుతారో మరియు ఎవరు రక్షించబడతారో వారిని పరీక్షించటానికి.
﴾మీరందరూ మా వైపునకే మరలింపబడతారు.﴿
కాబట్టి మీ ఆచరణలపరంగా మేము మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము, అది మంచి అయితే మంచి, మరియు చెడు అయితే చెడు.
﴾మరియు నీ ప్రభువు తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు.﴿ [ఫుస్సిలత్: 64]
- విశ్వం యొక్క ద్వంద్వత్వాన్ని నిర్ధారించడం; చెడును తెలుసుకోవడం ద్వారా మాత్రమే మంచిని తెలుసుకోగలము, విషయాలు వాటి వ్యతిరేకతల ద్వారానే స్పష్టమవుతాయి, మరియు మంచి యొక్క ఉనికికి చెడు అవసరం ఎందుకంటే దానికి వ్యతిరేకంగా చేసే ప్రయత్నమే అది. మంచి మరియు చెడు, మరియు వాటి మధ్య మనిషి మారుతూ ఉండటం ఇహలోక జీవితం యొక్క స్వభావం.
- చెడు అనేది సాపేక్షమైన విషయం; కొందరికి చెడుగా అనిపించే విషయం మరికొందరికి మేలుగా అనిపించవచ్చు. ఉదాహరణకు, దొంగ చేతిని నరకడం అతనికి చెడు అయినప్పటికీ, సమాజానికి అందులో మేలు ఉంది. ఎందుకంటే, ఒకరి ఆస్తులపై మరొకరు అక్రమంగా పాల్పడకుండా ఇది ప్రజలను నిరోధిస్తుంది.
- బాధ్యుడైన వ్యక్తి యొక్క న్యాయమైన పరీక్షకు గల నిజమైన అర్థాన్ని నిరూపించడం; నిశ్చయంగా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మనిషికి మంచి మరియు చెడు మార్గాలను స్పష్టంగా తెలియజేశాడు మరియు వాటి మధ్య ఎంపిక చేసుకునే స్వేచ్ఛను అతనికి ప్రసాదించాడు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఏమిటి? మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా?
మరియు నాలుకను మరియు రెండు పెదవులను.
మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.﴿
[అల్ బలద్: 8-10]
అంటే: ఏమీ మేము అతని కొరకు అతను చూసే రెండు కళ్ళను, అతను మాట్లాడే ఒక నాలుకను మరియు రెండు పెదవులను తయారు చేయలేదా? మరియు అతనికి మేము మంచి మరియు చెడుల మార్గమును స్పష్టపరచలేదా?
- మనం చూసే చెడులలో చాలా వరకు అన్ని విధాలా కేవలం చెడు మాత్రమే కావు, పైగా వాటిలో మంచి కోణాలు కూడా ఉంటాయి. మనం చెడుగా భావించే వాటిలో ఎంతో గొప్ప మేలు దాగి ఉంటుంది. ఒక వ్యక్తి ఏదైనా వ్యాధికి గురికావచ్చు, అది అంతకంటే పెద్ద చెడు నుండి అతన్ని దూరం చేయడానికి కారణం కావచ్చు. ఒక వ్యక్తి ఏదైనా ఆర్థిక లావాదేవీలో నష్టపోవచ్చు, ఒకవేళ అతను దానిని పొంది ఉంటే అహంకారిగా మరియు దౌర్జన్యకారుడిగా మారేవాడేమో. ఒక వ్యక్తి సంతానం మరణించవచ్చు, బహుశా ఆ బిడ్డ జీవించి ఉంటే అతనికి ఆపదగా మారేవాడేమో. ఒక వ్యక్తి తన కర్మల వలన నరకానికి అర్హుడై ఉండవచ్చు, అదే నిజమైన విపత్తు, అప్పుడు అల్లాహ్ అతన్ని ఏదైనా ఆపదకు గురిచేస్తాడు, దానిపై అతను సహనం పాటిస్తాడు, అప్పుడు అతని ఆ సహనానికి ప్రతిఫలంగా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు, మరియు అదే శాశ్వతమైన నిజమైన మేలు.
కావున పరిశుద్ధుడు మరియు మహోన్నతుడైన అల్లాహ్ కేవలం చెడును సృష్టించడు, మరియు ఆయనకు చెడు ఆపాదించబడదు. సహీహ్ హదీసులో ఉన్నట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
"మరియు చెడు మీకు చెందదు"
[దీన్ని ముస్లిం ఉల్లేఖించారు].
- మంచి మరియు చెడుల ఉనికిలోని మహిమావివేచనాలలో ఒకటి, పరస్పర విరుద్ధమైన వాటిని సృష్టించడంలో మహోన్నతుడైన ప్రభువు యొక్క శక్తి వ్యక్తమవ్వడం, మరియు ఆయన ఆధిపత్య నామాల ప్రభావాలు వ్యక్తమవ్వడం. అనగా: నిశ్చయంగా పరమ పవిత్రుడైన అల్లాహ్ తన నామాలు మరియు క్రియల ప్రభావాలను వ్యక్తపరుస్తాడు. ఉదాహరణకు ఆయన సర్వాధికారి, ప్రతీకారం తీర్చువాడు, న్యాయశీలుడు కావడం వంటివి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾అల్లాహ్ యే సప్తాకాశాలను మరియు వాటిని పోలిన భూమండలాన్ని సృష్టించి, వాటి మధ్య ఆయన తన ఆదేశాలను అవతరింపజేస్తూ వుంటాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు మరియు వాస్తవానికి అల్లాహ్ తన జ్ఞానంతో ప్రతిదానిని పరివేష్టించి వున్నాడని మీరు తెలుసుకోవటానికి.﴿
[అత్-తలాఖ్ 12]
చెడులు వాటికవే ఉద్దేశించబడలేదు, మరియు సృష్టి సృష్టించబడిన లక్ష్యం కూడా అవి కావు. అవి ఒక ఇష్టమైన ప్రయోజనం కోసం విధిగా నిర్ణయించబడినవి మరియు దానికి సాధనంగా చేయబడ్డాయి. కాబట్టి, అవి దేనికోసమైతే నిర్ణయించబడ్డాయో అది నెరవేరినప్పుడు, అవి క్షీణించి కనుమరుగవుతాయి మరియు పరిస్థితి సంపూర్ణమైన మంచికి తిరిగి వస్తుంది.
ఈ ప్రపంచం ఒక తాత్కాలిక నివాసమని, మరియు ఇది ఒక పరీక్షా స్థలము, కష్టాలు మరియు లోపాలతో కూడినదని దృఢంగా విశ్వసించేంత వరకు, చెడు ఉనికి వెనుక ఉన్న ఆంతర్యాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. మరియు ఇందులో సంపూర్ణ పరిపూర్ణతను చూడాలని ఆశించేవాడు, పరలోక నివాసమే పరిపూర్ణ నివాసంగా ఉండాలని నిర్ణయించిన దైవిక వివేకానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లే.
విశ్వసించిన వాని గురించి మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾నా జాతి ప్రజలారా! నిశ్చయంగా, ఈ ఇహలోక జీవిత సుఖం తాత్కాలికమైనదే మరియు నిశ్చయంగా, పరలోకమే శాశ్వతమైన నివాస స్థలము.﴿
[గాఫిర్ 39]
المصدر
ملاحظات
--