Skip to content
التوبَة /

ఆయత్ 24

9 : 24

ఆయత్ 24 of التوبَة (9 : 24). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

التوبَة ఆయతులు 129
సూరా · التوبَة
తెలుగు · Muhammad
9 : 24

قُلۡ إِن كَانَ ءَابَآؤُكُمۡ وَأَبۡنَآؤُكُمۡ وَإِخۡوَٰنُكُمۡ وَأَزۡوَٰجُكُمۡ وَعَشِيرَتُكُمۡ وَأَمۡوَٰلٌ ٱقۡتَرَفۡتُمُوهَا وَتِجَٰرَةٞ تَخۡشَوۡنَ كَسَادَهَا وَمَسَٰكِنُ تَرۡضَوۡنَهَآ أَحَبَّ إِلَيۡكُم مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦ وَجِهَادٖ فِي سَبِيلِهِۦ فَتَرَبَّصُواْ حَتَّىٰ يَأۡتِيَ ٱللَّهُ بِأَمۡرِهِۦۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡفَٰسِقِينَ

వారితో ఇలా అను: "మీ తండ్రితాతలు మీ కుమారులు, మీ సోదరులు, మీ సహవాసులు (అజ్వాజ్), మీ బంధువులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు, మందగిస్తాయేమోనని భయపడే మీ వ్యాపారాలు, మీకు ప్రీతికరమైన మీ భవనాలు - అల్లాహ్ కంటే, ఆయన ప్రవక్త కంటే మరియు ఆయన మార్గంలో పోరాడటం కంటే - మీకు ఎక్కువ ప్రియమైనవైతే, అల్లాహ్ తన తీర్పును బహిర్గతం చేసే వరకు నిరీక్షించండి. మరియు అల్లాహ్ అవిధేయులైన జాతి వారికి సన్మార్గం చూపడు."

Explanation & meanings · 1
  1. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "ఎవరిచేతిలోనైతే నా ప్రాణాలున్నాయో ఆ అల్లాహ్ (సు.తా.) తోడు. మీలో ఏ ఒక్కడు కూడా ముఅ'మిన్ కాజాలడు, ఎంతవరకైతే అతడు తన తండ్రి, తన సంతానం మరియు ఇతరులందరికంటే, నన్ను ('స'అస) ఎక్కువగా ప్రేమించడో!" ('స'హీ'హ్ బుఖా'రీ, కితాబ్ అల్ - ఈమాన్, బాబ్ 'హుబ్బె రసూల్ ('స'అస) మినల్ ఈమాన్; 'స'హీ'హ్ ముస్లిం, కితాబ్ అల్ - ఈమాన్).