Skip to content
التوبَة /

ఆయత్ 25

9 : 25

ఆయత్ 25 of التوبَة (9 : 25). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

التوبَة ఆయతులు 129
సూరా · التوبَة
తెలుగు · Muhammad
9 : 25

لَقَدۡ نَصَرَكُمُ ٱللَّهُ فِي مَوَاطِنَ كَثِيرَةٖ وَيَوۡمَ حُنَيۡنٍ إِذۡ أَعۡجَبَتۡكُمۡ كَثۡرَتُكُمۡ فَلَمۡ تُغۡنِ عَنكُمۡ شَيۡـٔٗا وَضَاقَتۡ عَلَيۡكُمُ ٱلۡأَرۡضُ بِمَا رَحُبَتۡ ثُمَّ وَلَّيۡتُم مُّدۡبِرِينَ

వాస్తవానికి ఇది వరకు చాలా యుద్ధరంగాలలో (మీరు కొద్దిమంది ఉన్నా) అల్లాహ్ మీకు విజయం చేకూర్చాడు. మరియు హునైన్ (యుద్ధం) రోజు మీ సంఖ్యాబలం మీకు గర్వకారణమయింది. కాని, అది మీకు ఏ విధంగానూ పనికి రాలేదు మరియు భూమి విశాలమైనది అయినప్పటికీ మీకు ఇరుకై పోయింది. తరువాత మీరు వెన్ను చూపి పారిపోయారు.

Explanation & meanings · 1
  1. 'హునైన్, మక్కా మరియు 'తాయిప్ ల మధ్య పర్వతాలలో ఉన్న ఒక లోయ (వాది). అక్కడ హవా'జిన్ మరియు స'ఖీఫ్ అనే రెండు తెగలవారు ఉండేవారు. వారు విలువిద్యలో నిపుణులు. వారు ముస్లింలకు విరుద్ధంగా పోరాడటానికి, యుద్ధ తయారీలు చేస్తున్నారని తెలుసుకొని దైవప్రవక్త ('స'అస), 12,000 సైనికులతో, మక్కా విజయపు 18-19 దినాల తరువాత 8వ హిజ్రీ, షవ్వాల్ నెలలో వారిపై దాడి చేయడానికి వెళ్తారు. ముస్లింలకు తమ సంఖ్యాబలం కొంత వరకు గర్వానికి కారణమవుతుంది. ఇది అల్లాహ్ (సు.తా.)కు నచ్చదు. శత్రువులు దాదాపు 4,000 మంది ఉంటారు. శత్రువుల బాణాల దెబ్బలకు తాళుకోలేక ముస్లిం సైనికులు వెనుదిరిగి పారిపోసాగుతారు. కేవలం దైవప్రవక్త ('స'అస), కొందరు ముస్లింలతో బాటు మిగిలిపోతారు. దైవప్రవక్త ('స'అస), పారిపోయేవారిని ఆపటానికి కేకలు వేస్తారు. తరువాత అతను ('స'అస), 'అబ్బాస్ (ర.'ది.'అ)తో వారిని పిలవమని అంటారు. అతను పెద్ద పెద్ద కేకలు వేయటం వల్ల, సిగ్గుపడి కొందరు తిరిగి వస్తారు. ఆ ఉన్నవారే ధైర్యస్థైర్యాలతో యుద్ధం చేసి అల్లాహ్ (సు.తా.) అనుగ్రహంతో విజయం పొందుతారు. శత్రువులు తమ ఆస్తిపాస్తులన్నీ విడిచి పారిపోతారు.