Skip to content
التوبَة /

ఆయత్ 18

9 : 18

ఆయత్ 18 of التوبَة (9 : 18). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

التوبَة ఆయతులు 129
సూరా · التوبَة
తెలుగు · Muhammad
9 : 18

إِنَّمَا يَعۡمُرُ مَسَٰجِدَ ٱللَّهِ مَنۡ ءَامَنَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَأَقَامَ ٱلصَّلَوٰةَ وَءَاتَى ٱلزَّكَوٰةَ وَلَمۡ يَخۡشَ إِلَّا ٱللَّهَۖ فَعَسَىٰٓ أُوْلَٰٓئِكَ أَن يَكُونُواْ مِنَ ٱلۡمُهۡتَدِينَ

నిశ్చయంగా, అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించేవారు, నమాజ్ ను స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడని వారు మాత్రమే అల్లాహ్ మస్జిదులను నిర్వహించాలి. ఇలాంటి వారే మార్గదర్శకత్వం పొందినవారని ఆశించవచ్చు!

Explanation & meanings · 1
  1. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'ఒకవేళ మీరు ఒక వ్యక్తిని సక్రమంగా మస్జిద్ కు వస్తూ ఉండేది చూస్తే, అతని విశ్వాసానికి సాక్ష్యం ఇవ్వండి.' (తిర్మిజీ', తఫ్సీర్ 'సూ. అత్-తౌబహ్). ఖుర్ఆన్ లో ఇక్కడ కూడా అల్లాహ్ (సు.తా.)ను అంతిమదినాన్ని విశ్వసించిన తరువాత చేయవలసిన పనులలో నమా'జ్, దాని తరువాత 'జకాత్ అని పేర్కొనబడ్డాయి. మరొక 'హదీస్' ముత్తఫిఖ్ అలైహి ఉంది. అబూ-బక్ర్ 'సిద్ధీఖ్ (ర'ది.'అ) అన్నారు: 'అల్లాహ్ తోడు, నేను అలాంటి వారితో తప్పక పోరాడుతాను, ఎవరైతే నమా'జ్ మరియు 'జకాత్ ల మధ్య భేదం చూపుతారో!' అంటే నమా'జ్ చేస్తారు కాని 'జకాత్ ఇవ్వడానికి వెనుకంజవేస్తారో! (చూడండి, 9:5).