Skip to content
అల్-మాఇదహ్ /

ఆయత్ 105

5 : 105

ఆయత్ 105 of అల్-మాఇదహ్ (5 : 105). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-మాఇదహ్ ఆయతులు 120
సూరా · అల్-మాఇదహ్
తెలుగు · Muhammad
5 : 105

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ عَلَيۡكُمۡ أَنفُسَكُمۡۖ لَا يَضُرُّكُم مَّن ضَلَّ إِذَا ٱهۡتَدَيۡتُمۡۚ إِلَى ٱللَّهِ مَرۡجِعُكُمۡ جَمِيعٗا فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ

ఓ విశ్వాసులారా! మీ స్వయానికి మీరు బాధ్యత వహించండి. మీరు సన్మార్గంలో ఉంటే, మార్గభ్రష్టులైన వారు మీకు ఎలాంటి హాని చేయలేరు. మీరంతా అల్లాహ్ వైపునకే మరలి పోవలసి వుంది. అప్పుడు ఆయన మీరేమేమి చేస్తూ ఉండే వారో మీకు తెలియజేస్తాడు.

Explanation & meanings · 1
  1. ప్రజలు ఈ ఆయత్ ను సరిగ్గా అర్థం చేసుకోలేనందువలన అబూ బక్ర్ సిద్ధీఖ్ (ర'ది.'అ) వారితో ఇలా అన్నారు: "ప్రజలారా! నేను దైవప్రవక్త ('స'అస) ను ఇలా అంటుండగా విన్నాను: 'ప్రజలు చెడు జరుగుతుండగా చూసి, దానిని మార్చటానికి ప్రయత్నం చేయకుంటే త్వరలోనే అల్లాహ్ (సు.తా.) వారిని తన శిక్షకు గురి చేయవచ్చు!' " (ముస్నద్ అ'హ్మద్ పుస్తకము - 1, పేజీ - 5. తిర్మిజీ', 'హదీస్' నం. 2178; అబూ దావూద్, 'హదీస్' నం. 4338). ఈ ఆయత్ అర్థం ఏమిటంటే : మీరు సన్మార్గం మీద ఉండి, చెడు నుండి దూరంగా ఉంటూ, ప్రజలకు సన్మార్గం చూపుతూ దుర్మార్గం నుండి ఆపుతూ ఉంటే, వారు మీ మాటను లక్ష్యపెట్టనిచో మీ పని మీరు చేశారు. దానికి ప్రతిఫలం పొందుతారు. కాని మీ ప్రాణానికి హాని కలిగే భయం ఉంటే! మీరు: 'అమ్ర్ బిల్ మ'అరూఫ్ వ నహా 'అనిల్ మున్కర్.' ను ఉపేక్షించవచ్చు!