35 : 32
ثُمَّ أَوۡرَثۡنَا ٱلۡكِتَٰبَ ٱلَّذِينَ ٱصۡطَفَيۡنَا مِنۡ عِبَادِنَاۖ فَمِنۡهُمۡ ظَالِمٞ لِّنَفۡسِهِۦ وَمِنۡهُم مُّقۡتَصِدٞ وَمِنۡهُمۡ سَابِقُۢ بِٱلۡخَيۡرَٰتِ بِإِذۡنِ ٱللَّهِۚ ذَٰلِكَ هُوَ ٱلۡفَضۡلُ ٱلۡكَبِيرُ
ఆ తరువాత మేము ఈ గ్రంథానికి, మా దాసులలో నుండి మేము ఎన్నుకున్న వారిని వారసులుగా చేశాము. వారిలో కొందరు తమకు తాము అన్యాయం చేసుకున్న వారున్నారు, మరికొందరు మధ్యస్థంగా ఉండేవారున్నారు, ఇంకా కొందరు అల్లాహ్ సెలవుతో సత్కార్యాలలో మున్ముందు ఉండే వారూ ఉన్నారు. ఇదే ఆ గొప్ప అనుగ్రహం.
Explanation & meanings · 4
- గ్రంథం అంటే ఖుర్ఆన్, ఎన్నుకున్నవారు అంటే అంటే ము'హమ్మద్ ('స'అస) ను అనుసరించేవారు, ముస్లింలు అని అర్థం. ఇటువంటి ఆయత్ కు చూడండి, 2:143.
- ము'హమ్మద్ ('స'అస) ఉమ్మత్ లో మూడు రకాల వారున్నారు. వీరు మొదటి రకానికి చెందినవారు : తమకు తాము అన్యాయం చేసుకునే వారున్నారు. వీరు కొన్ని విధు(ఫ'రాయద్)లను ఉపేక్షిస్తారు. మరియు కొన్ని 'హరామ్ - నిషిద్ధ విషయాల నుండి దూరంగా ఉండరు, కాబట్టి వీరిని తమకు తాము అన్యాయం చేసుకున్నవారు అన్నారు. వీరు తమకు తాము అన్యాయం చేసుకున్నందుకు ఇతర రెండు రకాల వారి స్థానాలకు చేరలేక పోతారు. చూడండి, 7:46.
- వీరు రెండో రకానికి చెందినవారు, మధ్యస్థంగా ఉండేవారు. వీరు కొన్నిసార్లు ముస్త'హబ్ విషయాలను విడిచి పెడతారు. మరియు కొన్ని ము'హర్రమాత్ లను పాటించరు.
- వీరు మూడో రకానికి చెందినవారు, మొదట పేర్కొన్న ఇద్దరికంటే ధర్మ విషయాలలో మున్ముందు ఉండేవారు.