Skip to content
سَبإ /

ఆయత్ 46

34 : 46
سَبإ ఆయతులు 54
సూరా · سَبإ
తెలుగు · Muhammad
34 : 46

۞ قُلۡ إِنَّمَآ أَعِظُكُم بِوَٰحِدَةٍۖ أَن تَقُومُواْ لِلَّهِ مَثۡنَىٰ وَفُرَٰدَىٰ ثُمَّ تَتَفَكَّرُواْۚ مَا بِصَاحِبِكُم مِّن جِنَّةٍۚ إِنۡ هُوَ إِلَّا نَذِيرٞ لَّكُم بَيۡنَ يَدَيۡ عَذَابٖ شَدِيدٖ

(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "వాస్తవానికి, నేను మీకు ఒక విషయం బోధిస్తాను: 'మీరు అల్లాహ్ కొరకు ఇద్దరిద్దరిగా, ఒక్కొక్కరిగా నిలవండి. తరువాత బాగా ఆలోచించండి!' మీతోపాటు ఉన్న ఈ వ్యక్తికి (ప్రవక్తకు) పిచ్చి పట్టలేదు. అతను కేవలం, మీపై ఒక ఘోరశిక్ష రాకముందే, దానిని గురించి మిమ్మల్ని హెచ్చరించేవాడు మాత్రమే!"

Explanation & meanings · 2
  1. చూడండి, 7:184.
  2. ఒకరోజు దైవప్రవక్త ('స'అస) 'సఫా గుట్టమీద ఎక్కి అంటారు: "ఓ ప్రజలారా, వినండి!". ప్రజలందరూ అక్కడికి చేరుకుంటారు. "ఒకవేళ: 'ఉదయమో, సాయంత్రమో, శత్రువు మీపై దాడి చేయనున్నాడు.' అని అంటే మీరు నమ్ముతారా?" వారంటారు: "ఎందుకు నమ్మము." అప్పుడతను ('స'అస) అంటారు: "అయితే వినండి! నేను మిమ్మల్ని ఘోరశిక్ష రాక ముందు విశ్వసించండని హెచ్చరిస్తున్నాను." దానికి అబూ-లహబ్ అంటాడు: "నీ పాడుగాను, దీనికా నీవు మమ్మల్ని ప్రోగుచేసింది?" అప్పుడు అల్లాహ్ (సు.తా.) సూరహ్ అల్-మసద్ (111) అవతరింపజేశాడు. ('స'హీ'హ్ బు'ఖారీ).