22 : 28
لِّيَشۡهَدُواْ مَنَٰفِعَ لَهُمۡ وَيَذۡكُرُواْ ٱسۡمَ ٱللَّهِ فِيٓ أَيَّامٖ مَّعۡلُومَٰتٍ عَلَىٰ مَا رَزَقَهُم مِّنۢ بَهِيمَةِ ٱلۡأَنۡعَٰمِۖ فَكُلُواْ مِنۡهَا وَأَطۡعِمُواْ ٱلۡبَآئِسَ ٱلۡفَقِيرَ
వారు, తమ కొరకు ఇక్కడ ఉన్న ప్రయోజనాలను అనుభవించటానికి మరియు ఆయన వారికి జీవనోపాధిగా ప్రసాదించిన పశువుల మీద, నిర్ణీత దినాలలో అల్లాహ్ పేరును స్మరించి (జిబహ్ చేయటానికి), కావున దానిని (వాటి మాంసాన్ని) తినండి మరియు లేమికి గురి అయిన నిరుపేదలకు తినిపించండి.
Explanation & meanings · 1
- అయ్యామిమ్ మ'లూమాత్: అంటే జి''బహ్ చేసే దినాలు, అంటే 10వ తేదీ మరియు దాని తరువాత మూడు దినాలు, అంటే 11, 12, 13 జు'ల్-'హజ్ తేదీలు. దాని మూడోవంతు మాంసాన్ని నిరుపేదలకు పంచటం విధి. ఈ 'జిబహ్ ఇస్మాయీల్ ('అ.స.) ను, అంతని తండ్రి ఇబ్రాహీమ్ ('అ.స.) - అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞతో - జి''బహ్ చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవటానికే. అంటే అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞలను శిరసావహించటమే ప్రతి ముస్లిం విధి. చూడండి, 37:102-107.