Skip to content
సూరాల జాబితా /

المَاعُون

المَاعُون is chapter 107 of the Quran and has 7 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

7 ఆయతులు సూరా సంఖ్య 107
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

أَرَءَيۡتَ ٱلَّذِي يُكَذِّبُ بِٱلدِّينِ

తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా?

Explanation & meanings · 1
  1. ఈ ఆయతు దైవప్రవక్త ('స'అస)ను సంభోదిస్తోంది. దీన్ - అంటే పునరుత్థాన (తీర్పు) దినం. చూడండి, 109:6.

فَذَٰلِكَ ٱلَّذِي يَدُعُّ ٱلۡيَتِيمَ

అతడే అనాథులను కసరి కొట్టేవాడు;

Explanation & meanings · 1
  1. ఎందుకంటే అతడు పిసినారి, తీర్పుదినాన్ని విశ్వసించని వాడు మరియు ఇహలోకంలో చేసిన పుణ్యాలకు పరలోకంలో లభించే ప్రతిఫలాన్ని విశ్వసించని వాడు.

وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ

మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు.

فَوَيۡلٞ لِّلۡمُصَلِّينَ

కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు!

Explanation & meanings · 1
  1. అనాథులను కసిరి కొట్టేవారికి, ఆకలిగొన్న పేదలకు అన్నం పెట్టని వారికి, నమా'జ్ చేయని వారికి 'వైల్' అనే నరకమే నివాస స్థల మవుతుంది. ఎందుకంటే వారు కపట విశ్వాసులు, హృదయపూర్వకంగా కాక ఇతరులకు చూపటానికే నమా'జ్ చేసేవారు.

ٱلَّذِينَ هُمۡ عَن صَلَاتِهِمۡ سَاهُونَ

ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో!

Explanation & meanings · 1
  1. ఇలాంటి వారు అసలు నమా'జ్ చేయరు. ఒకవేళ చేసినా అశ్రద్ధతో చేస్తారు, నిర్ణీత సమయంలో చేయరు. భయభక్తులతో నమా'జ్ చేయరు. చూడండి, 4:142.