Skip to content
సూరాల జాబితా /

القَارعَة

القَارعَة is chapter 101 of the Quran and has 11 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

11 ఆయతులు సూరా సంఖ్య 101
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

ٱلۡقَارِعَةُ

ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం!

Explanation & meanings · 1
  1. అల్-'ఖారిఅతు: అంటే హృదయాలను అదరగొట్టేది, పునరుత్థాన దినపు పేర్లలో ఒకటి. చూడండి, 14:48, 20:105-107. దాని ఇతర పేర్లు (1) అల్-'హాఖ్ఖతు, (2) అత్తామ్మతు, (3) అస్సాఖ్ఖతు, (4) అల్-'గాషియతు, (5) అస్సా'అతు (6) అల్-వాఖి'అతు; (7) అల్-ఖారి'అతు.

مَا ٱلۡقَارِعَةُ

ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం?

وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡقَارِعَةُ

మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు?

يَوۡمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلۡفَرَاشِ ٱلۡمَبۡثُوثِ

ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు.

Explanation & meanings · 1
  1. అల్-ఫరాషు: Moath, Lepidoptira రాత్రులలో తిరిగే చిన్న పురుగు, చిమ్మెట, దీపపు పురుగు.

وَتَكُونُ ٱلۡجِبَالُ كَٱلۡعِهۡنِ ٱلۡمَنفُوشِ

మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి.

Explanation & meanings · 1
  1. చూఅల్-'ఇహ్ నున్: రంగురంగుల అల్-మన్ ఫూష్: ఏకిన దూది.