{ఏమీ? హజ్జ్ మరియు ఉమ్రహ్ కొరకు వచ్చే వారికి నీరు త్రాగించడాన్ని మరియు మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించటాన్ని, మీరు అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించిన వారి(తో సమానంగా) భావిస్తున్నారా?} [అత్-తౌబా 9:19] ఆయతు చివరి వరకు.
నుమాన్ బిన్ బషీర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన:
నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మింబర్ వద్ద ఉన్నాను. అప్పుడు ఒక వ్యక్తి ఇలా అన్నాడు: 'ఇస్లాం స్వీకరించిన తర్వాత, హజ్ యాత్రికులకు నీరు త్రాగించడం తప్ప మరే ఇతర సత్కార్యం చేయకపోయినా నేను పట్టించుకోను'. మరొకరు ఇలా అన్నారు: 'ఇస్లాం స్వీకరించిన తర్వాత, మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించడం తప్ప మరే ఇతర సత్కార్యం చేయకపోయినా నేను పట్టించుకోను'. మరొకరు ఇలా అన్నారు: 'అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం మీరు చెప్పిన వాటన్నిటికంటే ఉత్తమమైనది'. అప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు వారిని గద్దించి ఇలా అన్నారు: 'ఇది జుమహ్ రోజు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మింబర్ వద్ద మీ స్వరాలను పెంచకండి. అయితే, నేను జుమహ్ నమాజ్ పూర్తి చేశాక, (ప్రవక్త వద్దకు) వెళ్లి మీరు విభేదిస్తున్న విషయం గురించి ఆయనను అడిగి స్పష్టత తీసుకుంటాను'. అప్పుడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేశాడు: {ఏమీ? హజ్జ్ మరియు ఉమ్రహ్ కొరకు వచ్చే వారికి నీరు త్రాగించడాన్ని మరియు మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించటాన్ని, మీరు అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించిన వారి(తో సమానంగా) భావిస్తున్నారా?} [అత్-తౌబా 9:19] ఆయతు చివరి వరకు.
كُنْتُ عِنْدَ مِنْبَرِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ رَجُلٌ: مَا أُبَالِي أَلَّا أَعْمَلَ عَمَلًا بَعْدَ الإِسْلَامِ إِلَّا أَنْ أُسْقِيَ الحَاجَّ، وَقَالَ آخَرُ: مَا أُبَالِي أَلَّا أَعْمَلَ عَمَلًا بَعْدَ الإِسْلَامِ إِلَّا أَنْ أَعْمُرَ المَسْجِدَ الحَرَامَ، وَقَالَ آخَرُ: الجِهَادُ فِي سَبِيلِ اللهِ أَفْضَلُ مِمَّا قُلْتُمْ، فَزَجَرَهُمْ عُمَرُ، وَقَالَ: لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ عِنْدَ مِنْبَرِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَهُوَ يَوْمُ الجُمُعَةِ، وَلَكِنْ إِذَا صَلَّيْتُ الجُمُعَةَ دَخَلْتُ فَاسْتَفْتَيْتُهُ فِيمَا اخْتَلَفْتُمْ فِيهِ، فَأَنْزَلَ اللهُ عَزَّ وَجَلَّ: {أَجَعَلْتُمْ سِقَايَةَ الْحَاجِّ وَعِمَارَةَ الْمَسْجِدِ الْحَرَامِ كَمَنْ آمَنَ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِ} [التوبة: 19] الآيَةَ إِلَى آخِرِهَا.
నుమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించారు, తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మింబర్ వద్ద కూర్చొని ఉండగా, ఒక వ్యక్తి ఇలా అనడం విన్నారు: "ఇస్లాం స్వీకరించిన తర్వాత, నేను హాజీలకు నీరు అందించడం తప్ప మరే ఇతర ఆచరణ చేయకపోయినా నాకు పర్వాలేదు. మరొకరు అన్నారు: నేను ఇస్లాం స్వీకరించిన తర్వాత, మస్జిద్ అల్-హరామ్ కు సేవ చేయటం తప్ప మరే ఇతర పని చేయకపోయినా నాకు ఫర్వాలేదు. ఇంకొకరు అన్నారు: అల్లాహ్ మార్గంలో చేసే జిహాద్ మీరిద్దరూ చెప్పిన దాని కంటే శ్రేష్ఠమైనది. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మింబర్ వద్ద బిగ్గరగా మాట్లాడకుండా వారిని గద్దించారు, అది జుమహ్ రోజు ఉదయం, అయితే జుమహ్ నమాజు చదివిన తర్వాత ఆయన వద్దకు వెళ్లి మీరు విభేదించుకున్న విషయం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి తీర్పు కోరతాను, అప్పుడు అల్లాహ్ అజ్జ వ జల్ ఈ ఆయతును అవతరింపజేశాడు: ఏమీ? హజ్జ్ మరియు ఉమ్రా కొరకు వచ్చే వారికి నీరు త్రాగించటాన్ని మరియు మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించటాన్ని, మీరు అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించి, అల్లాహ్ మార్గంలో పోరాడేదానికి సమానంగా భావిస్తున్నారా? అల్లాహ్ దగ్గర, వారు (ఈ రెండు పక్షాల వారు) సరిసమానులు కారు. మరియు అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు సన్మార్గం చూపడు. [అత్తౌబా 9:19]
ఆచరణలు, ప్రతిఫలం మరియు పుణ్యంలో భిన్నస్థాయిలలో ఉంటాయి.
ఆచరణల ఔన్నత్యం షరీఅతు తెలిపిన దానిని బట్టి ఉంటుంది, అంతేగాని ప్రజల స్వంత పరిశోధనలను బట్టి కాదు.
అల్లాహ్ మరియు అంతిమ దినంపై విశ్వాసం అనే షరతుతో అల్లాహ్ మార్గంలో జిహాద్ యొక్క ఘనత తెలుస్తున్నది.
ఇమాం అన్’అన్నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: జుమహ్ రోజున మరియు ఇతర రోజులలో మస్జిదులలో స్వరాన్ని హెచ్చించడం అయిష్టకరమైనది. నమాజ్ కొరకు ప్రజలు సమావేశమైనప్పుడు, జ్ఞానబోధన కొరకు గానీ లేదా మరే ఇతర కారణం చేతనైనా గానీ స్వరాన్ని హెచ్చించరాదు, ఎందుకంటే ఇది నమాజ్ చేసేవారికి మరియు దైవస్మరణ చేసేవారికి ఇబ్బంది, భంగం కలిగిస్తుంది.
సహీహ్ ముస్లిం. (3/ 1499) (1879).
ఇంకా (3)
المفهم لما أشكل من تلخيص كتاب مسلم (3/ 720).
البحر المحيط الثجاج في شرح صحيح الإمام مسلم بن الحجاج (32/ 395).
النهاية في غريب الحديث والأثر (ص 897).