“అతనిని శపించకండి, అల్లాహ్ సాక్షిగా! నాకు తెలిసినంత వరకు, నిశ్చయంగా అతను అల్లాహ్'ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడు”.
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో అబ్దుల్లాహ్ అనే పేరు గల ఒక వ్యక్తి ఉండేవారు. ఆయనకు ‘హిమార్’ (గాడిద) అనే ముద్దుపేరు ఉండేది. ఆయన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను నవ్వించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి మద్యం సేవించినందుకు (గతంలో) కొరడా దెబ్బల శిక్ష విధించారు. ఒకరోజు అతను (మళ్ళీ అదే నేరానికి) తీసుకురాబడగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం మేరకు అతనికి కొరడా దెబ్బలు వేయబడ్డాయి. అప్పుడు అక్కడున్న వారిలో ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “ఓ అల్లాహ్! ఇతనిని శపించు. ఇతను ఎన్నిసార్లు (ఈ నేరానికి) తీసుకురాబడ్డాడు?”. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అతనిని శపించకండి, అల్లాహ్ సాక్షిగా! నాకు తెలిసినంత వరకు, నిశ్చయంగా అతను అల్లాహ్'ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడు”.
أَنَّ رَجُلًا عَلَى عَهْدِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ اسْمُهُ عَبْدَ اللَّهِ، وَكَانَ يُلَقَّبُ حِمَارًا، وَكَانَ يُضْحِكُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، وَكَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَدْ جَلَدَهُ فِي الشَّرَابِ، فَأُتِيَ بِهِ يَوْمًا فَأَمَرَ بِهِ فَجُلِدَ، فَقَالَ رَجُلٌ مِنَ القَوْمِ: اللَّهُمَّ الْعَنْهُ، مَا أَكْثَرَ مَا يُؤْتَى بِهِ؟ فَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لاَ تَلْعَنُوهُ، فَوَاللَّهِ مَا عَلِمْتُ أَنَّهُ يُحِبُّ اللَّهَ وَرَسُولَهُ».
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో అబ్దుల్లాహ్ అనే వ్యక్తి ఉండేవారు, అతడి మారుపేరు హిమార్. అతడు తన మాటలతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను నవ్వించేవారు. మద్యం సేవించినందుకుగాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి కొరడా దెబ్బలు వేయించారు. మరలా ఒకరోజు అతను మద్యం సేవించి ఉండగా అతన్ని తీసుకువచ్చారు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం మేరకు మరలా అతనికి కొరడా దెబ్బలు వేయబడ్డాయి. అక్కడ హాజరైన వారిలో ఒకరు అతనిని, 'అల్లాహ్ ఇతనిని శపించుగాక! మద్యం సేవించి ఎన్నిసార్లు ఇక్కడికి తీసుకురాబడ్డాడు?!' అని శపించగా, ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్, 'అతనిని శపించకండి. అల్లాహ్ సాక్షిగా! నాకు తెలిసినంత వరకు అతను అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ప్రేమిస్తున్నాడు' అని బోధించారు.
నిషిద్ధ కార్యానికి పాల్పడటం మరియు అతడి హృదయంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల ప్రేమ ఉండటం మధ్య ఎలాంటి వైరుధ్యం లేదు; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించబడిన వ్యక్తి, అతడి ద్వారా ఆ పాపపు పని జరిగినప్పటికీ, అతడు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను ప్రేమిస్తాడని తెలియ జేసినారు.
పెద్ద పాపము చేసేవాడు దాని నుండి పశ్చాత్తాపపడకుండా మరణిస్తే, అతని వ్యవహారం అల్లాహ్ అధీనంలో ఉంటుంది; అల్లాహ్ తలిస్తే అతనిని మన్నిస్తాడు లేదా శిక్షిస్తాడు. మరియు ఇస్లాం స్వీకరించిన ప్రజలలోని ఏ నరకాగ్నిలో శాశ్వతంగా ఉండరు.
మద్యం సేవించే ఒక నిర్దిష్ట వ్యక్తిని శపించడం అయిష్టకరమైనది; ఎందుకంటే ఆ శాపం అతనికి తగలకుండా ఏదైనా ఆటంకం ఉండే అవకాశం ఉంది; మరియు ఒక నిర్దిష్ట వ్యక్తిని శపించడం, అతనికి వ్యతిరేకంగా దుఆ చేయడం అనేది అతన్ని పాపంలో మరింతగా మునిగిపోయేలా ప్రేరేపించవచ్చు లేదా తౌబా స్వీకరణ విషయంలో అతనిలో నిరాశను కలిగించవచ్చు.
ప్రత్యేక వ్యక్తిని సూచించకుండా ఆ గుణంతో వర్ణించబడిన వారిని శపించడానికి అనుమతి ఉంది.
సహీహ్ అల్ బుఖారీ. (8/ 158) (6780).
ఇంకా (2)
إرشاد الساري لشرح صحيح البخاري (9/ 452).
البحر المحيط الثجاج في شرح صحيح الإمام مسلم بن الحجاج (29/ 394).