Skip to content

“ఓ ఆయిషా, అల్లాహ్ సౌమ్యుడు మరియు సౌమ్యతను ఇష్టపడతాడు. మరియు ఆయన హింసకు, కఠినత్వానికి ఇవ్వని దానిని సౌమ్యతకు ప్రసాదిస్తాడు, మరింకా దేనికీ ఇవ్వని దానిని సౌమ్యతకు ప్రసాదిస్తాడు.”

విశ్వాసుల మాతృమూర్తి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య అయిన ఆయిషా రదియల్లాహు అన్హా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని ఉల్లేఖిస్తున్నారు:

“ఓ ఆయిషా, అల్లాహ్ సౌమ్యుడు మరియు సౌమ్యతను ఇష్టపడతాడు. మరియు ఆయన హింసకు, కఠినత్వానికి ఇవ్వని దానిని సౌమ్యతకు ప్రసాదిస్తాడు, మరింకా దేనికీ ఇవ్వని దానిని సౌమ్యతకు ప్రసాదిస్తాడు.”

«يَا عَائِشَةُ إِنَّ اللهَ رَفِيقٌ يُحِبُّ الرِّفْقَ، وَيُعْطِي عَلَى الرِّفْقِ مَا لَا يُعْطِي عَلَى الْعُنْفِ، وَمَا لَا يُعْطِي عَلَى مَا سِوَاهُ».

ముస్లిం నమోదు చేసినారు:
ప్రామాణికమైన హదీథు
వ్యాఖ్యానము

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం, విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హాను సౌమ్యంగా ఉండమని హితబోధ చేస్తున్నారు, అల్లాహ్ తన దాసుల పట్ల సౌమ్యుడు మరియు దయగలవాడు అని, ఆయన వారికి కఠినత్వాన్ని, కష్టాన్ని కాదు, వారికి సౌలభ్యాన్ని కోరు కుంటున్నాడు అని అన్నారు. ఆయన వారి సామర్ధ్యానికి మించి వారిపై భారాన్ని మోపడు. మరియు అల్లాహ్, తన దాసుడు ఇతరులతో వ్యవహరించడంలో సౌమ్యతను మరియు సౌలభ్యాన్ని అవలంబించడాన్ని, అలాగే ఇతరులతో వ్యవహరించుటలో కఠినత్వాన్ని లేదా తీవ్రతను నివారించడాన్ని ఇష్టపడతాడు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు - సౌమ్యత మరియు కరుణ చూపేవారికి ఈ లోకంలో అల్లాహ్ ప్రశంసనీయమైన ఖ్యాతిని ప్రసాదిస్తాడు; మరియు వారు తమ లక్ష్యాలను సాధించడములో మరియు వారి వ్యవహారాలు కొనసాగించడంలో అల్లాహ్ సౌలభ్యాన్ని ప్రసాదిస్తాడు. మరియు హింస, కఠినత్వాలకు ఇవ్వని గొప్ప ప్రతిఫలాన్ని ఆయన ప్రసాదిస్తాడు; ఎందుకంటే సౌమ్యత మరేదీ తీసుకురాలేని ఫలితాలను తెస్తుంది.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

దయ, కరుణ మొదలైన గుణాలను ప్రోత్సహించాలి మరియు హింస, దౌర్జన్యాలను నిషేధించాలి.

దయ, కరుణ అనేవి నైతిక విలువలలో ఉత్తమ విలువ కలిగిన గుణాలు.

సౌమ్యుడైన వ్యక్తి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి మంచి ప్రశంసలు మరియు సమృద్ధిగా ప్రతిఫలం పొందటానికి అర్హుడు.

అల్ సిందీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “కఠినత్వం సౌమ్యతకు వ్యతిరేకం. అయితే ప్రజలు - సౌమ్యత మరియు కఠినత్వం -ఈ రెండు విధానలకు సమానంగా స్పందిస్తున్నంత వరకు - ఎవరైతే ప్రజలను సత్యమార్గం వైపునకు సౌమ్యత, దయ మరియు కరుణలతో ఆహ్వానిస్తాడో అతడు సత్యమార్గం వైపునకు కఠినత్వం మరియు తీవ్రతతో ఆహ్వానించే వాని కంటే ఉత్తమమైన వాడు. మరి పరిస్థితి రెండు విధానాలలో ఒక విధానానికే స్పందించేలాగా ఉంటే, ఆ పరిస్థితికి ఏ విధానం అనుకూలమైనదో అదే అప్పటికి అవసరమైనది అవుతుంది. అయితే ప్రతి పరిస్థితి యొక్క నిజమైన వాస్తవికత ఎరిగిన వాడు కేవలం అల్లాహ్‌ మాత్రమే.

సమీక్షకుడు

సహీహ్ ముస్లిం. (4/ 2003) (2593).

ఇంకా (4)

بهجة الناظرين شرح رياض الصالحين.

لسليم الهلالي (1/ 683).

المنهاج شرح صحيح مسلم بن الحجاج.

للنووي (16/ 145).