Skip to content

“బిలాల్! ఇస్లాంలో నువ్వు చేసిన అత్యంత ఆశావహ ఆచరణ ఏమిటో నాకు చెప్పు

అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖన – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజు సమయంలో బిలాల్ రదియల్లాహు అన్హుతో ఇలా అన్నారు:

“బిలాల్! ఇస్లాంలో నువ్వు చేసిన అత్యంత ఆశావహ ఆచరణ ఏమిటో నాకు చెప్పు, ఎందుకంటే నేను స్వర్గంలో నా ముందర నీ చెప్పుల సవ్వడి విన్నాను.” అతను చెప్పారు: “నా దృష్టిలో అత్యంత ఆశావహమైన ఆచరణ ఏమిటంటే, నేను రేయింబవళ్ళలో, ఏ గడియలోనైనా ఉదూ చేసుకున్నప్పుడు, ఆ ఉదూతో నాకు విధివ్రాతలో వ్రాయబడినంత నమాజ్ తప్పకుండా ఆచరిస్తాను.”

«يَا بِلاَلُ، حَدِّثْنِي بِأَرْجَى عَمَلٍ عَمِلْتَهُ فِي الإِسْلاَمِ، فَإِنِّي سَمِعْتُ دَفَّ نَعْلَيْكَ بَيْنَ يَدَيَّ فِي الجَنَّةِ» قَالَ: مَا عَمِلْتُ عَمَلًا أَرْجَى عِنْدِي أَنِّي لَمْ أَتَطَهَّرْ طَهُورًا، فِي سَاعَةِ لَيْلٍ أَوْ نَهَارٍ، إِلَّا صَلَّيْتُ بِذَلِكَ الطُّهُورِ مَا كُتِبَ لِي أَنْ أُصَلِّيَ.

అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ప్రామాణికమైన హదీథు
వ్యాఖ్యానము

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలలో అతడిని స్వర్గంలో ఉన్నట్లు చూశారు. అప్పుడు ఆయన బిలాల్ ఇబ్న్ రబాహ్‌ రదియల్లాహు అన్హును చూసి ఇలా అడిగారు: 'ఇస్లాంలో నీవు చేసిన అత్యంత ఆశాజనకమైన ఐచ్ఛిక (నఫిల్) ఆచరణ ఏమిటో నాకు చెప్పు. ఎందుకంటే, నేను స్వర్గంలో నీవు నడుస్తున్నప్పుడు నీ చెప్పుల యొక్క మెల్లని శబ్దాన్ని నేను విన్నాను. బిలాల్ ఇలా చెప్పారు: నా దృష్టిలో అత్యంత ఆశావహమైన ఆచరణ ఏమిటంటే, నేను రేయింబవళ్ళలో ఏ గడియలోనైనా ఉదూ భంగమైన వెంటనే మరలా ఉదూ చేసుకుని, ఆ తర్వాత ఆ ఉదూతో నా ప్రభువు కొరకు, నా అదృష్టంలో వ్రాసి ఉన్నన్ని సాధారణ నఫిల్ నమాజులు ఆచరించాను.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

బిలాల్ రదియల్లాహు అన్హు సూచించిన ఆచరణ, అనగా ఉదూ చేసిన ప్రతిసారి నమాజ్ ఆచరించడం, అత్యంత ఆశావహమైన ఆచరణలలో ఒకటి మరియు స్వర్గ ప్రవేశానికి ఒక కారణం అవగలదు అనేది స్పష్టమవుతున్నది.

ప్రతి ఉదూ తర్వాత సలాహ్ చేయడం అభిలషణీయము.

ఆదర్శప్రాయుడు లేదా గురువు తన శిష్యుడి కార్యం గురించి అడగాలి; అది మంచిదైతే దానిపై స్థిరంగా ఉండమని ప్రోత్సహించాలి, లేకపోతే దాని నుండి వారించాలి.

బిలాల్ రదియల్లాహు అన్హు స్వర్గవాసులలోని వాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన సాక్ష్యం.

ఈ ప్రశ్న ఫజ్ర్ నమాజు సమయంలో అడగబడింది మరియు ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు కలలో జరిగినట్లుగా సూచిస్తుంది మరియు ప్రవక్తల కలలు సత్యమైనవి.

సమీక్షకుడు

సహీహ్ అల్ బుఖారీ. (2/ 53) (1149).

సహీహ్ ముస్లిం. (4/ 1910) (2458).

ఇంకా (2)

عمدة القاري شرح صحيح البخاري (7/ 206).

إرشاد الساري لشرح صحيح البخاري (2/ 326).