Skip to content

అల్లాహ్ నరకాన్ని ఎందుకు సృష్టించాడు?

محاور التعريف بالإسلام
اليوم الآخر والمصيرالنار
مصدر الإجابة
قسم البعث
الباب / الفصل
(قسم البعث)

السؤال

అల్లాహ్ నరకాన్ని ఎందుకు సృష్టించాడు?

الجواب

అగ్ని రెండు రకాలు: ఇహలోకపు అగ్ని, మరియు పరలోకపు అగ్ని. ఇక ఇహలోకపు అగ్ని విషయానికొస్తే, దానికి గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి, వాటిలో అత్యంత గొప్పది ఏమిటంటే, అది పునరుత్తాన దినానికి సూచికగా ఉంటుంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా? లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా?

మేము దానిని (నరకాగ్నిని), గుర్తు చేసేదిగా మరియు ప్రయాణీకులకు (అవసరం గలవారికి) ప్రయోజనకారిగా చేశాము.﴿

కావున సర్వత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు.﴿

[సూరతుల్ వాఖిఆ: 72-74]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు అతడు మాకు పోలికలు కల్పిస్తూ తన సృష్టినే మరలిపోయాడు. అతడు ఇలా అంటాడు: "కృశించిపోయిన ఈ ఎముకలను తిరిగి ఎవడు బ్రతికించగలడు?

ఇలా అను: "మొదట వాటిని పుట్టించిన ఆయనే, మళ్ళీ వాటిని బ్రతికిస్తాడు. మరియు ఆయనకు, ప్రతి దానిని సృష్టించే జ్ఞానముంది.

ఆయనే పచ్చని చెట్టు నుండి మీ కొరకు అగ్నిని పుట్టించేవాడు, తరువాత మీరు దాని నుండి మంటను వెలిగించుకుంటారు.﴿

[సూర యాసీన్: 78-80]

చల్లని పచ్చని చెట్టు నుండి వేడి మరియు దహించే అగ్నిని వెలికి తీసేవాడు, తన అనుమతితో మృతులను జీవింపజేయటంపై సామర్ధ్యం కలవాడని అల్లాహ్ ప్రజలకు గుర్తు చేశాడు.

మరియు ఇహలోకపు అగ్ని వల్ల కలిగే అత్యంత ప్రసిద్ధమైన ప్రయోజనాలలో: చీకటిలో దాని వెలుగు ద్వారా ప్రయోజనం పొందటం, ఆహార పానీయాలను వండటం, చలిలో వెచ్చదనం పొందటం, మనిషికి నాశనం చేయవలసిన అవసరమున్నవాటిని నాశనం చేయటం, లోహాలను మెత్తబరచటం, పరిశ్రమలను సులభతరం చేయటం మరియు కొన్ని వ్యాధులకు చికిత్స చేయటం.

ఇక పరలోక నరకం : అల్లాహ్ దానిని లెక్కించలేనన్ని వివేకాల కొరకు సృష్టించాడు, కానీ వాటిలో కొన్నింటిని ప్రస్తావించడానికి మనం ప్రయత్నిస్తాము, అవి:

మొదటగా: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

"స్వర్గ నరకలు పరస్పరం వాదులాడుకున్నాయి. అప్పుడు నరకం చెప్తుంది: నాలో కఠినాత్ములు మరియు గర్విష్టులు ప్రవేశిస్తారు, స్వర్గం చెప్తుంది: నాలో బలహీనులు మరియు ఆగత్యపరులు ప్రవేశిస్తారు. అప్పుడు అల్లాహ్ నరకంతో అంటాడు: నీవు నా శిక్షవి, నేను తలచినవారిని నీ ద్వారా శిక్షిస్తాను - లేదా బహుశా 'నేను కోరిన వారిని నీ ద్వారా పట్టుకుంటాను' అని అన్నారు - ఆపై స్వర్గంతో అంటాడు: నీవు నా కారుణ్యానివి, నేను తలచినవారిని నీ ద్వారా కరుణిస్తాను. మరియు మీ ఇద్దరిలో ప్రతి ఒక్కరినీ నింపడం జరుగుతుంది."

[సహీహ్ ముస్లిం (170)].

అది అల్లాహ్ శిక్ష, అందులో ఆయన అవిశ్వాసపరులలో మరియు నేరస్థులలో తాను కోరిన వారిని శిక్షిస్తాడు.

రెండవది: కొంతమంది ప్రజల హృదయములు రాళ్ళ కన్న ఎక్కువగా కఠినంగా ఉంటాయి. మరియు అహంకారం, గర్వంతో కూడిన ఈ హృదయాలను ఈ గొప్ప నరకాగ్ని తప్ప మరేదీ కరిగించలేదు మరియు వాటికి బుద్ధి చెప్పలేదు.

మూడవది: అల్లాహ్ నరకాన్ని సృష్టించడం అనేది ఆయన వివేకం మరియు కారుణ్యంలో భాగం; ఎందుకంటే అల్లాహ్ ఈ ప్రపంచాన్ని కష్టాల మరియు పరీక్షల నిలయంగా చేశాడు. మానవుడిని సృష్టించి అతనిలో కోరికలను ఉంచాడు మరియు ఆ కోరికలను తీర్చుకునే మార్గాలను ఏర్పరిచాడు. ఆపై వాటిలో ధర్మసమ్మతమైనవి మరియు నిషిద్ధమైనవి (హరామ్) నిర్ణయించాడు. నిషిద్ధమైన కోరికలకు చేరువ కావడం ద్వారా తనకు అవిధేయత చూపవద్దని ఆయన తన దాసులను హెచ్చరించాడు. అదే విధంగా తన ఆరాధనలో సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క హక్కును నెరవేర్చడంలో ఎలాంటి లోపం చేయవద్దని కూడా వారిని హెచ్చరించాడు. నిషిద్ధ కార్యాలకు పాల్పడటం లేదా విధేయతలో లోపం చేయడం ద్వారా ఎవరైతే ఆయన పట్ల అవిధేయత చూపుతారో, వారందరినీ నరకంలో ప్రవేశపెడతానని కఠినంగా హెచ్చరించాడు. కాబట్టి నరకం యొక్క ఉనికి అనేది వివేకవంతులైన వారు పాపాలకు పాల్పడకుండా మరియు ఆరాధనలో లోపం చేయకుండా అడ్డుకునే ఒక ఉత్తమ నివారణగా ఉంది. సర్వోన్నతుడైన అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు:

﴾కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను.

పరమ దౌర్భాగ్యుడు తప్ప, మరెవ్వడూ అందులో కాలడు!

ఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో .

కాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు!

అతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో!﴿

[సూరతుల్ లైల్ : 8-11]

ఇది మీరు తెలుసుకుంటే, దాని ఉనికి అల్లాహ్ కు కోపం తెప్పించే వాటికి దూరంగా ఉండటానికి మరియు ఆయన ఆజ్ఞాపించే మరియు ఇష్టపడే వాటికి కట్టుబడి ఉండటానికి ఒక కారణం అని మీరు గ్రహిస్తారు. అదేవిధంగా నరకంలో ఒక అవిశ్వాసి కాఫిర్ కి మరియు దౌర్జన్యకారుడికి విధించే శిక్షలో, ఈ లోకంలో దౌర్జన్యానికి గురైన బాధితునికి విజయం చేకూర్చడం మరియు అతని కోపాన్ని పోగొట్టడం ఉంది, మరియు అలాగే ఒక అవిశ్వాసి కాఫిర్ తన ప్రభువుకు అవిధేయత చూపినందుకు తన శిక్షను ఖచ్చితంగా పొందుతాడు.

المصدر

قسم البعث

ملاحظات

--