స్వర్గం మరియు నరకంలో ఏమి జరుగుతుంది?
- محاور التعريف بالإسلام
- اليوم الآخر والمصيرالجنةاليوم الآخر والمصيرالنار
- مصدر الإجابة
- قسم البعث
- الباب / الفصل
- (قسم البعث)
السؤال
స్వర్గం మరియు నరకంలో ఏమి జరుగుతుంది?
الجواب
స్వర్గం పరలోకంలో విశ్వాసుల ప్రతిఫల నివాసం మరియు వారు శాశ్వతమైన అనుగ్రహాలు పొందే నిలయం, మరియు నరకం పరలోకంలో అవిశ్వాసుల ప్రతీకార నివాసం మరియు వారు శాశ్వతమైన శిక్షను అనుభవించే నిలయం. అందులో అవిధేయులైన ఏకదైవారాధకులు శిక్షించబడతారు, ఆ తరువాత వారు స్వర్గంలోకి పంపబడతారు. మరియు స్వర్గంలో ఉన్న వాటిని ఏ కన్ను చూడలేదు మరే చెవి వినలేదు, ఏ మానవ మనస్సు ఊహించలేదు. పవిత్ర ఖుర్ఆన్ మరియు ప్రవక్త సున్నత్‌లలో స్వర్గంలో జరిగిన మరియు జరగబోయే అనేక విషయాలు స్పష్టంగా తెలుపబడ్డాయి, మనస్సులు దాని కోసం ఆశపడేలా అది సవివరంగా వర్ణించబడింది. అదేవిధంగా, నరకంలోని శిక్ష కూడా మనస్సులలో భయాన్ని కలిగించేలా మరియు దాని నుండి తప్పించుకోవడానికి సత్కార్యాలు చేసేలా సవివరంగా వర్ణించబడింది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచి పెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు.﴿
[అస్ సజ్దహ్: 21]
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది;﴿
[అన్నబ: 31]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾నిశ్చయంగా, నరకం ఒక మాటు;
ధిక్కారుల గమ్యస్థానం.
అందులో వారు యుగాల తరబడి ఉంటారు.
అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు.
సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం).
(వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా!
వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు.
పైగా వారు మా సూచనలను (ఆయాత్ లను) అసత్యాలని తిరస్కరించారు.
మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము.
కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవి చూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము.
ఉద్యానవనాలూ, ద్రాక్ష తోటలూ!
మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందర కన్యలు;
మరియు నిండి పొర్లే (మధు) పాత్ర.
అందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్థపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు.
(ఇదంతా) నీ ప్రభువు తరఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం.﴿
﴾భయభక్తులు గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గం యొక్క ఉదాహరణ ఇలా వుంది: అందులో వాసన మరియు రంగు మారని నీటి సెలయేళ్ళు ఉంటాయి మరియు రుచి మారని పాల కాలువలు ఉంటాయి మరియు అందులో త్రాగేవారికి మధురంగా వుండే మద్యపానపు కాలువలు ఉంటాయి మరియు అందులో శుద్ధమైన తేనె కాలువలు ఉంటాయి. మరియు వారి కొరకు అందులో అన్ని రకాల మంచి ఫలాలు మరియు వారి ప్రభువు నుండి క్షమాపణ కూడా వుంటాయి. ఇలాంటి వాడు - నరకాగ్నిలో శాశ్వతంగా ఉండి సలసల కాగే నీటిని త్రాగేందుకు ఇవ్వబడి, దానితో ప్రేగులు కోయబడినట్లు బాధపడేవానితో - సమానుడు కాగలడా?﴿
[ముహమ్మద్ : 27]
﴾ఆ దినమున స్వర్గానికి అర్హులైన వారు మంచి నివాసంలో మరియు ఉత్తమ విశ్రాంతి స్థలంలో ఉంటారు.﴿
[ఫుర్ఖాన్: 3]
పరిశుద్ధుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:
మరియు ఎవరి పళ్ళాలు తేలికగా ఉంటాయో, అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేసుకున్న వారు, వారే నరకంలో శాశ్వతంగా ఉండేవారు.﴿
అగ్ని వారి ముఖాలను కాల్చి వేస్తుంది. వారి పెదవులు బిగించుకు పోయి, పళ్ళు బయట పడతాయి.﴿
[అల్ ముమినూన్:12-14]
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
"మహోన్నతుడూ, మహోత్కృష్టుడు అయిన అల్లాహ్ స్వర్గమును సృష్టించినపుడు, జిబ్రయీల్ తో ఇలా అన్నాడు “వెళ్ళు, వెళ్ళి దానిని చూడు”. ఆయన వెళ్ళి దానిని చూసాడు, తరువాత వచ్చి ఇలా అన్నాడు “ఓ నా ప్రభూ! నీ ఘనత సాక్షిగా, దాని గురించి విన్న వారు ఎవరైనా దాని లోనికి ప్రవేశించాలని తప్ప మరేమీ కోరుకోరు.” తరువాత ఆయన దానిని కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లతో చుట్టుకుని ఉండేలా చేసాడు, తరువాత ఇలా అన్నాడు “ఓ జిబ్రయీల్! వెళ్ళు, వెళ్ళి దానిని చూడు”. ఆయన వెళ్ళి దానిని చూసాడు, తరువాత వచ్చి ఇలా అన్నాడు “ఓ నా ప్రభూ! నీ ఘనత సాక్షిగా, ఎవరూ అందులోనికి ప్రవేశించలేరు అని భయంగా ఉన్నది.” ఆయన (ప్రవక్త) అన్నారు: అల్లాహ్ నరకమును సృష్టించినపుడు ఇలా అన్నాడు “ఓ జిబ్రయీల్! వెళ్ళు, వెళ్ళి దానిని చూడు”. ఆయన వెళ్ళి దానిని చూసాడు, తరువాత వచ్చి ఇలా అన్నాడు “ఓ నా ప్రభూ! నీ ఘనత సాక్షిగా, దాని గురించి విన్న వారు ఎవరూ దానిలోనికి ప్రవేశించరు.” అపుడు ఆయన దానిని వాంఛలు, కోరికలతో చుట్టుకుని ఉండేలా చేసాడు, తరువాత ఇలా అన్నాడు “ఓ జిబ్రయీల్! వెళ్ళు, వెళ్ళి దానిని చూడు”. ఆయన వెళ్ళి దానిని చూసాడు, తరువాత వచ్చి ఇలా అన్నాడు “ఓ నా ప్రభూ! నీ ఘనత సాక్షిగా! దానిలోనికి ప్రవేశించకుండా ఎవరూ మిగలరు అని భయంగా ఉన్నది”.
[ముస్నద్ (8398), ఈ హదీసును అబూ దావుద్ హసన్ ఇస్నాద్ తో, హదీసు సంఖ్య (4744) లో ఉల్లేఖించారు],
"ప్రళయదినాన ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా సౌఖ్యం అనుభవించిన నరకవాసి ప్రవేశపెట్టబడతాడు. ఒకసారి నరకంలో ముంచి తీసిన పిదప అతనితో, “ఓ ఆదం పుత్రుడా! గతంలో నీవెప్పుడయినా సౌఖ్యాన్ని చవి చూశావా? నీకు ఇంతకు ముందు సౌఖ్యాన్ని అనుభవించినట్లు గుర్తుందా?” అని అడగటం జరుగుతుంది. దానికి ఆ వ్యక్తి, “లేదు. అల్లాహ్ సాక్షి! ప్రభూ!” అని అంటాడు. ఆ తరువాత ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా కష్టాలు అనుభవించిన స్వర్గవాసి హాజరుపరచబడతాడు. అతన్ని ఒకసారి స్వర్గంలో ముంచి తీసిన తరువాత అతనితో "ఓ ఆదం పుత్రుడా! గతంలో నువ్వెప్పుడైనా కష్టాలు ఎదుర్కొన్నావా? నీకు ఇంతకు ముందు కష్టాలు వచ్చినట్లు గుర్తుందా?" అని అడగటం జరుగుతుంది. దానికి సమాధానంగా అతను, “లేదు, అల్లాహ్ సాక్షి! ప్రభూ! నేనెన్నడూ కష్టాలు చూడలేదు. గతంలో నేను బాధపడినట్లు నాకు గుర్తే లేదు” అని అంటాడు."
[దీన్ని ముస్లిం ఉల్లేఖించారు].
మరింత సమాచారం కొరకు ఇబ్ను ఖయ్యిమ్ అల్ జౌజియా గారి హాదిల్ అర్వాహ్ ఇలా బిలాదిల్ అఫ్రాహ్ మరియు ఉమర్ అల్ అష్ఖర్ గారి అల్ జన్నహ్ వన్-నార్ చూడండి.
المصدر
ملاحظات
--