కాఅబా అంటే ఏమిటి? మరియు ముస్లింలు కాఅబాను ఆరాధిస్తారా?
- محاور التعريف بالإسلام
- محاسن الإسلاممحاسن العبادة
- مصدر الإجابة
- قسم أركان الإسلام
- الباب / الفصل
- (قسم أركان الإسلام)
السؤال
కాఅబా అంటే ఏమిటి? మరియు ముస్లింలు కాఅబాను ఆరాధిస్తారా?
الجواب
పవిత్రమైన కఅబా గృహము ముస్లింలు తమ నమాజుల్లో ఖిబ్లా (అభిముకమయ్యే ప్రదేశము), అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾...కావున మేము నిన్ను, నీవు కోరిన ఖిబ్లా వైపునకు త్రిప్పుతున్నాము. కావున నీవు మస్జద్ అల్ హరామ్ వైపునకు నీ ముఖాన్ని త్రిప్పుకో! ఇకపై మీరంతా ఎక్కడ ఉన్నా సరే (నమాజు చేసేటప్పుడు), మీ ముఖాలను ఆ వైపునకే త్రిప్పుకోండి...﴿
[అల్ బఖర: 21]
మరియు హజ్జ్ మరియు ఉమ్రహ్ విధులను నిర్వహించే సమయంలో వారు దాని చుట్టూ తవాఫ్ చేస్తారు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఆ ప్రాచీన గృహం (కఅబహ్) యొక్క ప్రదక్షిణ చేయాలి.﴿
[హజ్జ్: 5]
అది మక్కా ముకర్రమాలో ఉన్న అత్యంత గౌరవప్రదమైన నిర్మాణం, దీనిని నిర్మించమని అల్లాహ్ తన ప్రవక్త మరియు స్నేహితుడు అయిన ఇబ్రాహీం అలైహిస్సలాంను ఆదేశించాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు మేము ఇబ్రాహీమ్ కు ఈ గృహం (కఅబహ్) యొక్క స్థలాన్ని నిర్దేశించి (చూపుతూ) అతనితో: "ఎవ్వరినీ నాకు సాటిగా (భాగస్వాములుగా) కల్పించకు, మరియు నా గృహాన్ని, ప్రదక్షిణ (తవాఫ్) చేసేవారి కొరకు నమాజ్ చేసేవారి కొరకు, వంగే (రుకూఉ) మరియు సాష్టాంగం (సజ్దా) చేసేవారి కొరకు, పరిశుద్ధంగా ఉంచు" అని అన్నాము.﴿
మరియు ఇది అల్లాహ్ తఆలా ఆరాధన నిమిత్తం భూమండలం పై మొట్టమొదట నిర్మితమైన గృహం. పరిశుద్ధుడైన ఆయన ఇలా సెలవిచ్చాడు:
﴾నిశ్చయంగా, మానవజాతి కొరకు మొట్టమొదట నియమించబడిన (ఆరాధనా) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే, శుభాలతో నిండినది సమస్త లోకాల ప్రజలకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించేది.﴿
[ఆలె ఇమ్రాన్: 3-4]
ఇక రెండవ ప్రశ్నకు సమాధానం విషయానికొస్తే, ముస్లింలు కాఅబాను మరియు హజ్రే అస్వద్ను ఆరాధించరు. వారు వాటికి లోబడరు మరియు తలవంచరు. కేవలం వారు వాటిని ఆదరిస్తారు మరియు గౌరవిస్తారు. మరియు వారు కాఅబా మరియు హజ్రే అస్వద్ నుండి ఎటువంటి ఆదేశాలను కానీ, నిషేధాలను కానీ స్వీకరించరు; ఎందుకంటే అవి నష్టం కలిగించలేవు మరియు లాభం చేకూర్చలేవు, అలాగే మార్గదర్శకత్వం లేదా ఉపదేశం ఉండేలా వాటి నుండి ఏదీ వెలువడదు. కేవలం ముద్దు పెట్టుకోవడం, గౌరవించడం మరియు కాఅబాకు అభిముఖమవ్వడం అనేది వారి ఐక్యత మరియు వారి లక్ష్య ఐక్యతకు ప్రతీకలుగా ఉన్నాయి. అల్లాహ్ వారికి చేసిన ఆదేశాన్ని పాటిస్తూ వారు దానిని సందర్శిస్తారు మరియు దాని చుట్టూ తవాఫ్ (ప్రదక్షిణ) చేస్తారు. మరియు ఆరాధన మాత్రం ఒక్కడైన అల్లాహ్ కొరకే, కాఅబాకు కాదు. అది నష్టం కలిగించలేని మరియు లాభం చేకూర్చలేని ఒక రాయి మాత్రమేనని ముస్లింలకు తెలుసు. కానీ ముస్లిం అల్లాహ్ ఆదేశాన్ని పాటిస్తాడు; ఎందుకంటే ఇది సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు దాస్యం చేయటంలోని ఆవశ్యకతలలో ఒకటి.
దీనికి సంబంధించి హజ్రె అస్వద్ ను ముద్దాడినప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు పలికిన మాట ఉంది. ఆయన ఇలా పలికారు:
"«నిశ్చయంగా నువ్వు ఒకరాయివి నీకు నష్టపర్చే మరియు లాభపర్చే శక్తిగాని లేదన్న విషయం నాకు బహుబాగా తెలుసు, మహనీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) నిన్ను చుంబించడం గనుక నేను చూసి ఉండకపోతే నిన్ను నేను చుంబించేవాన్నికాదు.»"
[ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (2620) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1003) లో ఉల్లేఖించారు].
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కురిపించుగాక.
المصدر
ملاحظات
--