Skip to content

వుజూ విధానం ఏమిటి?

محاور التعريف بالإسلام
محاسن الإسلاممحاسن العبادة
مصدر الإجابة
قسم أركان الإسلام
الباب / الفصل
(قسم أركان الإسلام)

السؤال

వుజూ విధానం ఏమిటి?

الجواب

సంపూర్ణ వుజూ విధానం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  1. మనిషి పవిత్రత కొరకు మరియు అశుద్ది (హదస్) ను తొలగించుటకు సంకల్పం చేయాలి. సంకల్పాన్ని బయటకు ఉచ్ఛరించకూడదు, ఎందుకంటే దాని స్థానం మనస్సు. మిగతా అన్ని ఆరాధనల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది.
  2. బిస్మిల్లాహ్ అని పలకాలి.
  3. ఆపై తన రెండు అరచేతులను మూడు సార్లు కడగాలి.
  4. ఆపై మూడు సార్లు నోరు పుక్కిలించాలి. (పుక్కిలించడం అనగా నోటిలో నీటిని అటూ ఇటూ తిప్పడం)

మూడు సార్లు ముక్కులో నీటిని పీల్చి, ఎడమ చేతితో ముక్కు నుండి నీటిని బయటకు వదలాలి. “ఇస్తిన్షాఖ్” అంటే ముక్కు లోపలికి నీటిని చేర్చడం. “ఇస్తిన్సార్” అంటే ముక్కు నుండి ఆ నీటిని బయటకు తీయడం.

  1. ముఖాన్ని మూడు సార్లు కడగాలి. ముఖం యొక్క పరిమితి: సాధారణంగా తల వెంట్రుకలు మొదలయ్యే చోట నుండి దవడలు మరియు గడ్డం వరకు పొడవుగా, మరియు కుడి చెవి అంచు నుండి ఎడమ చెవి అంచు వరకు వెడల్పుగా ఉంటుంది. పురుషుడు తన గడ్డం వెంట్రుకలను కడగాలి, ఎందుకంటే అది ముఖంలో భాగం. ఒకవేళ అది లేత గడ్డం అయితే, దాని వెలుపలి మరియు లోపలి భాగాలను కడగటం తప్పనిసరి, మరియు ఒకవేళ అది దట్టమైనది అనగా చర్మాన్ని కప్పి ఉంచేది అయితే, దాని వెలుపలి భాగాన్ని మాత్రమే కడిగి ఖిలాల్ చేయాలి.
  2. ఆ తరువాత తన రెండు చేతులను మోచేతుల వరకు మూడు సార్లు కడగాలి, మరియు చేతి హద్దు గోళ్లతో సహా వేళ్ళ చివరి నుండి పైచేతి ప్రారంభం వరకు ఉంటుంది, మరియు కడగడానికి ముందు చర్మం వరకు నీరు చేరడాన్ని అడ్డుకునే పిండి లేదా మట్టి, రంగు మరియు అలాంటి చేతికి అంటుకున్న వాటిని తప్పనిసరిగా తొలగించాలి.
  3. ఆ తరువాత తన తలను మరియు రెండు చెవులను కొత్త నీటితో ఒకసారి మసహ్ చేయాలి,

తలను మసాహ్ చేసే విధానం ఎలాగంటే, నీటితో తడిపిన రెండు చేతులను తల ముందు భాగము పై పెట్టి వెనుక భాగము వద్దకు పోనిచ్చి ఆ తరువాత వాటిని మొదలు పెట్టిన స్థలం వద్దకు తీసుకు రావాలి, తరువాత చూపుడు వేళ్ళను రెండు చెవుల లోపలి భాగములో పోనిచ్చి, మరియు బొటన వేళ్ళతో వాటి బాహ్య భాగమును మసాహ్ చేయాలి.

ఇక మహిళ జుట్టు విషయానికొస్తే, ఆమె జుట్టు కిందకు వేలాడుతున్నా లేదా ముడి కట్టుకుని ఉన్నా, తల ముందు భాగం నుండి మెడపై జుట్టు మొదలయ్యే చోటు వరకు ఆమె దానిపై మసహ్ చేయాలి. మరియు ఆమె వీపుపై పొడవుగా ఉన్న జుట్టుకు మసహ్ చేయడం తప్పనిసరి కాదు.

  1. ఆ తరువాత రెండు పాదాలను చీలమండలాల వరకు మూడు సార్లు కడగాలి. చీలమండలాలు అనగా కాలి కింది భాగంలో (పిక్క కింద) వెనకకు పొడుచుకు వచ్చిన రెండు ఎముకలు.
  • నీటిని పొందలేని వ్యక్తి తయమ్ముమ్ చేసుకోవాలి, మరియు తయమ్ముమ్ అంటే నీరు అందుబాటులో లేనప్పుడు లేదా దానిని ఉపయోగించలేనప్పుడు శుభ్రమైన ఇసుక, దుమ్ము, ధూళి లేదా మట్టి వంటి వాటిని ఉపయోగించి పరిశుభ్రం కావడం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మీకు నీళ్ళు దొరక్కపోతే - పరిశుద్ధమైన మట్టిని చేతులతో స్పర్శించి, ఆ చేతులతో మీ ముఖాలను మరియు మీ చేతులను, తుడుచుకోండి (తయమ్మమ్ చేయండి). నిశ్చయంగా అల్లాహ్ తప్పులను మన్నించేవాడు, క్షమించేవాడు.﴿

[నిసా: 1]

తయమ్ముమ్ విధానం: రెండు అరచేతులను ఒక్కసారి మట్టిపై కొట్టి, ముఖాన్ని మరియు చేతుల వెనుక భాగాలను ఒక్కసారి మాత్రమే మసహ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రవక్త ﷺ అమ్మార్ బిన్ యాసిర్ (రజియల్లాహు అన్హు) తో ఇలా అన్నారు:

"నీవు ఇలా చేస్తే సరిపోతుంది." అలా చెప్పి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులతో నేలపై కొట్టారు మరియు వాటిపై ఊదారు, ఆ తరువాత వాటితో తన ముఖం మరియు తన చేతులపై మసహ్ చేశారు.

[ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (2620) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1003) లో ఉల్లేఖించారు].

పైన పేర్కొన్న విషయానికి ఆధారం, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి సేవకుడు హుమ్రాన్ రివాయత్ చేసిన హదీసు. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు

«వుజూ చేయుట కొరకు నీళ్ళు తెప్పించి వుజూ చేశారు. తన రెండు చేతులను మూడు సార్లు కడిగారు. తరువాత పుక్కిలించారు మరియు ముక్కును శుభ్రపర్చుకున్నారు. తరువాత తన ముఖాన్ని మూడు సార్లు కడిగారు. తరువాత తన కుడి చేతిని మోచేతి వరకు మూడు సార్లు కడిగారు. తరువాత తన ఎడమ చేతిని అదే విధంగా కడిగారు. తరువాత తన తలను మసాహ్ చేశారు. తరువాత తన కుడి పాదాన్ని చీలమండలాల వరకు మూడు సార్లు కడిగారు. తరువాత ఎడమ పాదాన్ని అదే విధంగా కడిగారు. ఆ తరువాత ఆయన ఇలా అన్నారు: "దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేను చేసిన ఈ వుజూ మాదిరిగానే వుజూ చేయగా నేను చూశాను. ఆ తరువాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: ‘ఎవరైతే నేను చేసిన ఈ వుజూ మాదిరిగా వుజూ చేసి, తరువాత నిలబడి, రెండు రకాతుల నమాజును వాటి మధ్య ఎలాంటి ప్రాపంచిక ఆలోచనలూ రానీయకుండా ఆచరిస్తాడో, అతడి పూర్వపు పాపాలు క్షమించి వేయబడతాయి.’"»

[దీన్ని ముస్లిం ఉల్లేఖించారు].

అల్లాహ్ వాక్కు:

﴾ఓ విశ్వాసులారా! మీరు నమాజ్ కు లేచి నపుడు, మీ ముఖాలను, మరియు మీ చేతులను మోచేతుల వరకు కడుక్కోండి. మరియు మీ తలలను (తడి చేతులతో) తుడుచుకోండి. మరియు మీ కాళ్ళను చీలమండల వరకు కడుక్కోండి. మరియు మీకు ఇంద్రియ స్ఖలనం (జునుబ్) అయి ఉంటే, స్నానం (గుస్ల్) చేయండి. మరియు మీరు అస్వస్థులై ఉన్నా, లేక ప్రయాణంలో ఉన్నా, లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకొని ఉన్నా, లేక మీరు స్త్రీలతో కలిసి (సంభోగం చేసి) ఉన్నా, అప్పుడు మీకు నీరు లభించని పక్షంలో పరిశుభ్రమైన మట్టితో తయమ్మమ్ చేయండి. అంటే మీ ముఖాలను మరియు మీ చేతులను, దానితో (పరిశుద్ధమైన మట్టిపై స్పర్శించిన చేతులతో) రుద్దుకోండి. మిమ్మల్ని కష్టపెట్టాలనేది అల్లాహ్ అభిమతం కాదు. మీరు కృతజ్ఞులు కావాలని ఆయన, మిమ్మల్ని శుద్ధపరచి మీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయగోరుతున్నాడు.﴿

[అల్ మాయిదా : 46]

అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కురిపించుగాక.

المصدر

قسم أركان الإسلام

ملاحظات

--