Skip to content

ఇస్లాం ఐదు మూలస్తంభాలు ఏవి?

محاور التعريف بالإسلام
الشبهات والاعتراضات
مصدر الإجابة
قسم أركان الإسلام
الباب / الفصل
(قسم أركان الإسلام)

السؤال

ఇస్లాం ఐదు మూలస్తంభాలు ఏవి?

الجواب

ఇస్లాం ఐదు మూలస్తంభాలపై నిర్మితమై ఉంది, వాటిని వివరిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సెలవిచ్చారు:

"ఇస్లాం ధర్మం ఐదు పునాదులపై ఆధారపడి ఉంది: అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడనీ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవప్రవక్త అని సాక్ష్యం పలకటం, నమాజ్ స్థాపించటం, జకాత్ చెల్లించటం, దైవగృహ యాత్ర చేయటం, రమజాన్ నెలలో ఉపవాసాలు పాటించటం."

[ముత్తఫఖున్ అలైహి].

మొదటి మూలస్తంభము : అల్లాహ్ తప్ప వేరొక నిజ ఆరాధ్యదైవం లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం. అంటే: మహోన్నతుడైన అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యదైవం ఎవరూ లేరని విశ్వసించడం, అలాగే దీని అర్థాన్ని మరియు దీని అవసరాలైన తాగుత్‌ను నిరాకరించటాన్ని తెలుసుకోవడం, మహోన్నతుడైన అల్లాహ్ ధర్మానికి కట్టుబడి ఉండటం, మరియు ప్రేమ, గౌరవాలతో పాటు ఆయనకే ఆరాధనను ప్రత్యేకించటం, మరియు అల్లాహ్ ఒక్కడే ప్రభువు, యజమాని, కార్యనిర్వాహకుడు, సృష్టికర్త మరియు ఉపాధిదాత అని మనిషి విశ్వసించడం, మరియు ఆయన తన కొరకు స్వయంగా ధృవీకరించిన లేదా ఆయన సందేశహరుడు ఆయన కొరకు ధృవీకరించిన అత్యుత్తమ పేర్లు మరియు ఉన్నతమైన గుణగణాలన్నింటినీ ఆయన కొరకు ధృవీకరించటం, మరియు ఇతరులు కాకుండా అల్లాహ్ ఒక్కడే ఆరాధనకు అర్హుడని విశ్వసించడం, ఎందుకంటే ఆయన ఒక్కడే సృష్టికర్త, ఆయనకు ఎవరు సాటి లేరు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఏ నమూనా లేకుండా ఆరంభించిన వాడు. నిశ్చయంగా, ఆయనకు జీవన సహవాసియే (భార్యయే) లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉండగలడు? మరియు ప్రతి దానిని ఆయనే సృష్టించాడు. మరియు ఆయనే ప్రతి విషయం గురించి బాగా తెలిసినవాడు.

ఆయనే అల్లాహ్ ! మీ ప్రభువు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనే సర్వానికి సృష్టికర్త, కావున మీరు ఆయననే ఆరాధించండి. మరియు ఆయనే ప్రతి దాని కార్యకర్త.﴿

[అల్ అన్ ఆమ్:103]

ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ అల్-హాష్మీ అల్-ఖురైషీ గారు ప్రవక్తల పరంపరలో చివరివారని మరియు సందేశహరులలో అత్యంత శ్రేష్ఠుడని సాక్ష్యం పలకటం. దీనితో పాటు, దైవ నియమావళిలో తెలుపబడిన విధంగా ఎటువంటి నిర్లక్ష్యానికి గానీ, అతిశయోక్తికి గానీ తావు లేకుండా ఆయన ధర్మానికి కట్టుబడి ఉండాలి మరియు ఆయనను గౌరవించాలి. ఆయన విధానాన్ని (సున్నత్‌ను) ఆచరించకపోవడం నిర్లక్ష్యం అవుతుంది మరియు అల్లాహ్‌ను వదిలి ఆయనను ఆరాధించడం అతిశయోక్తి అవుతుంది. ఉదాహరణకు: ఆయన పేరు మీద ప్రమాణం చేయడం, ఆయనను ప్రార్థించడం లేదా అల్లాహ్‌కు తప్ప ఇతరులకు చేయకూడని మరే ఇతర కార్యాలైనా ఆయనకు చేయడం.

అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పంపాడని, ఆయనపై ఖుర్ఆన్ ను అవతరింపజేశాడని మరియు ఈ ధర్మాన్ని ప్రజలందరికీ అందజేయాలని ఆయనను ఆదేశించాడని మానవుడు ఏ విధంగానైతే విశ్వసిస్తాడో, అదే విధంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ప్రేమించడం మరియు వారికి విధేయత చూపడం ప్రతి ఒక్కరిపై విధి అని, మరియు అల్లాహ్ ప్రేమ ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని కూడా విశ్వసిస్తాడు. మహోన్నతుడైన ఆయన ఇలా పలికాడు:

﴾(ఓ ప్రవక్తా!) ఇలా అను: "మీకు (నిజంగా) అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (అప్పుడు) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రధాత.﴿

[ఆలె ఇమ్రాన్: 3-4]

మరియు ఆయన ఆదేశించిన వాటిలో ఆయనకు విధేయత చూపడం, ఆయన తెలియపరచిన వాటిలో ఆయనను సత్యవంతుడు అని నమ్మడం, ఆయన నిషేధించిన మరియు మందలించిన వాటి నుండి దూరంగా ఉండడం, మరియు ఆయన ధర్మశాసనం చేసిన వాటి ద్వారా మాత్రమే అల్లాహ్ ను ఆరాధించడం అనివార్యము, అంతేగానీ ప్రజలు కల్పించిన నూతన ఆవిష్కరణల (బిద్అతుల) ద్వారా కాదు.

ప్రవక్తను పంపించటంలో ఉన్న విజ్ఞత ఏమిటంటే, ప్రజల ధార్మిక మరియు ప్రాపంచిక జీవితాలలో వారికి మేలు మరియు శ్రేయస్సు చేకూర్చే విషయాల వైపుకు మరియు వారి ప్రభువును ప్రసన్నుడిని చేసే విషయాల వైపుకు వారికి మార్గదర్శకం చేయటం మరియు సన్మార్గం చూపటం.

రెండవ మూలస్థంభము : నమాజును నెలకొల్పడం, మరియు సలాహ్ (నమాజు) అంటే నిర్దిష్ట పదాలు మరియు చర్యల ద్వారా అల్లాహ్ ను ఆరాధించడం. ఇది తక్బీర్ (అంటే అరబీ భాషలో అల్లాహు అక్బర్ (అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు)) అనే పదాలతో మొదలై, తస్లీమ్ (సలాహ్ (నమాజు)ను ముగించే సలాం పదాలతో ముగుస్తుంది.

అవి రాత్రింబవళ్ళలో ఐదు వేళల నమాజులు, అవి: ఫజర్, జొహర్, అసర్, మగ్రిబ్ మరియు ఇషా నమాజులు.

మరియు సలాహ్ (నమాజు) ప్రతి ముస్లింపై విధిగావించబడింది.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾నిశ్చయంగా, నమాజ్ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించడానికి విధిగా నియమించబడింది.﴿

[సూరతు నిసా: 163],

నమాజు యొక్క ప్రయోజనాల్లో ఒకటి ఏమిటంటే, ఇది దాసుడు మరియు అతని ప్రభువు మధ్య ఒక అనుసంధానం, ఉపశమనం మరియు ప్రశాంతత, మరియు అది అసభ్యతలను, చెడు పనుల నుంచి ఆపుతుంది, మొదలైనవి.

మూడవ మూలస్తంభము: జకాత్ చెల్లించడం, ఇది నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట వర్గానికి, నిర్దిష్ట సంపదలో విధిగా చెల్లించవలసిన హక్కు. ఇది ఇస్లాం యొక్క మూలస్తంభాలలో ఒకటి, మరియు ధనవంతుల నుండి తీసుకొని పేదలకు ఇవ్వబడే తప్పనిసరి దానం.

﴾(కావున ఓ ప్రవక్తా!) నీవు వారి సంపదల నుండి దానం (సదఖహ్) తీసుకొని, దానితో వారి పాపవిమోచనం చెయ్యి మరియు వారిని సంస్కరించు...﴿

[తౌబా :103]

జకాతు యొక్క ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే, అది సంపదను పరిశుద్ధపరుస్తుంది మరియు వృద్ధి చేస్తుంది, లోభత్వం మరియు పిసినారితనం నుండి హృదయాలను పరిశుద్ధపరుస్తుంది, మరియు ధనవంతులకు మరియు పేదలకు మధ్య ప్రేమ బంధాలను బలోపేతం చేస్తుంది, తద్వారా ద్వేషం తొలగిపోతుంది, భద్రత నెలకొంటుంది మరియు సమాజం ఆనందపడుతుంది.

నాల్గవ మూలస్థంభము: రమదాన్ మాసపు ఉపవాసములు పాటించుట. ఉపవాసము అంటే హిజ్రీ సంవత్సరంలోని తొమ్మిదవ మాసపు పగటిపూట తినుట, త్రాగుట మరియు సంభోగము వంటి ఉపవాసాన్ని భంగపరిచే విషయాల నుండి దూరంగా ఉండుట.

﴾రమదాన్ నెల! అందులో దివ్య ఖుర్ఆన్ మానవులకు మార్గదర్శకత్వంగా, అవతరింపజేయబడింది! మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యాసత్యాలను వేర్పరచే, స్పష్టమైన ఉపదేశాలున్నాయి. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా (విధిగా) ఉపవాస ముండాలి...﴿

[అల్ బఖర: 21]

ఉపవాసం యొక్క విజ్ఞతలలో ఒకటి ఏమిటంటే, ఉపవాసం మహోన్నతుడైన అల్లాహ్ పట్ల భయభక్తులను సాధించే ఒక సాధనం.

ఉపవాసం ఉండే వ్యక్తికి మహోన్నతుడైన అల్లాహ్ తనపై చేసిన అనుగ్రహాన్ని గుర్తు చేయడం.

మరియు ఉపవాసకుడికి తన సోదరులైన పేదలు మరియు నిరుపేదల గురించి గుర్తుచేయడం.

ఉపవాసం ముస్లింల మనోభావాలను ఏకం చేస్తుంది.

ఉపవాసం శరీరానికి ఆరోగ్యాన్ని మరియు శక్తిని చేకూరుస్తుంది.

ఇవే కాకుండా, మరెన్నో ఉన్నాయి.

ఐదవ మూలస్థంభము: “హజ్జ్”. స్థోమత గలవారు జీవితంలో ఒక్కసారైనా మక్కా నగరంలోని పవిత్ర ప్రదేశాలను దర్శించి, అక్కడ నిర్ణీత విధి,విధానాలను ఆచరించడాన్ని “హజ్జ్” అంటారు.

﴾మరియు అక్కడికి పోవటానికి, శక్తిగలవారికి ఆ గృహయాత్ర (హిజ్జుల్ బైత్) అల్లాహ్ (ప్రసన్నత) కొరకు చేయటం, విధిగా చేయబడింది. ఎవరు దీనిని తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ సమస్త లోకాల వారి అవసరం లేని స్వయం సమృద్ధుడు (అని తెలుసుకోవాలి).﴿

హజ్ యొక్క జ్ఞాన పరమైన ప్రయోజనాలలో: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క తౌహీద్ (ఏకత్వం) ను నెలకొల్పడం, అల్లాహ్ (సుభానహు) పట్ల తఖ్వా (దైవభీతి) ని సాధించడం, అల్లాహ్ (అజ్జ వ జల్) స్మరణ (జిక్ర్) ను స్థాపించడం, మానవ ఆత్మను సంస్కరించడం, మరియు ఉమ్మత్‌కు (సమాజానికి) సరైన ఐక్యత యొక్క భావాలను నేర్పించడం ఉన్నాయి. ఇవే కాకుండా ఇందులో మరెన్నో జ్ఞాన పరమైన ప్రయోజనాలు, ఫలాలు మరియు లాభాలు ఉన్నాయి.

ఇది సంక్షిప్త వివరణ, మరియు ప్రతీ మూలస్థంభానికి షరతులు, మూలాలు మరియు అనేక వివరాలు ఉన్నాయి.

అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కురిపించుగాక.

المصدر

قسم أركان الإسلام

ملاحظات

--