ఇస్లాంలో ఇబాదత్ (ఆరాధన) భావన అంటే ఏమిటి?
- محاور التعريف بالإسلام
- محاسن الإسلاممحاسن العبادة
- مصدر الإجابة
- قسم أركان الإسلام
- الباب / الفصل
- (قسم أركان الإسلام)
السؤال
ఇస్లాంలో ఇబాదత్ (ఆరాధన) భావన అంటే ఏమిటి?
الجواب
ఆరాధన అనగా ప్రేమ మరియు భక్తిగౌరవాలతో అల్లాహ్ తాలా పట్ల సమర్పణ మరియు విధేయత కలిగి ఉండటం. అల్లాహ్ తాలా ఇష్టపడే మరియు సంతోషించే బాహ్యపరమైన, అంతర్గతపరమైన పలుకులు మరియు చేతలన్నీ ఆరాధన భావనలో ఇమిడి ఉంటాయి. వీటిలో నమాజు మరియు హజ్ వంటి పరిపూర్ణమైన ఆరాధనలు ఉన్నాయి, మరియు అల్లాహ్ వద్ద ప్రతిఫలాన్ని ఆశించినట్లయితే మనిషికి ప్రతిఫలం లభించే చేతలు కూడా ఉన్నాయి; ఆరాధన కోసం బలాన్ని పొందే ఉద్దేశ్యంతో నిద్రపోవడం మరియు ఇదే ఉద్దేశ్యంతో తినడం లాంటివి. ఇవి ఎప్పుడైతే ఈ ఉద్దేశ్యంతో ముడిపడి ఉంటాయో, అప్పుడు అవి అల్లాహ్ సుబహానహు వతఆలాకు ఇష్టమైనవిగా మారుతాయి. మరియు ఒక వ్యక్తి ప్రతిఫలాన్ని ఆశిస్తూ హలాల్‌ను (ధర్మసమ్మతమైన దానిని) ఉద్దేశించి, హరామ్‌ను (నిషిద్ధమైన దానిని) విడిచిపెడితే, దానికి కూడా అతనికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది, అబూ దర్ర్ ఉల్లేఖించినట్లుగా,
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కొంతమంది సహాబాలు ఇలా అన్నారు: "ఓ దైవప్రవక్త! ధనవంతులు ఎన్నో పుణ్యాలు సంపాదించేస్తున్నారు. మేము నమాజు చేసినట్లుగానే వారు కూడా నమాజు చేస్తారు, మేము ఉపవాసాలు పాటించినట్లుగానే వారు కూడా ఉపవాసాలు పాటిస్తారు, మరియు తమ మిగులుధనం నుండి సదఖా చేస్తారు." దానికి ఆయన ఇలా పలికారు: "అల్లాహ్ మీకు కూడా సదఖా చేయడానికి మార్గాలను కల్పించలేదా? నిస్సందేహంగా ప్రతీ తస్బీహ్ (సుబ్ హానల్లాహ్ పలకటం) ఒక సదఖా, ప్రతీ తక్బీర్ (అల్లాహు అక్బర్ పలకటం) ఒక సదఖా, ప్రతీ తహ్మీద్ (అల్హందులిల్లాహ్ పలకటం) ఒక సదఖా, మరియు ప్రతీ తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్ పలకటం) కూడా ఒక సదఖాయే. మంచిని ఆదేశించడం సదఖా, చెడును నిరోధించడం సదఖా, మరియు మీలో ఎవరైనా తమ కోరికను తీర్చుకోవడంలో కూడా ఒక సదఖా ఉంది." వారు అడిగారు: "ఓ దైవప్రవక్త! మాలో ఎవరైనా తన కోరికను తీర్చుకుంటే దానిపై కూడా అతనికి పుణ్యం లభిస్తుందా?" దానికి ఆయన ఇలా బదులిచ్చారు: "మీరే చెప్పండి, ఒకవేళ అతను ఆ కోరికను హరామ్ మార్గంలో తీర్చుకుంటే అతనిపై పాపం ఉంటుందా లేదా? అలాగే, అతను దానిని హలాల్ మార్గంలో తీర్చుకుంటే అతనికి పుణ్యం లభిస్తుంది."
[సహీహ్ ముస్లిం (170)].
మరియు కార్యాలలో ఉద్దేశ్యపూర్వకంగా మానుకోవడం మరియు వదిలివేయడం లాంటివి ఉంటాయి, ఉదాహరణకి ఉపవాసం. ఇక వాక్కులు ఉదాహరణకి జిక్ర్ (స్మరణ) మరియు ఖురాన్ పఠనం. అంతర్ముఖ కార్యాలు అనగా హృదయం యొక్క కార్యాలు ఒక ముస్లిం దృఢంగా విశ్వసించే విశ్వాసాలు మరియు విషయాలు, ఉదాహరణకి పునరుత్థానం, అగోచరమైన దానిపై ఈమాన్ మరియు తౌహీద్. మరియు హృదయం యొక్క కార్యాలు ఉదాహరణకి నమ్మకం ఉంచడం, భయం మరియు ఆశ. సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌కు కాకుండా మరెవరికీ ఆరాధనను సమర్పించడం అనుమతించబడదు, మరియు మూడు షరతులతో తప్ప ఏ ఆరాధనా స్వీకరించబడదు: మొదటిది ఇస్లాం, రెండవది నిజాయితీ, మరియు మూడవది సున్నత్‌ను అనుసరించడం.
المصدر
ملاحظات
--