జీవిత లక్ష్యం మరియు ఉద్దేశ్యం తెలియకుండా మనిషి నిజమైన సంతోషాన్ని పొందగలడా?
- محاور التعريف بالإسلام
- الغاية من خلق الإنسان ومعنى الحياة
- مصدر الإجابة
- قسم المسلمين
- الباب / الفصل
- (قسم المسلمين)
السؤال
జీవిత లక్ష్యం మరియు ఉద్దేశ్యం తెలియకుండా మనిషి నిజమైన సంతోషాన్ని పొందగలడా?
الجواب
అల్లాహ్’ను విశ్వసించకుండా; మరియు అల్లాహ్ తనను ఎందుకు సృష్టించాడో, తాను ఈ ఉనికిలోకి ఎందుకు వచ్చాడో మరియు తన మరణం తరువాత తాను ఎక్కడికి వెళతాడో తెలుసుకోకుండా ఒక వ్యక్తి నిజమైన ఆనందాన్ని పొందలేడు.
మానవుడు ఎన్ని రకాల అనుగ్రహాలను మరియు సంతోషాన్ని కలిగించే వివిధ రకాల సాధనాలను పొంది అనుభవించినప్పటికీ, అతన్ని వీడిపోని కష్టము అతనిలో తప్పక మిగిలి ఉంటుంది. అయితే ప్రశ్నించేవాడు ఇలా అడగవచ్చు : మీలో ఇంతటి దృఢనిశ్చయం ఎందుకు? అప్పుడు మేము ఇలా అంటాము, ఎందుకంటే మానవ ఆత్మను సృష్టించిన అల్లాహ్ ఈ విషయాన్ని తెలియజేశాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు ఎవడైతే నా సందేశం నుండి విముఖుడవుతాడో నిశ్చయంగా, అతని జీవితం ఇరుకై పోతుంది మరియు పునరుత్థాన దినమున అతినిని అంధునిగా లేపుతాము.﴿
[సూరతు తాహా : 5]
అతడు విశ్వసించకపోతే, అతనికి కష్టతరమైన మార్గాన్ని మరియు శాశ్వతమైన దౌర్భాగ్యాన్ని సులభతరం చేస్తాడని అల్లాహ్ తెలియపరుస్తున్నాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
﴾కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తాడో!
మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో!
అతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము.
మరియు అతడు నశించి పోయినప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది?﴿
[సూరతుల్ లైల్ : 8-11]
ఈ విషయం పవిత్రుడైన మరియు సత్యవంతుడైన అల్లాహ్ నుండి వచ్చినది; ఎందుకంటే ఆయనే మానవ ఆత్మను సృష్టించాడు, మరియు దానికి ఏది ప్రయోజనమో మరియు ఏది కీడు చేస్తుందో ఆయనకు తెలుసు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఏమిటీ? పుట్టించిన వాడికే తెలియదా? మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు!﴿
[సూరతుల్ ముల్క్: 14]
మరియు ఆయనే దానిలో మేలు, సద్గుణం, మార్గదర్శకత్వం మరియు సత్యం పట్ల ప్రేమను, మరియు అసత్యం, అవిశ్వాసం మరియు దుర్గుణం పట్ల ద్వేషాన్ని సృష్టించాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾కావున నీవు నీ ముఖాన్ని, ఏకాగ్రచిత్తంతో, సత్యధర్మం (ఇస్లాం) దిశలో స్థిరంగా నిలుపు. అల్లాహ్ మానవులను ఏ స్వభావంతో పుట్టించాడో, ఆ స్వభావం పైననే వారు ఉంటారు. అల్లాహ్ సృష్టి స్వభావాన్ని (ఎవ్వరూ) మార్చలేరు. ఇదే సరైన ధర్మం, కాని చాలా మంది ఇది ఎరుగరు.﴿
[సూరతుర్ రూమ్: 32]
తన ఉనికి యొక్క ఉద్దేశ్యాన్ని తెలుసుకోనివాడు జీవిత ఆనందాన్ని, సంతృప్తి యొక్క ఆనందాన్ని మరియు తాను చేసే సదాచరణకు ఇహలోకంలో కాకపోయినా పరలోకంలోనైనా దాని ప్రతిఫలం ఖచ్చితంగా పొందుతాడని తెలుసుకోవడం ద్వారా కలిగే సాఫల్యపు ఆనందాన్ని కోల్పోతాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-
﴾అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ఈ రోజు సత్యవంతులకు వారి సత్యం లాభదాయక మవుతుంది. వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు లభిస్తాయి. అక్కడ వారు శాశ్వతంగా కలకాలముంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడవుతాడు మరియు వారు ఆయనతో ప్రసన్నులవుతారు. ఇదే గొప్ప విజయం (సాఫల్యం)!﴿
[సూరతుల్ మాయిద : 44వ ఆయతు]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.﴿
[నహల్ : 97]
సంతోషం యొక్క వాస్తవికతను, విశ్వాసం యొక్క మాధుర్యాన్ని మరియు సిరిసంపదలు గానీ, సంతానం గానీ ఎలాంటి లాభం చేకూర్చని ఆ దినం కొరకు సత్కర్మలను కూడబెట్టుకోవడంలోని ఆనందాన్ని మహోన్నతుడైన అల్లాహ్ ను విశ్వసించేవాడు తప్ప మరెవరూ తెలుసుకోలేరు.
ఎవరైనా ఇలా అనవచ్చు: నిశ్చయంగా మనం కొందరిని అత్యున్నత సంతోషంలో చూస్తాము, మరియు వారు అల్లాహ్ పై విశ్వాసము లేని వారు. అయితే మేము ఇలా అంటాము: అవును, వాస్తవాన్ని (హఖ్) తెలుసుకోని పరధ్యానంలో ఉన్నవాడు ఉంటాడు, మరియు అతడు అల్లాహ్ ఎవరి గురించి అయితే తెలియజేశాడో వారిలోని వాడే. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾వారిని తింటూ (త్రాగుతూ) సుఖసంతోషాలను అనుభవిస్తూ (వృథా) ఆశలలో ఉండటానికి విడిచిపెట్టు. తరువాత వారు (సత్యాన్ని) తెలుసుకుంటారు.﴿
[సూరతుల్ హిజ్ర్: 3]
అల్లాహ్ వాక్కు:
﴾(ఓ ప్రవక్తా!) దేశాలలో సత్యతిరస్కారుల సంచారం, నిన్ను మోసంలో పడవేయకూడదు!
ఇది వారికి కొద్దిపాటి సుఖం మాత్రమే! తరువాత వారి ఆశ్రయం నరకమే. మరియు అది అతి అధ్వాన్నమైన నివాస స్థలము.﴿
[సూరతు ఆలే ఇమ్రాన్: 81]
నిశ్చయంగా, అజ్ఞానంలో పడి ఉండి ఏమరపాటులో ఉన్న, వ్యర్థమైన వాటిలో మునిగిపోయిన ఈ వ్యక్తి సుఖాలను అనుభవిస్తున్నాడు. ఒకవేళ మృత్యువు సమయంలో మరియు మృత్యువు తరువాత తనకు ఏమి ఎదురుచూస్తుందో అతనికి తెలిసి ఉంటే, అతడు ఏ సుఖాన్నీ అనుభవించేవాడు కాదు. కానీ ఈ స్థితి అతని మృత్యువు సమయంలో తప్ప అతనికి వెల్లడి కాదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు సత్యతిరస్కారుల ప్రాణాలను దైవదూతలు తీసే దృశ్యాన్ని నీవు చూపడగలిగితే (ఎంత బాగుండేది). వారు (దేవదూతలు) వారి ముఖాలపైనను మరియు వారి పిరుదులపైనను కొడుతూ ఇలా అంటారు: "భగభగమండే ఈ నరకాగ్ని శిక్షను చవి చూడండి.﴿
[సూరతుల్ అన్'ఫాల్: 50]
సత్యం అతనికి స్పష్టమయ్యినప్పుడు — ప్రతి ముస్లిం తెలిసి నిశ్చయంగా విశ్వసించే ఆ సత్యం — అతను మహోన్నతుడైన అల్లాహ్ తెలియజేసినట్లుగా ఇలా అంటాడు:
﴾చివరికి వారిలో ఒకడికి మరణం సమీపించినప్పుడు వాడిలా వేడుకుంటాడు: "ఓ నా ప్రభూ! నన్ను తిరిగి (భూలోకానికి) పంపు:
నేను చేయకుండా వచ్చిన సత్కార్యాలు చేయటానికి." అది కాని పని. నిశ్చయంగా అది అతని నోటిమాట మాత్రమే! ఇక (ఈ మరణించిన) వారు తిరిగి లేపబడే దినం వరకు వారి ముందు ఒక అడ్డుతెర (బర్ జఖ్) ఉంటుంది.
ఆ తరువాత బాగా ఊదబడిన దినమున వారి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండవు. మరియు వారు ఒకరి నొకరు పలుకరించుకోరు కూడా!
ఇక ఎవరి (సత్కార్యాల) పళ్ళాలు బరువుగా ఉంటాయో, ఆలాంటి వారే సాఫల్యం పొందేవారు.
మరియు ఎవరి పళ్ళాలు తేలికగా ఉంటాయో, అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేసుకున్న వారు, వారే నరకంలో శాశ్వతంగా ఉండేవారు.﴿
[సూరతుల్ మోమినూన్: 99-103]
అందువలన, జీవిత లక్ష్యాన్ని తెలుసుకోని వాడు, అతను ఎంత కృషి చేసినా మరియు ఎంత ప్రయత్నించినా నిజమైన సంతోషాన్ని పొందలేడని మేము నిర్ధారిస్తున్నాము మరియు ఖచ్చితంగా నమ్ముతున్నాము. కాబట్టి మేము అల్లాహ్’ను వేడుకుంటున్నాము! ఆయన మమ్మల్ని దురదృష్టవంతులను చేయకుండుగాక మరియు తన వద్ద నుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించుగాక!
المصدر
ملاحظات
--