ముస్లింలు మూల పాప సిద్ధాంతాన్ని విశ్వసిస్తారా?
- محاور التعريف بالإسلام
- الشبهات والاعتراضات
- مصدر الإجابة
- قسم المسلمين
- الباب / الفصل
- (قسم المسلمين)
السؤال
ముస్లింలు మూల పాప సిద్ధాంతాన్ని విశ్వసిస్తారా?
الجواب
'(వారసత్వంగా వచ్చిన పాపం)' అని పిలవబడేది ఎలాంటి వాస్తవం లేని ఒక భ్రమ, మరియు ఇది యూదులు మరియు క్రైస్తవుల పవిత్ర గ్రంథంలోని కల్పిత కథలలో ఒకటి. ఆదమ్ మరియు హవ్వా ఒక ఘోరమైన పాపం చేశారని, మరియు ఆదమ్ ను చెట్టు నుండి తినేలా ప్రేరేపించింది హవ్వా అని వారు ఆరోపిస్తారు. మరియు వారి ఈ అబద్ధపు వాదన ఫలితంగా, ఆదమ్ తన పాప భారాన్ని మోశాడని, మరియు దానిని తన తర్వాత తన సంతానానికి వారసత్వంగా ఇచ్చాడని, తన భర్త ఆదమ్ ను ప్రేరేపించినందుకు శిక్షగా అల్లాహ్ స్త్రీని గర్భం దాల్చేలా మరియు ప్రసవించేలా శిక్షించాడని, షైతాన్ స్వర్గంలో ప్రవేశించాలనుకున్నప్పుడు పాము రూపం ధరించినందున అల్లాహ్ పామును తన పొట్టపై పాకేలా మరియు మట్టి తినేలా శిక్షించాడని, ఆదమ్ పాపం కారణంగా భూమిని శపించాడని మొదలగునవి. ఈ అబద్ధపు కల్పిత కథ మార్పుచేయబడిన యూదుల పవిత్ర గ్రంథం యొక్క అపవాదులలో ఒకటి.
ఆ తరువాత క్రైస్తవ మతం బహుదైవారాధక మతాల నుండి అరువు తెచ్చుకున్న ఒక ఘోరమైన విషయంతో వచ్చింది, అదేమిటంటే: అల్లాహ్ మానవులను వారి తండ్రి పాపం నుండి కరుణించి, తన కుమారుడిని బలి ఇవ్వాలని కోరుకున్నాడు, కాబట్టి తన కుమారుడిని పంపి, మసీహ్ శరీరంలో మూర్తీభవించేలా చేసాడు, ఆ తరువాత ఆదమ్ పాపానికి ప్రాయశ్చిత్తంగా అతనిని చంపడానికి మరియు సిలువ వేయడానికి యూదులకు అతనిపై అధికారం ఇచ్చాడు.
వాస్తవం ఏమిటంటే, అల్లాహ్ సృష్టిని సృష్టించి, ఆకాశాలు, భూమి మరియు దైవదూతల సృష్టిని పూర్తి చేసిన తరువాత, తాను భూమిలో ఒక ఉత్తరాధికారిని (ఖలీఫాను) సృష్టించబోతున్నానని దైవదూతలకు తెలియజేశాడు. అప్పుడు దైవదూతలు, తమ సహజ స్వభావంలో కాంక్ష మరియు కల్లోలం రేకెత్తించే గుణాలు ఉన్న వారిని అందులో ఎలా నియమిస్తావు? అని ప్రశ్నించారు. దానికి అల్లాహ్, నిశ్చయంగా తాను సర్వజ్ఞుడని మరియు మహా వివేకవంతుడని దైవదూతలకు తెలియజేస్తూ, ఈ ఖలీఫా భూమిపై సంతానోత్పత్తి చేస్తాడని, అందులో అతని సంతానం వృద్ధి చెందుతుందని, వారు ఒకరికొకరు ప్రాతినిధ్యం వహించుకుంటారని మరియు వారిలో సంస్కర్తలు కూడా ఉంటారని తెలియజేశాడు. అల్లాహ్ ఆదామును మరియు అతని భార్య హవ్వను సృష్టించడానికి ముందే లౌహె మహ్ఫూజ్ (భద్రపరచబడిన పలక)లో, భూమిని నిర్మించేందుకు మరియు అందులో ప్రాతినిధ్యం వహించే విధిని నెరవేర్చేందుకు, తాను వారిద్దరినీ భూమ్మీదకు వెళ్ళేలా చేస్తానని లిఖించాడు. ఆయన అతనిని సృష్టించిన తరువాత, తన గురించి మరియు తాను భూమ్మీద ఎదుర్కోబోయే తన శత్రువైన షైతాన్ గురించి అతనికి ఒక గుణపాఠం నేర్పడానికి అతనిని పరదైసులో నివసించడానికి అనుమతించాడు. అక్కడ ఆయన పరదైసులోని చెట్లన్నింటి నుండి తినడానికి అతనికి అనుమతినిచ్చాడు, కానీ ఇతర చెట్ల కంటే ఎటువంటి ప్రత్యేకత లేని ఒకే ఒక చెట్టు నుండి తినడాన్ని ఆయన వారించాడు. ఆయన దానిని కేవలం అతని కోసం ఒక పరీక్షగా మరియు మదింపుగా మాత్రమే నిషేధించాడు. షైతాన్ అతనిని మోసగించి, ఆ చెట్టు నుండి తినేలా అతనితో అబద్ధం ఆడినప్పుడు, తాను తప్పు చేశానని మరియు అల్లాహ్ తనకు చేసిన హెచ్చరికను మరచిపోయానని ఆదాము గ్రహించాడు. అప్పుడు ఈ పొరపాటు నుండి ఎలా పశ్చాత్తాపపడాలో అల్లాహ్ అతనికి నేర్పించాడు, కాబట్టి అల్లాహ్ ఆజ్ఞాపించినట్లుగానే అతను పలికాడు, ఆ తర్వాత అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు, మరియు ఆ విషయం అక్కడితో ముగిసింది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు (జ్ఞాపకం చేసుకో!) నీ ప్రభువు దేవదూతలతో: "వాస్తవంగా నేను భూమిలో ఒక ఉత్తరాధికారిని (ఖలీఫాను) సృష్టించబోతున్నాను!" అని చెప్పినపుడు, వారు: "ఏమీ? నీవు భూమిలో కల్లోలం రేకెత్తించే వానిని మరియు నెత్తురు చిందించే వానిని నియమించబోతున్నావా? మేము నీ స్తోత్రం చేస్తూ, నీ పవిత్రతను కొనియాడుతూనే ఉన్నాము కదా!" అని విన్నవించు కున్నారు. దానికి ఆయన: "నిశ్చయంగా, మీకు తెలియనిది నాకు తెలుసు!" అని అన్నాడు.
మరియు ఆయన (అల్లాహ్) ఆదమ్ కు సకల వస్తువుల పేర్లను నేర్పాడు, ఆ పిదప వాటిని దేవదూతల ఎదుట ఉంచి: "మీరు సత్యవంతులే అయితే, వీటి పేర్లను నాకు తెలుపండి." అని అన్నాడు.
వారు (దేవదూతలు): "నీవు సర్వలోపాలకు అతీతుడవు, నీవు తెలిపినదే తప్ప మాకు మరేమీ తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వజ్ఞుడవు, మహా వివేకవంతుడవు." అని అన్నారు.
ఆయన (అల్లాహ్): "ఓ ఆదమ్! వీటి (ఈ వస్తువుల) పేర్లను వీరికి తెలుపు." అని అన్నాడు. ఎపుడైతే అతను (ఆదమ్) ఆ వస్తువుల పేర్లను వారికి తెలిపాడో; ఆయన అన్నాడు: "నిశ్చయంగా, నేను మాత్రమే భూమ్యాకాశాల అగోచర విషయాలను ఎరుగుదునని మీతో చెప్పలేదా? మరియు మీరు ఏది బహిర్గతం చేస్తారో మరియు ఏది దాస్తారో కూడా నాకు బాగా తెలుసు!
మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము దేవదూతలతో: "మీరందరూ ఆదమ్ ముందు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని ఆదేశించినపుడు, ఒక ఇబ్లీస్ తప్ప మిగతా వారంతా సాష్టాంగం (సజ్దా) చేశారు; అతడు నిరాకరించాడు మరియు దురహంకారానికి గురయ్యాడు మరియు సత్యతిరస్కారులలోని వాడయ్యాడు.
మరియు మేము (ఆదమ్ తో) అన్నాము: "ఓ ఆదమ్! నీవూ మరియు నీ భార్యా, ఈ స్వర్గంలో నివసించండి మరియు మీరిద్దరూ మీకు ఇష్టమైనది యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు దరిదాపులకు పోకండి, అలా చేస్తే మీరిద్దరూ దుర్మార్గులలో చేరిన వారవుతారు!
ఆ పిదప షైతాన్ వారిద్దరినీ దాని (స్వర్గం) నుండి తప్పించి, వారిద్దరినీ వారున్న స్థితి నుండి బయటికి తీశాడు. మరియు మేము (అల్లాహ్) అన్నాము: "మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి; మీరు ఒకరికొకరు విరోధులవుతారు. ఒక నియమిత కాలం వరకు మీరు భూమిలో ఉండి, అక్కడే జీవితం గడప వలసి ఉంటుంది.
తరువాత ఆదమ్, తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి, (పశ్చాత్తాప పడి క్షమాభిక్ష కోరాడు) మరియు ఆయన (అల్లాహ్) అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రధాత.
మేము (అల్లాహ్) ఇలా అన్నాము: "మీరంతా ఇక్కడి నుండి దిగి పోండి." ఇక నా తరఫు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైతే నా మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!﴿
[సూరతుల్ బఖరహ్: 129]
ఈ కథ యొక్క సంఘటనలు దేని చుట్టూ తిరుగుతాయంటే, అల్లాహ్ భూమి కొరకు ఒక ప్రతినిధిని సృష్టించాడు మరియు అతని తొలి నివాసాన్ని స్వర్గంలో ఉంచాడు. ఆ తరువాత ఆయన అతనికి జ్ఞానాన్ని బోధించగా అతను దానిని నేర్చుకున్నాడు, ఆయన అతనికి ఆదేశించాడు మరియు నిషేధించాడు. అప్పుడు అతని వల్ల ఒక తప్పు జరిగింది, దానిని ఖురాన్ 'జల్లా' (పొరపాటు) అని పేర్కొంది మరియు దానిని 'పాపము' అని పేర్కొనలేదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఆ పిదప షైతాన్ వారిద్దరినీ దాని (స్వర్గం) నుండి తప్పించి﴿
తనపై నిర్దారించబడిన పరీక్షకు అతడు గురైనప్పుడు, తన ద్వారా తప్పు జరిగినప్పుడు దానిని ఎలా సరిదిద్దుకోవాలో మరియు తన ప్రభువుతో ఎలా పశ్చాత్తాపపడాలో అల్లాహ్ అతనికి తెలిపాడు. మరియు అల్లాహ్ అతని పశ్చాత్తాపం ఆమోదించాడు, అతనికి మార్గదర్శనం చేశాడు మరియు అతన్ని సత్కరించాడు. మరియు అతని పశ్చాత్తాపం ఆమోదించిన తరువాత, అతను ఏ కార్యము కొరకు సృష్టించబడ్డాడో దానిని పూర్తి చేయడానికి అతన్ని భూమిపైకి పంపాడు.
మరియు యూదుల గ్రంథంలో అనేక వచనాలు ఉన్నాయి - వాటిని ప్రస్తావించవలసిన అవసరం లేదు - అవి సంతానం తన తండ్రి పాపానికి వారసులవుతారని లేదా మానవాళి పాపాన్ని వారసత్వంగా పొందుతుందనే విషయాన్ని ఖండిస్తాయి, మరి అలాంటప్పుడు యూదులు మరియు వారిని అనుసరించి క్రైస్తవులు ఈ అబద్ధాన్ని ఎలా కల్పించారు.
మరియు పవిత్ర ఖుర్ఆన్ లో ఒక వ్యక్తి మరొక వ్యక్తి పాపాన్ని మోయడు, మరియు బిడ్డ తన తండ్రి పాపానికి వారసుడు కాడు, మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:
﴾ఎవడు సన్మార్గాన్ని అవలంబిస్తాడో, అతడు నిశ్చయంగా, తన మేలుకే సన్మార్గాన్ని అవలంబిస్తాడు. మరియు ఎవడు మార్గభ్రష్టుడవుతాడో, అతడు నిశ్చయంగా, తన నష్టానికే మార్గభ్రష్టుడవుతాడు. మరియు బరువు మోసే వాడెవ్వడూ మరొకని బరువును మోయడు. మరియు మేము ఒక ప్రవక్తను పంప నంత వరకు (ప్రజలకు) శిక్ష విధించేవారము కాము.﴿
[సూరా అల్ ఇస్రా: 88]
ఈ ప్రకటన తరువాత మేము దృఢంగా చెప్పేదేమిటంటే: వారసత్వంగా పొందిన లేదా అసలైన పాపం అనే విషయానికి అసలు ఉనికే లేదు, అది కేవలం యూదుల కల్పితంపై ఆధారపడిన ఒక మూఢనమ్మకం మాత్రమే. ఆదమ్ అలైహిస్సలాం యొక్క పాపానికి పరిహారంగా మసీహ్ అలైహిస్సలాం అవతరించడం మరియు ఆయనకు సిలువ వేయడానికి సంబంధించిన క్రైస్తవుల కల్పితం దీనిని మరింత బలోపేతం చేసింది. వాస్తవానికి ఒక కల్పితంపై ఆధారపడిన మూఢనమ్మకానికి ఎటువంటి విలువ ఉండదు, పైగా ఈ వాదన మరియు అపనిందల నుండి మేము అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటున్నాము.
తన ప్రభువుచే సంస్కరించబడి, సత్యం మరియు అసత్యాల మధ్య వ్యత్యాసం చూపే గీటురాయిని పొంది, ఆధారము మరియు వాదనపై స్థిరపడిన సత్య ధర్మంతో గౌరవించబడి, వంచనను మరియు మూఢనమ్మకాలను ద్వేషించే అల్లాహ్ ధర్మాన్ని అనుసరించే వ్యక్తి, ఈ మూఢనమ్మకానికి ఏమాత్రం ప్రాముఖ్యతనివ్వడు. మరియు అది ఒక పచ్చి అబద్ధం అని అతనికి తెలుసు, కనుక అది అతని సంస్కృతి మరియు లక్ష్యాలపై ఎటువంటి ప్రభావం చూపదు; బదులుగా అతడు దీనిని దైవ ప్రవక్తలు మరియు సందేశహరులకు (అలైహిముస్సలాతు వస్సలామ్) జరిగిన అవమానంగా భావిస్తాడు. ఎందుకంటే, మసీహ్ వారి కొరకు చేసిన ప్రాయశ్చిత్తం ద్వారా వారు పవిత్రులయ్యేంత వరకు, దైవ ప్రవక్తలు మరియు సందేశహరులందరూ (అలైహిముస్సలాతు వస్సలామ్) ఆపాదించబడిన వారసత్వ పాపంతో అపవిత్రులై ఉండేవారని దీని ఉద్దేశం. మరి మసీహ్ కాలం కంటే ముందు మరణించిన దైవ ప్రవక్తలు ఎలా పవిత్రులవుతారు??
అల్లాహ్ ధర్మాన్ని అనుసరించే బుద్ధిమంతుడు, ప్రచారంలో ఉన్న ఈ పొరపాటును సరిదిద్దడానికి మరియు దీనికి, ఇతర విషయాలకు సంబంధించిన సత్యాన్ని అసత్యం నుండి వేరుచేసి స్పష్టపరచడానికి ఆసక్తి చూపుతాడు. తనకు సరైన ధర్మాన్ని నేర్పినందుకు, మరియు తనను ప్రవక్తల, సందేశహరుల (అలైహిముస్సలాతు వస్సలామ్) అనుచరులలో ఒకరిగా చేసినందుకు అతను అల్లాహ్ను స్తుతిస్తాడు.
المصدر
ملاحظات
--