Skip to content

స్వేచ్ఛా సంకల్పం మరియు బలవంతపు విధి అనే రెండు భావనల విషయంలో ఇస్లాం ఏ స్థానం తీసుకుంటుంది?

مصدر الإجابة
قسم الإسلام
الباب / الفصل
(قسم الإسلام)

السؤال

స్వేచ్ఛా సంకల్పం మరియు బలవంతపు విధి అనే రెండు భావనల విషయంలో ఇస్లాం ఏ స్థానం తీసుకుంటుంది?

الجواب

ప్రశంసలన్నీ అల్లాహ్‌కు మాత్రమే శోభిస్తాయి, పరిశుద్ధుడైన మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఆకాశాలను మరియు భూమిని సృష్టించక ముందే అన్ని విషయాల విధిరాతలను రాసి ఉంచాడు, మరియు ప్రవక్తలను పంపాడు, మరియు గ్రంథాలను అవతరింపజేశాడు, మరియు మంచిని ప్రేమించే మరియు చెడును ద్వేషించే సహజ స్వభావంపై దాసులను సృష్టించాడు, మరియు సృష్టికి మంచి మరియు చెడులను తెలుసుకునేలా మార్గదర్శకత్వం చేశాడు, మరియు దీనికి మరియు దానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించే వివేచనను వారిలో ఉంచాడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.﴿

[అల్ బలద్: 8-10]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾నిశ్చయంగా, మేము అతనికి మార్గం చూపాము. ఇక అతడు కృతజ్ఞుడు కావచ్చు, లేదా కృతఘ్నుడూ కావచ్చు!﴿

[అల్ ఇన్సాన్: 3]

ఫిర్ఔన్ మూసా అలైహిస్సలాంను: "మీ ఇరువురి ప్రభువు ఎవరు?" అని అడిగినప్పుడు, అల్లాహ్ ఆయన గురించి తెలియజేసిన విధంగా ఆయన ఇలా పలికాడు:

﴾(మూసా) జవాబిచ్చాడు: "ప్రతి దానికి దాని రూపాన్నిచ్చి, తరువాత దానికి మార్గదర్శకత్వం చేసేవాడే మా ప్రభువు.﴿

[తాహా : 50]

కాబట్టి ప్రతీ మనిషిని అల్లాహ్ సృష్టించాడు మరియు అతనికి ప్రయోజనం ఉన్న మార్గాన్ని చూపించాడు, దీనిని ప్రతీ మనిషి తనలో తాను కనుగొంటాడు, అంతేకాదు మూగ జంతువులకు కూడా వాటికి ప్రయోజనకరమైన వాటి కొరకు అల్లాహ్ మార్గదర్శకత్వం చేశాడు, వాటి జాతిని రక్షించుకోవడానికి మరియు వాటి సంతానోత్పత్తి మరియు వృద్ధి నిరంతరం కొనసాగేలా నిర్ధారించాడు.

అల్లాహ్ సృష్టితాలపై ప్రమాణాన్ని నెలకొల్పాడు, మరియు అదృష్టవంతులను సౌలభ్యం వైపుకు సౌలభ్యపరిచాడు మరియు వారిని కష్టత నుండి దూరంగా ఉంచాడు, మరియు దురదృష్టవంతులను కష్టత వైపుకు సౌలభ్యపరిచాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾దానిని క్రమ్ముకునే, రాత్రి సాక్షిగా!

ఆకాశం మరియు దానిని నిర్మించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా!

భూమి మరియు దానిని విస్తరింపజేసిన ఆయన సాక్షిగా!

మానవ ఆత్మ మరియు దానిని తీర్చిదిద్దిన ఆయన సాక్షిగా!

ఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు.

వాస్తవానికి తన ఆత్మను శుద్ధపరచుకున్నవాడే సఫలుడవుతాడు.

మరియు వాస్తవానికి దానిని అణగ ద్రొక్కిన వాడే విఫలుడవుతాడు.﴿

[అష్షమ్స్: 4 - 10]

సహాబాలలో ఒకరు (రిజ్వానుల్లాహి అలైహిమ్) దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను పూర్వమే లిఖించబడిన విధివ్రాత పట్ల ఒక వ్యక్తి వైఖరి గురించి ఇలా అడిగారు: మేము దానిపైనే ఆధారపడి అమలు చేయడం మానేయాలా లేక అమలు చేయాలా? దానికి సమాధానం ఈ హదీసులో ఉన్నది, అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం:

మేమొక జనాజా వెంట బఖీవుల్ గర్ఖద్ శ్మశానానికి వెళ్ళాం. అంతలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అక్కడికి వచ్చి ఒకచోట కూర్చున్నారు. కాసేపటికి మేము కూడా ఆయన చుట్టూ గుమిగూడి కూర్చున్నాం. అప్పుడు ఆయన చేతిలో ఒక బెత్తం ఉంది. ఆయన తలక్రిందికి దించుకొని బెత్తంతో నేలమీద గీయసాగారు. ఆ తరువాత ఆయన ఇలా పలికారు : స్వర్గం లేదా నరకంలో వారి నివాసం అని అల్లాహ్ చేత వ్రాయబడని ఏ ప్రాణం మీ మధ్య లేదు, ప్రాణం ఉన్న ప్రతి ప్రాణి గురించి వ్రాసిపెట్టబడింది మరియు ప్రతి వ్యక్తి అతను దురదృష్టవంతుడా లేదా పుణ్యాత్ముడా అని కూడా వ్రాయబడింది. దీనిపై ఒక వ్యక్తి ఇలా అన్నాడు: ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం! అలాంటప్పుడు మేము ఆచరణను వదలిపెట్టి మా ఈ విధివ్రాతను నమ్ముకుంటే చాలుకదా? అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు : మనలో పుణ్యాత్ముడు పుణ్యకార్యాల వైపుకు తిరిగి వస్తాడు మరియు దురదృష్టవంతుడు దురదృష్ట కార్యాల వైపుకు తిరిగి వస్తాడు. ఆయన మళ్ళీ ఇలా పలికారు : మీరు కర్మలు ఆచరించండి, ప్రతి ఒక్కరికీ సౌలభ్యం కలిగించబడుతుంది. సత్పురుషులకు మంచిపనులు చేయుటకు సౌలభ్యం కలిగించబడుతుంది, దురదృష్టవంతులకు చెడ్డపనులు సులువుగా చేయటానికి సౌలభ్యం కలిగించబడుతుంది. ఆ తరువాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతులను పటించారు : ﴾కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో! మరియు మంచిని నమ్ముతాడో! మేము అతనికి సులభమైన మార్గాన్ని సుగమం చేస్తాము. మరియు ఎవడైతే పిసినారితనం చేస్తాడో మరియు నిర్లక్ష్యం వహిస్తాడో! మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో! మేము అతనికి కష్టమైన మార్గాన్ని సులభతరం చేస్తాము.﴿

[సహీహ్ ముస్లిం (170)].

పరిశుద్ధుడైన, మహోన్నతుడైన అల్లాహ్ ఎవరినీ బలవంతం చేయవలసిన అవసరం లేని నిరుపేక్షాపరుడు; ఎందుకంటే విధేయతలు ఆయనకు ప్రయోజనం చేకూర్చవు మరియు పాపాలు ఆయనకు నష్టం కలిగించలేవు. కానీ అల్లాహ్ సృష్టిని సృష్టించాడు మరియు వారికి సులభతరం చేశాడు, మరియు ఆయన బలవంతం చేయడం నుండి స్వతంత్రుడు.

మరియు సృష్టిరాసులను సృష్టించక ముందే వారు ఏమి చేస్తారో పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ కు తెలుసు. మరియు ఆయన దానిని లౌహె మహ్ఫూజ్ లో వ్రాశాడు. మరియు ఆయన ఇచ్ఛ లేకుండా ఏదీ జరగదు. మరియు జరిగేదంతా అల్లాహ్ సృష్టి, ఆయన కోరిక మరియు ఆయన పర్యాలోచన. మరియు అందులో ఆయనకు అత్యున్నతమైన వివేకం ఉంది. మరియు మానవునికి కోరిక,ఇచ్ఛ కలదు మరియు అది అల్లాహ్ ఇచ్ఛకు లోబడి ఉంటుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు.﴿

[సూరతు అత్తక్వీర్: 29]

మరియు అతను తాను ఎంపిక చేసుకున్న మరియు కోరుకున్న దానికి బాధ్యత వహిస్తాడు.

ప్రతి మనిషికి తాను తన సంకల్పం మరియు స్వయనిర్ణయంతో చేసే పనులకు, మరియు వ్యాధి మరియు పడిపోవడం వంటి తన ఇష్టానికి వ్యతిరేకంగా తనపై వాటిల్లే వాటికి మధ్య ఉన్న తేడా తెలుసు. కనుక మనిషి తాను కోరుకునే దానిని ఎంచుకుంటాడు, మరియు తాను కోరుకోని దానిని తన స్వయనిర్ణయంతో వదిలిపెడతాడు.

కాబట్టి మనిషి తన ఇచ్చ మరియు ఎంపికతో వ్యవహరిస్తాడు, దీనికే పరలోకదినాన అతడు బాధ్యత వహిస్తాడు మరియు ప్రశ్నించబడతాడు. ఇక మనిషి తాను అడ్డుకోలేని దైవ నిర్ణయం కారణంగా తనపై వాటిల్లే అనారోగ్యం లేదా విధిగా చేయవలసిన ఆచరణను నెరవేర్చటంలో అసమర్థత లాంటి వాటి గురించి పరలోకదినాన అతడు ప్రశ్నించబడడు. మన ప్రవక్త ముహమ్మద్ పై అల్లాహ్ కారుణ్యం మరియు శాంతి వర్షించుగాక.

المصدر

قسم الإسلام

ملاحظات

--