Skip to content

ఇస్లాములో సహనానికి ఉన్న రూపాలు ఏమిటి?

محاور التعريف بالإسلام
الشبهات والاعتراضات
مصدر الإجابة
قسم الإسلام
الباب / الفصل
(قسم الإسلام)

السؤال

ఇస్లాములో సహనానికి ఉన్న రూపాలు ఏమిటి?

الجواب

సమస్త ప్రశంసలు అల్లాహ్ కే, ఇస్లాంలో సహనం అనేది మానవాళి ఎరిగిన అత్యంత ఉన్నతమైన మరియు పరిపూర్ణమైన సహనం, మరియు షరియత్ లో దీనికి పర్యాయపదం సరళత్వము. ఇస్లాంలో సరళత్వము అనేక రంగాలలో వస్తుంది, వాటిలో:

ఇస్లాం ధర్మంలో ఆరాధనల విషయంలో అల్లాహ్ సౌలభ్యాన్ని కలిగించాడు, గత ధర్మాల మాదిరిగా ఇది భారాలు మరియు సంకెళ్ళతో కూడిన ధర్మం కాదు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా తెలియజేశాడు:

﴾ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్ష్యరాస్యుడైన ఈ ప్రవక్తను అనుసరిస్తారో! ఎవరి ప్రస్తావన వారి వద్ద వున్న తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో, అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు వారి నిర్భంధాలను తొలగిస్తాడు.﴿

[సూరతుల్ ఆరాఫ్: 158]

ఉదాహరణకు, పూర్వపు ధర్మాలలో నమాజు ఆచరించే వ్యక్తి కేవలం ఆరాధనా స్థలంలో మాత్రమే నమాజు ఆచరించేవాడు, కానీ ఈ ధర్మంలో ముస్లింకు నమాజు సమయం ఆసన్నమైనప్పుడు అతను గాలిలో, సముద్రంలో లేదా భూమి మీద ఏ ప్రదేశంలో ఉన్నా సరే అక్కడ నమాజు ఆచరించుటకు అనుమతించబడింది. అదేవిధంగా, పూర్వపు ధర్మాలలో అపవిత్రత కేవలం నీటి ద్వారా మాత్రమే తొలగించబడేది, అయితే అల్లాహ్ ఇస్లాంలో తయమ్ముమ్ విధానాన్ని ప్రసాదించాడు, కనుక అది ఒక కారుణ్యంగా మారింది. ఇంకా ప్రయాణంలో మరియు అనారోగ్యంతో ఉన్నప్పుడు నమాజును తక్కువ చేసి ఆచరించుట (ఖస్ర్) మరియు ఉపవాసాన్ని వదిలివేయుట (ఫితర్) కూడా అటువంటివే.

ఇస్లాం యొక్క సౌలభ్యం మరియు సహనాలలో ఒకటి ఏమిటంటే, పాపాత్ముని కొరకు తౌబా'ను అల్లాహ్ షరీఅతుబద్దమైనదిగా చేశాడు. మరియు అల్లాహ్ వారి పశ్చాత్తాపమును స్వీకరించటానికి బనీ ఇస్రాయీల్ యొక్క పశ్చాత్తాపం వారిలో కొందరు కొందరిని వధించటమే అయి ఉండింది; మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు (జ్ఞాపకం చేసుకోండి)! మూసా తన జాతివారితో ఇలా అన్న విషయాన్ని: "ఓ నా జాతి ప్రజలారా! నిశ్చయంగా, ఆవుదూడను (ఆరాధ్యదైవంగా) చేసుకొని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీ నిర్మాతను (సృష్టికర్తను) వేడుకోండి. మీలోని వారిని (ఘోరపాతకులను) సంహరించండి. ఇదే మీ కొరకు - మీ సృష్టికర్త దృష్టిలో - శ్రేష్ఠమైనది." ఆ తరువాత ఆయన (అల్లాహ్) మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు. అపార కరుణాప్రధాత. ﴿

[సూరతుల్ బఖరహ్: 129]

అయితే ఇస్లాంలో మనిషి పశ్చాత్తాప పడితే, అల్లాహ్ అతనిని మన్నిస్తాడు, మరియు అతని పాపములను పుణ్యాలుగా మార్చి వేస్తాడు, మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-

﴾మరియు ఎవరైతే, అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను ఆరాధించరో! మరియు అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడ న్యాయానికి తప్ప చంపరో! మరియు వ్యభిచారానికి పాల్పబడరో. మరియు ఈ విధంగా చేసేవాడు (అవిధేయుడిగా ప్రవర్తించేవాడు) దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు.

పునరుత్థాన దినం నాడు, అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది మరియు అతడు అందులోనే అవమానంతో శాశ్వతంగా పడి ఉంటాడు.

కాని, ఇక ఎవరైతే (తాము చేసిన పాపాలకు) పశ్చాత్తాప పడి, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చుతాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రధాత.

మరియు ఎవడైతే, పశ్చాత్తాప పడి సత్కార్యాలు చేస్తాడో! నిశ్చయంగా అలాంటి వాడు హృదయపూర్వకంగా అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలుతాడు!﴿

[సూరతుల్ ఫుర్ఖాన్: 68-71]

సౌలభ్యపు రూపాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనంలో ఈ విధంగా తెలుపబడింది:

«ఇస్లాంలో అత్యుత్తములుగా మెలిగేవారు అజ్ఞానకాలపు పనులకు బదులుగా శిక్షించబడరు, మరెవరైతే ఇస్లాంలో చెడుగా వ్యవహరిస్తాడో అతని మొదటి మరియు తరువాత పనులకు బదులుగా పట్టుకోబడతాడు.»

[ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (2620) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1003) లో ఉల్లేఖించారు].

హదీసులో 'ఇసాఆ' (చెడు చేయడం) అంటే మతభ్రష్టత్వం, పాపాన్ని మళ్ళీ చేయడం కాదు. ఒక వేళ అతను ఇస్లాం నుండి మతభ్రష్టుడైతే మొదటి మరియు చివరి పాపాలకు పట్టుబడతాడు, ఇక ఒకవేళ మతభ్రష్టత్వానికి కాకుండా పాపానికి మళ్ళీ పాల్పడితే; అతను ఇస్లాంలో చేసిన దానికి మాత్రమే పట్టుబడతాడు, అంతకు ముందు చేసిన దానికి కాదు; దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ప్రకారం:

"ఇస్లాం వెనుకటి పాపాలను తుడిచివేస్తుందన్న విషయం నీకు తెలియదా?"

[దీన్ని ముస్లిం ఉల్లేఖించారు].

ఇస్లాం యొక్క సౌలభ్యతలలో ఒకటి ఏమిటంటే, ఇది సౌలభ్యతను కలిగి యున్న ధర్మము, అందులో ఎలాంటి సంకెళ్ళు మరియు భారాలు లేవు, అందుకే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

"నిశ్చయంగా ధర్మము సులభమైనది’ ఎవరైతే దాని పట్ల కఠినంగా వ్యవహరిస్తారో అది వారి పై పైచేయి సాధిస్తుంది (అతన్ని అలసటకు గురిచేస్తుంది) కాబట్టి ఋజుమార్గాన్ని అవలంభించండి, ధర్మానికి దగ్గరగా ఉండండి, ప్రజలకు శుభవార్తలను అందించండి, అలాగే ఉదయం సాయంత్రం మరియు రాత్రుల్లో ఆరాధన ద్వారా సహాయాన్ని పొందండి."

[సహీహ్ బుఖారి (3445)].

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఆజ్ మరియు అబూ మూసా అల్-అష్అరీ రదియల్లాహు అన్హుమా'ను యమన్ వైపుకు పంపించినప్పుడు వారికి ఇలా ఉపదేశించారు:-

“(ప్రజల కొరకు) విషయాలను తేలిక చేయండి, కష్టతరం చేయకండి; ప్రజలకు శుభవార్తలు వినిపించండి, వారిని దూరం చేయకండి; పరస్పరం సహకరించుకోండి, విభేదించకండి”.

[సహీహ్ బుఖారీ (2476) మరియు ముస్లిం (155)].

ఇస్లాం యొక్క సులభతరం మరియు సహనంలో భాగంగా, తల్లిదండ్రులు అవిశ్వాసులు అయినప్పటికీ, ఇంకా ఇస్లాం నుండి అతనిని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, సంతానం వారితో మంచి ప్రవర్తన చేయాలని ఇస్లాం ఉపదేశించింది. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిస్తున్నాడు:

﴾మరియు ఒకవేళ వారిరువురు - నీవు ఎరగని దానిని - నాకు (అల్లాహ్ కు) భాగస్వామిగా చేర్చమని, నిన్ను బలవంతం చేస్తే, వారి మాటను నీవు ఏ మాత్రం వినకు. మరియు ఇహలోక విషయాలలో ధర్మసమ్మతమైన వాటిలో వారికి తోడుగా ఉండు. మరియు పశ్చాత్తాపంతో నా వైపుకు మరలేవాని మార్గాన్ని అనుసరించు. తరువాత మీరంతా నా వైపునకే మరలి రావలసి ఉన్నది. అప్పుడు నేను మీరు చేసే కర్మలను గురించి మీకు తెలుపుతాను.﴿

[సూరతు లుఖ్మాన్:15]

అస్మా బింతె అబూ బకర్ రజియల్లాహు అన్హుమా తల్లి ఆమెను కలవడానికి వచ్చినప్పుడు, ఆమెతో బంధాన్ని కొనసాగించడం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి కోరుతూ ఆమె ఇలా తెలిపారు: "దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురైష్‌తో ఒప్పందం కుదుర్చుకున్న రోజుల్లో ఒకసారి నా వద్దకి బహుదైవారాధకురాలైన నా తల్లి తన తండ్రితో కలిసి వచ్చింది." అప్పుడు ఆమె ఈ విషయం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ప్రస్తావిస్తూ ఇలా అడిగారు: “దైవప్రవక్తా! మా అమ్మ నా దగ్గరికి వచ్చి ఉంది. ఆమె నా నుండి సద్వర్తనను ఆశిస్తోంది. మరి నేను మా అమ్మ పట్ల మంచిగా మెలగవచ్చా?” అందుకాయన ఇలా అన్నారు:

«అవును, ఆమెతో సత్సంబంధాలు నెరపండి»

సహీహ్ బుఖారీ (3), మరియు సహీహ్ ముస్లిం (252).

అదేవిధంగా, భర్త తన యూద లేదా క్రైస్తవ భార్యతో సత్ప్రవర్తనతో వ్యవహరించాలని, ఆమె మతం కారణంగా ఆమెను ఇబ్బంది పెట్టకూడదని, నిందించకూడదని లేదా చిన్నచూపు చూడకూడదని హితబోధ చేయబడింది.

ఇస్లాం యొక్క సౌలభ్యం మరియు ఉదారత ఏమిటంటే, ధర్మం విషయంలో పోరాడని ముస్లిమేతరులతో ఉత్తమంగా సహకరించుకోవాలని అది ఒక ముస్లిముకు హితబోధ చేసింది, మరియు వారితో న్యాయం చేయటాన్ని అతనిపై విధిగా చేసింది, మరియు వారితో సద్వ్యవహారం చేయాలని అతన్ని ప్రోత్సహించింది. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-

﴾ఎవరైతే ధర్మవిషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో! వారి పట్ల మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్ నిషేధించలేదు. నిశ్చయంగా, అల్లాహ్ న్యాయవర్తనులను ప్రేమిస్తాడు.﴿

[సూరతుల్ ముమ్తహినహ్: 8]

అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.

المصدر

قسم الإسلام

ملاحظات

--