Skip to content

ఇస్లాం వర్గ వ్యవస్థ (కులవ్యవస్థ) అనే భావనను సమర్థిస్తుందా?

محاور التعريف بالإسلام
الشبهات والاعتراضات
مصدر الإجابة
قسم الإسلام
الباب / الفصل
(قسم الإسلام)

السؤال

ఇస్లాం వర్గ వ్యవస్థ (కులవ్యవస్థ) అనే భావనను సమర్థిస్తుందా?

الجواب

సర్వ స్తోత్రాలు అల్లాహ్ కొరకే ప్రత్యేకము. వర్గవ్యవస్థ అంటే ధనం, వంశం లేదా పదవి ఆధారంగా ప్రజలను వర్గాలుగా విభజించడం. అలా విభజించిన తరువాత మనిషి తన వర్గాన్ని మార్చుకోలేడనే భావన. ఇస్లాం దృష్టిలో వర్గవ్యవస్థ అనేది అజ్ఞాన యుగం (జాహిలియ్యత్) యొక్క ప్రభావాలలో ఒకటి.

మరియు ఇస్లాం ముస్లింలలో వర్గభేదాల ఉనికిని నిషేధిస్తుంది; ఎందుకంటే అల్లాహ్ ప్రజలను ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి సృష్టించాడు, అది మనం ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికే గానీ, మనలో ఒకరిపై మరొకరు దౌర్జన్యం చేయడానికి కాదు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-

﴾ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము. మరియు మీరు ఒకరి నొకరు గుర్తించుకోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు.﴿

[సూరతుల్ హుజురాత్:13]

మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు, వంశం కేవలం వంశం కారణంగా మనిషికి ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వదు, బదులుగా అతని ఆచరణ మరియు ప్రజల ప్రయోజనం కొరకు అతను చేసిన మేలు మాత్రమే అతనికి ప్రాధాన్యతను ఇస్తాయి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

«ఎవరి ఆచరణ అతన్ని వెనక్కి వదిలేస్తుందో, అతని వంశం అతన్ని ముందుకు పంపదు»

[సహీహ్ ముస్లిం (170)].

ఇక సృష్టితాల మధ్య ధనము, ఉన్నత స్థానము మరియు ఇతర కారణాల వలన వ్యత్యాసం ఉండటం అనేది స్వతహాగా ప్రశంసించబడదు మరియు నిందించబడదు. అయితే మానవుడు తనకు అల్లాహ్ ప్రసాదించిన గౌరవము, పదవి మరియు ధనమును అల్లాహ్ కు విధేయత చూపడానికి మరియు ప్రజలకు సేవ చేయడానికి వినియోగిస్తే అది ప్రశంసించబడుతుంది. ఒకవేళ దాని కారణంగా అతడు తన ప్రభువుకు అవిధేయత చూపితే, ప్రజలపై అహంకారం ప్రదర్శిస్తే, వారిపై దౌర్జన్యం చేస్తే మరియు వారికి అన్యాయం చేస్తే అది నిందించబడుతుంది. అలా కాని పక్షంలో, ప్రాపంచిక విషయాలలో ప్రజల మధ్య వ్యత్యాసం అనేది భూమిని అభివృద్ధి చేయడానికి అల్లాహ్ ఉద్దేశించిన ఒక సృష్టి ధర్మం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾నీ ప్రభువు కారుణ్యాన్ని పంచి పెట్టే వారు వారేనా ఏమిటి? మేమే వారి జీవనోపాయాలను, ఈ ప్రాపంచిక జీవితంలో వారి మధ్య పంచి పెట్టాము. వారు ఒకరితో నొకరు పని తీసుకోవటానికి, వారిలో కొందరికి మరి కొందరిపై స్థానాలను పెంచాము. మరియు వారు కూడబెట్టే దాని (సంపద) కంటే నీ ప్రభువు కారుణ్యమే ఎంతో ఉత్తమమైనది.

మరియు మానవులందరూ ఒక (దుష్ట) సమాజంగా మారి పోతారన్న భయమే గనక మాకు లేకున్నట్లయితే, మేము ఆ కరుణామయుణ్ణి తిరస్కరించేవారి ఇళ్ళ కప్పులనూ మరియు వాటి పైకి ఎక్కే మెట్లను వెండితో నిర్మించేవారము.

మరియు వారి ఇండ్ల తలుపులను మరియు వారు ఆనుకొని కూర్చునే పీఠాలను కూడా;

మరియు బంగారంతో కూడా! మరియు ఇవన్నీ ప్రాపంచిక జీవిత సుఖసంతోషాలు మాత్రమే. మరియు దైవభీతి గలవారికి నీ ప్రభువు వద్ద పరలోక జీవిత (సుఖం) ఉంటుంది.﴿

[సూరతుల్ జుఖ్'రుఫ్: 61]

ప్రాపంచిక సదుపాయాలలోని ఈ వ్యత్యాసం ఆయన ఏర్పాటు అని అల్లాహ్ వివరించాడు, షైఖ్ అబ్దుర్రహ్మాన్ స'అది' రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు:-

మహోన్నతుడైన అల్లాహ్ తెలియజేస్తున్నాడు: ఆయన దృష్టిలో ఈ ఇహలోక జీవితానికి ఎటువంటి విలువా లేదు. ఆయన తన దాసుల పట్ల చూపే దయ, కరుణలు గనక లేకపోయి ఉంటే (వాటికంటే ఆయన దేనినీ ముందు ఉంచడు), సత్యతిరస్కారులకు ఆయన ఈ ఇహలోక జీవితాన్ని గొప్పగా విస్తరించి ఉండేవాడు. మరియు ﴿...వారి ఇండ్లకు వెండి పైకప్పులను మరియు మెట్లను...﴾ అనగా: ఎక్కడానికి వెండి మెట్లను చేసి ఉండేవాడు, ﴿...వాటి ద్వారా వారు పైకి ఎక్కేవారు.٣٣﴾ అనగా: తమ డాబాలపైకి ఎక్కేవారు. అనగా: వారి ఇహలోక జీవితాన్ని రకరకాల అలంకరణలతో మనోహరంగా చేసేవాడు, మరియు వారు కోరుకున్నదంతా వారికి ప్రసాదించేవాడు. కానీ ప్రాపంచిక జీవితంపై ఉన్న ప్రేమ కారణంగా వారు అవిశ్వాసం వైపు వేగంగా వెళతారని, మరియు పాపాలు ఎక్కువగా చేస్తారని భయపడి, తన దాసుల పట్ల ఆయనకున్న కరుణ ఆయనను ఆ పని చేయకుండా నివారించింది. కాబట్టి అల్లాహ్ తన దాసుల ప్రయోజనాల కొరకే ఇహలోక విషయాలలో కొన్నింటిని సాధారణంగా లేదా ప్రత్యేకంగా నిరోధిస్తాడనడానికి ఇందులో ఒక సాక్ష్యం ఉంది. అల్లాహ్ దృష్టిలో ఈ ప్రపంచం ఒక దోమ రెక్క అంత బరువు కూడా తూగదు. మరియు పైన పేర్కొనబడినవన్నీ ఇహలోక జీవిత తాత్కాలిక సుఖసంతోషాలు మాత్రమే. అవి దుఃఖపూరితమైనవి, కలుషితమైనవి మరియు నశించిపోయేవి. మరి తమ ప్రభువు ఆజ్ఞలను పాటించి, ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉంటూ భయభక్తులు గలవారి కొరకు మహోన్నతుడైన అల్లాహ్ వద్ద పరలోకం ఎంతో ఉత్తమమైనది. ఎందుకంటే అందులోని అనుగ్రహాలు అన్ని విధాలుగా సంపూర్ణమైనవి మరియు పరిపూర్ణమైనవి. స్వర్గంలో మనస్సులు కోరుకునేవి మరియు కళ్ళకు ఆనందాన్ని ఇచ్చేవి అన్నీ ఉన్నాయి, మరియు వారు అందులో శాశ్వతంగా ఉంటారు. కాబట్టి ఈ రెండు నివాసాల మధ్య ఎంత గొప్ప వ్యత్యాసం ఉందో కదా!

తఫ్సీర్ అస్సఅదీ, తైసీరుల్-కరీమ్ అర్-రహ్మాన్ (సాద్: 765).

కాబట్టి ఇస్లాం, ఉదాహరణకు ప్రజలందరినీ ధనికులుగా లేదా పేదవారుగా మార్చటం ద్వారా వారిలోని ధనిక మరియు పేద విభజనను రద్దు చేయడానికి ప్రయత్నించదు. కానీ పేదవారిని ఆదుకోవటాన్ని ధనికులకు ధర్మబద్ధం చేసింది. ఇక మానవుల మధ్య ఉండే సాధారణ మరియు సహజమైన వ్యత్యాసాలను ఎదిరించటం, వాటిని తొలగించడానికి ప్రయత్నించటం అనేది సృష్టి నియమాలకు విరుద్ధం. అందువల్ల ఇస్లాం వాటి పట్ల సరైన విధానంతో వ్యవహరించటానికి వచ్చింది. మరియు మన ప్రవక్త ముహమ్మద్ పై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు కలుగుగాక.

المصدر

قسم الإسلام

ملاحظات

--