ఇస్లాంను స్వీకరించిన వెంటనే నేను నమాజు చేయాలా?
- محاور التعريف بالإسلام
- محاسن الإسلاممحاسن العبادة
- مصدر الإجابة
- قسم الإسلام
- الباب / الفصل
- (قسم الإسلام)
السؤال
ఇస్లాంను స్వీకరించిన వెంటనే నేను నమాజు చేయాలా?
الجواب
అవును, ఇస్లాంలో ప్రవేశించినప్పుడు నమాజు నిర్వర్తించడం ఒక ముస్లింపై తప్పనిసరి, ఎందుకంటే నమాజు ఇస్లాం యొక్క మూలస్తంభాలలో రెండవది. మరియు అది ప్రవక్తలు మరియు సందేశహరులందరిపై (వారిపై శాంతి కలుగుగాక), మరియు ప్రళయదినం వరకు వారి అనుచరులపై అల్లాహ్ విధించిన ఆవశ్యక విధి. మరియు ఒక ముస్లిం ఇస్లాంలో ప్రవేశించినప్పుడు ఐదు పూటల నమాజును వాటి నిర్ణీత సమయాల్లో నిర్వర్తించడం తప్పనిసరి; ఎందుకంటే నమాజు విశ్వాసపరులపై నిర్ణీత సమయాల్లో నిర్వర్తించవలసిన ఆవశ్యక విధి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾నిశ్చయంగా, నమాజ్ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించడానికి విధిగా నియమించబడింది.﴿
[సూరతు నిసా: 163],
మరియు మూసా అలైహిస్సలాంతో ఆయన ప్రభువు సంభాషించినప్పుడు అల్లాహ్ ఆయనకు ఆదేశించిన రెండవ ఆదేశం నమాజు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-
﴾అతను దాని దగ్గరకు చేరినప్పుడు ఇలా పిలువబడ్డాడు: "ఓ మూసా!
నిశ్చయంగా, నేనే నీ ప్రభువును, కావున నీవు నీ చెప్పులను విడువు. వాస్తవానికి, నీవు పవిత్రమైన తువా లోయలో ఉన్నావు.
మరియు నేను నిన్ను (ప్రవక్తగా) ఎన్నుకున్నాను. నేను నీపై అవతరింపజేసే దివ్యజ్ఞానాన్ని (వహీని) జాగ్రత్తగా విను.
నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజ్ ను స్థాపించు.﴿
[సూరతు తాహా : 11-14]. మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు మేము మూసాకు మరియు అతని సోదరునికి ఇలా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "మీరు, మీ జాతివారి కొరకు ఈజిప్టులో గృహాలను సమకూర్చుకోండి. మరియు మీ గృహాలను, ప్రార్థనా స్థలాలుగా చేసుకొని నమాజ్ లను స్థాపించండి. మరియు విశ్వాసులకు శుభవార్తలు ఇవ్వు.﴿
[సూరతు యూనుస్: 68]
నమాజుకు గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే అది మానవునికి సన్మార్గంలో స్థిరంగా ఉండటానికి మరియు అసహ్యకరమైన పనుల నుండి, పాపాల నుండి దూరంగా ఉండటానికి సహాయం చేస్తుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
(ఓ ప్రవక్తా!) నీపై దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేయబడిన గ్రంథాన్ని చదివి వినిపించు మరియు నమాజ్ ను స్థాపించు. నిశ్చయంగా, నమాజ్ అసహ్యకరమైన పనుల నుండి మరియు అధర్మమైన పనుల నుండి వారిస్తుంది. మరియు అల్లాహ్ ధ్యానమే (అన్నిటి కంటే) గొప్పది. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
[సూరతుల్ అన్'కబూత్: 48]
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
المصدر
ملاحظات
--