అల్లాహ్ ప్రవక్తపై దివ్యఖుర్ఆన్ ను ఎందుకు అవతరింపజేశాడు? మరియు దీని అర్థం తౌరాత్ మరియు ఇంజీలు రెండింటినీ రద్దుపరచడమేనా? మరియు తౌరాత్ మరియు ఇంజీలును అనుసరించేవారు అల్లాహ్ తరపు నుండి సన్మార్గంలో లేరని దీని అర్థమా, అందుకే అల్లాహ్ దివ్యఖుర్ఆన్ ను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేశాడా?
- محاور التعريف بالإسلام
- التعريف بمحمد صلى الله عليه وسلمالتعريف بالنبي محمد صلى الله عليه وسلمالتعريف بالقرآن الكريم
- مصدر الإجابة
- قسم القرآن والكتب السابقة
- الباب / الفصل
- (قسم القرآن والكتب السابقة)
السؤال
అల్లాహ్ ప్రవక్తపై దివ్యఖుర్ఆన్ ను ఎందుకు అవతరింపజేశాడు? మరియు దీని అర్థం తౌరాత్ మరియు ఇంజీలు రెండింటినీ రద్దుపరచడమేనా? మరియు తౌరాత్ మరియు ఇంజీలును అనుసరించేవారు అల్లాహ్ తరపు నుండి సన్మార్గంలో లేరని దీని అర్థమా, అందుకే అల్లాహ్ దివ్యఖుర్ఆన్ ను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేశాడా?
الجواب
ప్రశ్నించే వారికి ఇలా చెప్పబడుతుంది: దానికి ముందు ఇబ్రాహీం అలైహిస్సలాం పత్రాలు ఉన్నప్పటికీ, అల్లాహ్ తౌరాత్ ను ఎందుకు అవతరింపజేశాడు? మరియు దానికి ముందు తౌరాత్ ఉన్నప్పటికీ, అల్లాహ్ ఇంజీలును ఎందుకు అవతరింపజేశాడు? దానికి సమాధానం ఒక్కటే, అదేమిటంటే అల్లాహ్ ప్రతి కాలంలో ఆ కాలపు ప్రజలకు తగిన దానిని నిర్ణయిస్తాడు. ఇక విశ్వాస మూలాల విషయానికొస్తే, సందేశహరులందరిలో అవి సమానంగా ఉంటాయి, వారందరూ ఏకైక మహోన్నతుడైన అల్లాహ్ ఆరాధన వైపుకు మరియు తాగూత్ (అసత్య దైవాల) తిరస్కరణ వైపుకు పిలుపునిచ్చారు. అల్లాహ్ తౌరాత్ మరియు ఇంజీలు పరిరక్షణ బాధ్యత బనీ ఇస్రాయీల్ పండితులకు అప్పగించాడు, కావున వారు వాటిలో మార్పులు, చేర్పులు చేశారు. మహోన్నతుడైన అల్లాహ్ అంతిమ కాలంలో ఒక సందేశహరుడిని పంపుతాడని మరియు ఆయనతో సందేశహరుల పరంపరకు ముగింపు పలుకుతాడని, ఆయనే ప్రవక్త ముహమ్మద్ ﷺ అని వారి జ్ఞానంలో ఉండేది. కావున మహోన్నతుడైన అల్లాహ్ మునుపటి దైవిక నియమాలను రద్దు చేసే గ్రంథాన్ని ఆయనపై అవతరింపజేశాడు, అది ప్రళయం సంభవించే వరకు ప్రతి కాలానికి మరియు ప్రతి స్థలానికి తగినది. మరియు ఈసా అలైహిస్సలాం అంతిమ కాలంలో దిగివచ్చినప్పుడు దీని ప్రకారమే నిర్ణయాలు చేస్తారు. మరియు మహోన్నతుడైన అల్లాహ్ స్వయంగా అనేక కారణాల ద్వారా దీని పరిరక్షణ బాధ్యత తీసుకున్నాడు. కావున కొందరు వ్యక్తులు దానిలో మార్పులు చేయడానికి ఎంత ప్రయత్నించినా వారి వ్యవహారం బహిర్గతమవుతుంది. దీని ఆధారంగా, ఇస్లాంను పొంది కూడా దానిలో ప్రవేశించని ప్రతి యూదుడు లేదా క్రైస్తవుడు సన్మార్గంలో లేనట్లే. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
﴾గ్రంధ ప్రజలలోని పలువురు - వారి మనస్సులలో ఉన్న అసూయ వల్ల - సత్యం వారికి సుస్పష్టం అయినప్పటికీ, మీరు విశ్వసించిన తరువాత, మిమ్మల్ని ఏదో ఒక విధంగా, దాని (విశ్వాస మార్గం) నుండి మరల్చి మళ్ళీ సత్యతిరస్కారం వైపునకు తీసుకు పోదామని కోరుతుంటారు. అయితే (వారి పట్ల) అల్లాహ్ తన ఆదేశం ఇచ్చేవరకు, మీరు (వారిని) మన్నించండి, ఉపేక్షించండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.﴿
[సూరతుల్ బఖరహ్: 129]
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
“ఎవరి చేతిలోనైతే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా, ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదుల జాతి గాని, మరియు క్రైస్తవుల జాతి గానీ ఎవరైతే నా గురించి విని కూడా నేను ఏ సందేశముతో అయితే పంపబడినానో దానిని విశ్వసించకుండానే చనిపోతాడో, అతడు తప్పకుండా నరకవాసులలో ఒకడు అవుతాడు.”
[దీన్ని ముస్లిం ఉల్లేఖించారు].
మరియు ఈ సమాజము అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాజం, అనగా: ఆయన ఎవరికైతే పంపబడ్డాడో వారు, మరియు దీనిని ఆహ్వానించబడిన సమాజం అని పిలుస్తారు. మరియు వారిలో ఆయనను విశ్వసించిన వారిని ఆహ్వానాన్ని స్వీకరించిన సమాజం అని పిలుస్తారు. దీని ఆధారంగా ఆ కాలంలో యూదుడైనా లేదా క్రైస్తవుడైనా, తౌరాత్ మరియు ఇంజీల్ లను అవి ఎలా అవతరించాయో అలాగే విశ్వసించి, ఎటువంటి మార్పులు మరియు వక్రీకరణలు చేయనివాడై ఉండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపబడక మునుపు మరణిస్తే, అతను సన్మార్గముపై ఉన్నాడు. మరియు ఇస్లాం సందేశం చేరిన తరువాత కూడా ఇస్లాం స్వీకరించని ప్రతి ఒక్కరూ మార్గభ్రష్టత్వంలో ఉన్నారు.
المصدر
ملاحظات
--