ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ను రచించారని మరియు దానిని ఇంజీల్ (కొత్త నిబంధన - Gospel) నుండి నకలు చేశారని అనడం సరైనదేనా?
- محاور التعريف بالإسلام
- التعريف بمحمد صلى الله عليه وسلمالتعريف بالنبي محمد صلى الله عليه وسلمالتعريف بالقرآن الكريمالشبهات والاعتراضاتشبهات حول القرآن
- مصدر الإجابة
- قسم القرآن والكتب السابقة
- الباب / الفصل
- (قسم القرآن والكتب السابقة)
السؤال
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ను రచించారని మరియు దానిని ఇంజీల్ (కొత్త నిబంధన - Gospel) నుండి నకలు చేశారని అనడం సరైనదేనా?
الجواب
ఈ ప్రశ్నకు సమాధానంగా మేము ఇలా అంటున్నాము:
మొదటిది: ఈ ప్రశ్న అడిగిన వ్యక్తికి ఖుర్ఆన్ గురించి తెలియదు మరియు ఇంజీల్ గురించి తెలియదు, ఎందుకంటే ఖుర్ఆన్, ఇంజీల్ కు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మరియు ఇంజీల్ అనేది ఒకే ఒక ఇంజీల్ కాదు, బదులుగా అవి అనేక సువార్తలు. ప్రవక్త ముహమ్మద్ ﷺ మార్కు లేదా లూకా లేదా మత్తయి లేదా యోహానుల నుండి, లేదా పౌలు పత్రికల నుండి లేదా యాకోబు పత్రికల నుండి గ్రహించారని ప్రశ్నించే వ్యక్తి ఉద్దేశ్యమా?
రెండవది: సువార్తలు(ఇంజీల్ లు) చాలా విషయాలలో తమలో తాము పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. వాటిలో ఒకటి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని స్థిరపరచడానికి యోహాను సువార్త వచ్చింది — వారు చెప్పేదానికి అల్లాహ్ ఎంతో అతీతుడు మరియు మహోన్నతుడు — అయితే మిగిలిన మూడు సువార్తలు కుమారుడనే విషయాన్ని స్పష్టంగా పేర్కొనలేదు. అలాగే, శిలువ వేసే విషయంలో కూడా అవి భయంకరమైన వైరుధ్యాలను కలిగి ఉన్నాయి. అలాంటప్పుడు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ సువార్త నుండి గ్రహించారు?
మూడవది :- యూదులు మరియు క్రైస్తవులు భిన్నంగా విశ్వసించే కొన్ని సమస్యలను మహత్తర ఖుర్ఆన్ సరిదిద్దింది, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-
﴾నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ ఇస్రాయీల్ సంతతి వారు విభేదిస్తూ వున్న పెక్కు విషయాల వాస్తవాన్ని వారికి తెలుపుతున్నది.﴿
[సూరతు అన్నమల్: 76]
ఈ విషయాలలో నుంచి సత్యవంతురాలైన మహిళకు ఆపాదించబడిన నిందల నుండి ఆమె పవిత్రత కూడా ఉంది, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మర్యమ్ కుమారుడు మసీహ్ (క్రీస్తు) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అతనికి పూర్వం కూడా అనేక ప్రవక్తలు గతించారు. మరియు అతని తల్లి సత్యవతి (సిద్ధీఖహ్). వారిద్దరూ ఆహారం తినేవారు. చూడండి! మేము వారికి ఈ సూచనలను ఏ విధంగా స్పష్టపరిచామో! అయినా చూడండి! ఏ విధంగా వారు మోసగింపబడుతున్నారో (సత్యం నుండి మరలింపబడుతున్నారో)!﴿
[సూరతుల్ మాయిద : 44వ ఆయతు]
అదేవిధంగా అంతిమ కాలంలో మసీహ్ అలైహిస్సలాం దిగిరావడం అనే విషయానికి వస్తే, దాసులను విచారించడానికి ఆయన అల్లాహ్ కుమారుని హోదాలో దిగి వస్తారని క్రైస్తవులు విశ్వసిస్తారు. కానీ ఆయన ఒక మానవుడు మరియు సందేశహరుడు అని, ఆయన ప్రళయ ఘడియను సూచించే చిహ్నాలలో ఒకటిగా దిగివస్తారని ఖుర్ఆన్ రుజువు చేసింది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
﴾మరియు నిశ్చయంగా, అతని (ఈసా పునరాగమనం) అంతిమ ఘడియ రావటానికి సూచన. కావున మీరు దానిని (ఆ ఘడియను) గురించి సంశయంలో పడకండి. మరియు నన్నే (అల్లాహ్ నే) అనుసరించండి, ఇదే ఋజుమార్గం.﴿
[సూరతుల్ జుఖ్'రుఫ్: 61]
నాల్గవది: మసీహ్ అలైహిస్సలాం మరియు ఆయన తల్లి అలైహస్సలాం గురించి క్రైస్తవులకు తెలియని విషయాలను గొప్పదైన ఖురాన్ పేర్కొన్నది. వాటిలో పుట్టిన తరువాత మసీహ్ మాట్లాడటం మరియు ఆకాశం నుండి ఆహార పళ్ళెము అవతరించటం (దిగిరావటం) ఉన్నాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾దానికి మర్యమ్ కుమారుడు ఈసా (ఏసు): "ఓ అల్లాహ్! మా ప్రభూ! ఆకాశం నుండి ఆహారంతో నిండిన ఒక పళ్ళాన్ని మా కొరకు అవతరింపజేయి (దింపు); అది మాకు మొదటివాని నుండి చివరివాని వరకు పండుగగా ఉండాలి; అది నీ తరపు నుండి ఒక సూచనగా ఉండాలి. మాకు ఆహారాన్ని ప్రసాదించు. నీవే అత్యుత్తమమైన ఉపాధి ప్రదాతవు!" అని ప్రార్థించాడు.﴿
ఐదవది: మహత్తర ఖుర్ఆన్ సువార్తలలో (అనాజీల్ లో) ఉన్న పొరపాట్ల నుండి సురక్షితంగా ఉంది, మరియు ఇంజీల్ లో ఉన్న అనేక పరస్పర విరుద్ధ విషయాల నుండి సురక్షితంగా ఉంది.
ఆరవది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చదవడం మరియు వ్రాయడం ఎలాగో తెలియదు, మరియు మహత్తరమైన ఖుర్ఆన్ లో దీని ప్రస్తావన వచ్చింది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
﴾మరియు (ఓ ముహమ్మద్!) ఇంతకు పూర్వం నీవు ఏ గ్రంథాన్ని కూడా చదువ గలిగే వాడవు కావు మరియు దేనిని కూడా నీ కుడిచేతితో వ్రాయగలిగే వాడవూ కావు. అలా జరిగి వుంటే ఈ అసత్యవాదులు తప్పక అనుమానానికి గురి అయి ఉండేవారు.﴿
[సూరతుల్ అన్'కబూత్: 48]
మరియు ఆయన సమాజం నిరక్షరాస్యులు, వారిలో చదవడం ప్రాచుర్యంలో లేదు, మరియు మక్కాలో గ్రంథ ప్రజల (అహ్లె కితాబ్) గ్రంథాలు వాడుకలో లేవు, మరియు గ్రంథ ప్రజల వద్ద ఉన్నవాటి గురించి వారికి జ్ఞానం లేదు.
ఈ వివరణ తరువాత, ఏ నిష్పక్షపాతమైన వ్యక్తి అయినా ఇలా అనగలడా: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ను ఇంజీల్ నుండి వ్రాశారని మరియు దాని నుండే నకలు చేశారని. మరియు ఒక నిష్పక్షపాతమైన వ్యక్తి మేము సమాధానంగా వ్రాసిన దాన్ని చదివినప్పుడు, ప్రశ్నించిన ఆ వ్యక్తికి గొప్ప ఖుర్ఆన్ గురించి గానీ లేదా ఇంజీల్ గురించి గానీ ఏమీ తెలియదని అతను ఖచ్చితంగా తీర్పునిస్తాడని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము.
ఇంజీల్ లో పవిత్ర ఖుర్ఆన్ కు అనుగుణంగా ఉండే విషయాలు, మసీహ్ అలైహిస్సలాం తీసుకువచ్చిన సత్యం యొక్క అవశేషాలు. ఉదాహరణకు, కేవలం అల్లాహ్ ఒక్కడినే ఆరాధించమని పిలవడం వంటివి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పవిత్ర ఖుర్ఆన్ పై వివాదాలు సృష్టిస్తూ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం పవిత్ర ఖుర్ఆన్ ను ఇంజీల్ నుండి నకలు (కాపీ) చేశారని క్రైస్తవులను భ్రమపెట్టేవారు ఒక వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. అదేమిటంటే, ఇంజీల్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం రాకను స్పష్టంగా పేర్కొంది, ఆయన శుభవార్తను తెలియజేసింది మరియు ఆయన పంపబడినప్పుడు ఆయనను విశ్వసించాలని తన అనుచరులకు ఆదేశించింది. కానీ వారు వీటిని ప్రస్తావించరు; పైగా వాటిని దాచిపెట్టడానికి మరియు వక్రీకరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
المصدر
ملاحظات
--