Skip to content

అన్ని మతాలు ఒకే గమ్యానికి దారితీస్తాయని ముస్లింలు విశ్వసిస్తారా?

محاور التعريف بالإسلام
الشبهات والاعتراضات
مصدر الإجابة
قسم الأديان والفرق
الباب / الفصل
(قسم الأديان والفرق)

السؤال

అన్ని మతాలు ఒకే గమ్యానికి దారితీస్తాయని ముస్లింలు విశ్వసిస్తారా?

الجواب

అల్లాహ్ తన దాసుల కోసం శాసనంగా ఆజ్ఞాపించి, దానిని తమ అనుచరులకు చేరవేయమని తన సందేశహరులందరికీ (అలైహిమ్ సలామ్) బాధ్యతగా అప్పగించిన ధర్మమే ఇస్లాం. కావున ప్రవక్తలందరూ ఇస్లాం ధర్మాన్నే పాటించారు. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-

﴾ఆయన, నూహ్ కు విధించిన (ఇస్లాం) ధర్మాన్నే, మీ కొరకు శాసించాడు; మరియు దానినే (ఓ ముహమ్మద్!) మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము; మరియు మేము దానినే ఇబ్రాహీమ్, మూసా మరియు ఈసాలకు కూడా విధిగా చేశాము. ఈ ధర్మాన్నే స్థాపించాలని మరియు దానిని గురించి భేదాభిప్రాయాలకు గురి కాకుండా ఉండాలని. నీవు దాని వైపునకు పిలిచేది బహుదైవారాధకులకు ఎంతో సహింపలేనిదిగా ఉంది. అల్లాహ్ తాను కోరిన వానిని తన వైపునకు ఆకర్షిస్తాడు మరియు పశ్చాత్తాపంతో తన వైపునకు మరలేవానికి మార్గదర్శకత్వం చేస్తాడు.﴿

[సూరతు షూరా: 13]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు ఇబ్రాహీమ్ తన సంతానాన్ని దీనిలోనే (ఈ ఇస్లాం మార్గంలోనే) నడవండని బోధించాడు. మరియు యఅఖూబ్ కూడా (తన సంతానంతో అన్నాడు): " నా బిడ్డలారా! నిశ్చయంగా, అల్లాహ్ మీ కొరకు ఈ ధర్మాన్నే నియమించి ఉన్నాడు. కావున మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) కాకుండా మరణించకండి!".﴿

[సూరతుల్ బఖరహ్: 129]

﴾ఏమీ? యఅఖూబ్ కు మరణం సమీపించినప్పుడు, మీరు అక్కడ ఉన్నారా?" అప్పుడతను తన కుమారులతో: "నా తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు?" అని అడిగినప్పుడు. వారన్నారు: "నీ ఆరాధ్యదైవం మరియు నీ పూర్వీకులగు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్ మరియు ఇస్హాఖ్ ల ఆరాధ్యదైవమైన ఆ ఏకైక దేవుణ్ణి (అల్లాహ్ నే) మేము ఆరాధిస్తాము మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉంటాము.﴿

﴾(ఓ ముస్లింలారా!) మీరు ఇలా అనండి: "మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన సందేశాలను మరియు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ మరియు అతని సంతతి వారికి ఇవ్వబడిన వాటినీ మరియు మూసా, 'ఈసా మరియు ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభువు తరఫు నుండి ఇవ్వబడిన వాటినీ (సందేశాలను) విశ్వసిస్తాము. వారిలో ఏ ఒక్కరి పట్లా మేము భేదభావం చూపము. మేము ఆయనకు విధేయులం (ముస్లింలం) అయ్యాము.﴿

ఇస్లాంను కాకుండా ఇతర ధర్మాన్ని విశ్వసించే ప్రతీ ఒక్కరి ధర్మం అవాస్తవము మరియు వారి కర్మలు తిరస్కరించబడతాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు.﴿

[సూరతు ఆలే ఇమ్రాన్: 81]

కావున ముస్లిం విశ్వసించేదేమిటంటే, అన్ని ధర్మాలు సత్యమైనవి కావు మరియు సత్య ధర్మం ఒక్కటే. మరియు పరలోకంలో ఉత్తమ ముగింపు, గొప్ప గమ్యం మరియు గొప్ప విజయం ఎవరైతే ముస్లింగా అల్లాహ్‌ను కలుస్తాడో అతనికి లభిస్తాయి. మరియు ఎవరైతే ఆయనను తిరస్కరించేవాడిగా మరియు ఆయనతో పాటు ఇతరులను సాటికల్పించేవాడిగా అల్లాహ్‌ను కలుస్తాడో; అతను తన ఇహలోకాన్ని మరియు పరలోకాన్ని నష్టపోతాడు. మహోన్నతుడైన ఆయన ఇలా పలికాడు:

﴾నిశ్చయంగా, సత్యతిరస్కారులైన గ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు నరకాగ్నిలోకి పోతారు. వారందులో శాశ్వతంగా ఉంటారు. ఇలాంటి వారే, సృష్టిలో అత్యంత నికృష్ట జీవులు.﴿

[సూరతుల్ బయ్యిన: 7-8].

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾(ఇంకా) ఇలా అను: "నేను కేవలం అల్లాహ్ నే ఆరాధిస్తూ నా భక్తిని (ఆరాధనను) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకుంటాను;

కావున మీరు ఆయనను వదలి మీకు ఇష్టమైన వారిని ఆరాధించండి!" ఇంకా ఇలా అను: "పునరుత్థాన దినమున తమకు తాము మరియు తమ కుటుంబం వారికి నష్టం కలిగించుకున్న వారే నిశ్చయంగా నష్టపడ్డ వారు. వాస్తవానికి అదే స్పష్టమైన నష్టం!﴿

[సూరతు జ్జుమర్: 65]

మరియు పరమ పవిత్రుడైన అల్లాహ్ సత్యము, మరియు ఆయన సూటియైన (రాజ) మార్గముపై ఉన్నాడు. పరమ పవిత్రుడైన, మహోన్నతుడైన అల్లాహ్ యొక్క న్యాయము ఏమిటంటే, పునరుత్థాన రోజున అల్లాహ్ ను విశ్వసించి, సందేశహరులను (వారిపై శాంతి కలుగుగాక) సత్యమని నమ్మిన విశ్వాసులందరి నివాసమును ఆయన స్వర్గముగా చేస్తాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు ఎవరు అల్లాహ్ కు మరియు ప్రవక్తకు విధేయులై ఉంటారో, అలాంటి వారు అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ సత్యవంతులతోనూ, (అల్లాహ్) ధర్మం కొరకు ప్రాణాలు కోల్పోయిన అమర వీరుల (షహీదుల) తోనూ, సద్వర్తనులతోనూ చేరి ఉంటారు. మరియు అలాంటి వారి సాంగత్యం ఎంతో మేలైనది!﴿

[సూరతు నిసా: 163],

మరియు అల్లాహ్ అవిశ్వాసుల పర్యవసానాన్ని నరకంగా చేశాడు, మరియు అది చాలా భయానకమైన నివాసం, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు ఎవడికి అల్లాహ్ మార్గదర్శకత్వం చేస్తాడో అతడే సన్మార్గం పొందుతాడు. మరియు ఎవడిని ఆయన మార్గభ్రష్టత్వంలో పడనిస్తాడో వాడికి, ఆయన తప్ప, ఇతరుల నెవ్వరినీ నీవు సంరక్షకులుగా పొందలేవు. మరియు వారిని మేము పునరుత్థాన దినమున గ్రుడ్డివారిగా, మూగవారిగా మరియు చెవిటివారిగా చేసి, వారి ముఖాల మీద బోర్లా పడవేసి లాగుతూ ప్రోగుచేస్తాము. వారి ఆశ్రయం నరకమే! అది చల్లారినప్పుడల్లా మేము వారికై అగ్నిజ్వాలను తీవ్రం చేస్తాము.

అదే వారి ప్రతిఫలం. ఎందుకంటే వాస్తవానికి వారు మా సూచనలను తిరస్కరించారు మరియు అన్నారు: "ఏమీ? మేము ఎముకలుగా, పొడిగా మారిపోయిన తరువాత కూడా, సరిక్రొత్త సృష్టిగా మళ్ళీ లేపబడతామా?" ﴿

[సూరా అల్ ఇస్రా: 88]

﴾నిశ్చయంగా, అల్లాహ్ కపట విశ్వాసులను మరియు సత్యతిరస్కారులను అందరినీ నరకంలో జమ చేస్తాడు.﴿

విశ్వాసపరులని స్వర్గములో ఒకచోట చేర్చటం మరియు అవిశ్వాసపరులని నరకములో ఒకచోట చేర్చటం అనేది పరిశుద్ధుడైన, మహోన్నతుడైన అల్లాహ్ తరపు నుండి జరిగే సంపూర్ణ న్యాయం. నరకాగ్ని శిక్ష నుండి రక్షించమని మేము అల్లాహ్ ను వేడుకుంటున్నాము.

المصدر

قسم الأديان والفرق

ملاحظات

--