Skip to content

మసీహ్ అలైహిస్సలాం శిలువపై మరణించారని చెప్పే వారి అభిప్రాయాన్ని ఇస్లాం సమర్థించిందా?

مصدر الإجابة
قسم الأديان والفرق
الباب / الفصل
(قسم الأديان والفرق)

السؤال

మసీహ్ అలైహిస్సలాం శిలువపై మరణించారని చెప్పే వారి అభిప్రాయాన్ని ఇస్లాం సమర్థించిందా?

الجواب

ఈసా అలైహిస్సలాం కాలంలో శిలువ వేయబడిన ఒక సంఘటన జరిగిందనే దానిని ఇస్లాం తిరస్కరించదు, కానీ యూదులు ఈసా అలైహిస్సలాంను హత్యచేయడానికి మరియు ఆయనకు శిలువ వేయడానికి ప్రయత్నించారు. అప్పుడు అల్లాహ్ ఆయనను వారి నుండి రక్షించాడు మరియు ఆయనను పైకి ఎత్తుకున్నాడు, కాబట్టి వారు ఆయనకు ఎలాంటి హాని కలిగించలేకపోయారు. మరియు మరొక వ్యక్తిపై ఆయన రూపమును వేశాడు, అప్పుడు యూదులు ఆనాటి విగ్రహారాధకుడైన రోమన్ పాలకునితో కుట్ర పన్ని అతనిని పట్టుకున్నారు, మరియు అతనిని చంపి అతనికి శిలువ వేశారు, తాము ఈసా అలైహిస్సలాంను చంపామని మరియు ఆయనకు శిలువ వేశామని వారు భావించారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఈసా వారిలో సత్యతిరస్కారాన్ని కనుగొని ఇలా ప్రశ్నించాడు: "అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు?" (అప్పుడతని) శిష్యులు ఇలా జవాబిచ్చారు: "మేము నీకు అల్లాహ్ మార్గంలో సహాయకులముగా ఉంటాము. మేము అల్లాహ్ ను విశ్వసించాము మరియు మేము అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము) అయ్యామని, నీవు మాకు సాక్షిగా ఉండు.

ఓ మా ప్రభూ! నీవు అవతరింప జేసిన సందేశాన్ని మేము విశ్వసించాము మరియు మేము ఈ సందేశహరుణ్ణి అనుసరించాము. కావున మమ్మల్ని సాక్షులలో వ్రాసుకో!

మరియు వారు (ఇస్రాయీల్ సంతతిలోని అవిశ్వాసులు, ఈసా కు విరుద్ధంగా) కుట్రలు చేశారు. మరియు అల్లాహ్ (వారి కుట్రలకు విరుద్ధంగా) పన్నాగాలు పన్నాడు. ఎత్తులు వేయటంలో అల్లాహ్ అత్యుత్తముడు!

(జ్ఞాపకం చేసుకోండి) అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: "ఓ ఈసా! నేను నిన్ను తీసుకుంటాను మరియు నిన్ను నా వైపునకు ఎత్తుకుంటాను మరియు సత్యతిరస్కారుల నుండి నిన్ను శుద్ధపరుస్తాను మరియు నిన్ను అనుసరించిన వారిని, పునరుత్థాన దినం వరకు సత్యతిరస్కారులకు పైచేయిగా ఉండేటట్లు చేస్తాను. చివరకు మీరంతా నా వద్దకే మరలి రావలసి ఉంది. అప్పుడు నేను మీ మధ్య తలెత్తిన విభేదాలను గురించి తీర్పు చేస్తాను.﴿

[సూరతు ఆలి ఇమ్రాన్: 52-55], మరియు సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు వారు: "నిశ్చయంగా, మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు, మర్యమ్ కుమారుడైన, ఈసా మసీహ్ ను (ఏసు క్రీస్తును) చంపాము" అని అన్నందుకు. మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువపై ఎక్కించనూ లేదు, కాని, వారు భ్రమకు గురి చేయబడ్డారు. నిశ్చయంగా, ఈ విషయాన్ని గురించి అభిప్రాయభేదం ఉన్నవారు దీనిని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా, వారు అతనిని చంపలేదు.

వాస్తవానికి, అల్లాహ్ అతనిని (ఈసాను) తన వైపునకు ఎత్తుకున్నాడు మరియు అల్లాహ్ సర్వశక్తి సంపన్నుడు, మహా వివేకవంతుడు.

﴾మరియు గ్రంథ ప్రజల్లో ఎవడు కూడా అతనిని (ఈసాను), అతని మరణానికి పూర్వం (అతను, అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని), విశ్వసించకుండా ఉండడు. మరియు పునరుత్థాన దినమున అతను (ఈసా) వారిపై సాక్షిగా ఉంటాడు.﴿

[సూరతు నిసా: 163],

మసీహ్ ఈసా బిన్ మర్యమ్ (అలైహిస్సలాం) శిలువ వేయబడలేదు మరియు చంపబడలేదు, దానికి బదులుగా అల్లాహ్ ఆయనను తన వైపునకు పైకి ఎత్తుకున్నాడు. మరియు ఆయన ఇప్పుడు రెండవ ఆకాశంలో ఉన్నారు, ప్రళయదినానికి ముందు ఆయన దిగివస్తారు. ఆయన దిగిరావటం ప్రళయదినం యొక్క గొప్ప సూచనలలో ఒకటిగా ఉంటుంది. అప్పుడు ఆయన మసీహ్ దజ్జాల్ ను చంపుతారు; అల్లాహ్ ను కాదని ఆరాధించబడిన మరియు ఆయన దానిపై శిలువ వేయబడ్డాడని క్రైస్తవులు అబద్ధం కల్పించిన శిలువను విరిచేస్తారు; పందిని చంపుతారు; మరియు ఇస్లామీయ షరియత్ ప్రకారం తీర్పునిస్తారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:

“మరియం కుమారుడు (ఈసా అలైహిస్సలాం) ఒక ధర్మబద్ధుడైన న్యాయమూర్తిగా మీ మధ్యకు (భువి నుండి) దిగిరానంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. అతడు శిలువను విరిచేస్తాడు; పందిని చంపుతాడు; మరియు జిజియాను ఎత్తివేస్తాడు; అప్పుడు సంపద ఎంత పుష్కలంగా ఉంటుందంటే, ఎవరూ దానిని స్వీకరించరు.”

[సహీహ్ బుఖారీ (2476) మరియు ముస్లిం (155)].

المصدر

قسم الأديان والفرق

ملاحظات

--