Skip to content

ముస్లింలు ఒకే గ్రంథాన్ని అనుసరిస్తున్నప్పటికీ, వారు ఎందుకు తెగలుగా మరియు వర్గాలుగా విడిపోయారు?

محاور التعريف بالإسلام
الشبهات والاعتراضات
مصدر الإجابة
قسم الأديان والفرق
الباب / الفصل
(قسم الأديان والفرق)

السؤال

ముస్లింలు ఒకే గ్రంథాన్ని అనుసరిస్తున్నప్పటికీ, వారు ఎందుకు తెగలుగా మరియు వర్గాలుగా విడిపోయారు?

الجواب

మొదటిది: విభేదాలు మరియు భేదాభిప్రాయాలు అనేవి అల్లాహ్ మానవజాతిని సృష్టించిన విశ్వ నియమం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు నీ ప్రభువు సంకల్పిస్తే, సర్వ మానవులను (ఒకే ధర్మాన్ని అవలంబించే) ఒకే ఒక్క సంఘంగా చేసేవాడు. అయినా వారు అభిప్రాయ భేదాలు లేకుండా ఉండ లేక పోయేవారు.

నీ ప్రభువు కరుణించినవాడు తప్ప! మరియు దాని కొరకే ఆయన వారిని సృష్టించాడు. మరియు నీ ప్రభువు: "నేను జిన్నాతులు మరియు మానవులు అందరితో నరకాన్ని నింపుతాను!" అని అన్నమాట నెరవేరుతుంది.﴿

[సూరతు హూద్: 118-119]

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

«యూదులు డబ్బై ఒకటి లేదా డబ్బై రెండు వర్గములుగా విడిపోయారు. మరియు క్రైస్తవులు కూడా అదే విధంగా విడిపోయారు. మరియు నా సమాజం (ఉమ్మత్) డబ్బై మూడు వర్గములుగా విడిపోతుంది.»

[దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు, మరియు అన్నారు: హసన్ సహీహ్ హదీథ్].

రెండవది: ధర్మము అల్లాహ్ వద్ద నుండి వచ్చిన సత్యమే అయినట్లయితే, దాని అనుచరులు దానిపై విభేదించినప్పటికీ ఆ విభేదాల కారణంగా ధర్మము నిందించబడదు; బదులుగా, సత్య ధర్మాన్ని వీడి మరియు జమాఅత్‌ను వదిలిపెట్టిన వారు మాత్రమే నిందించబడతారు.

మూడవది: ప్రజలు విభేదించినప్పుడు మనము ఎవరిని అనుసరించాలి? మనము ఎవరితో కలిసి ఉండాలి? మరియు విభేదించే వారు ఎక్కువైనప్పుడు సత్యం ఎవరితో ఉంటుంది? అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు వివరించారు. మరియు వర్గాలుగా చీలిపోవడం గురించి ప్రస్తావించిన తరువాత, ఒకే ఒక వర్గం తప్ప మిగిలిన వర్గాలన్నీ మార్గభ్రష్టత్వంలో ఉన్నాయని, ఆ ఒక్క వర్గమే సత్యంపై ఉందని స్పష్టపరుస్తూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

"వారందరూ నరకంలోకి పోతారు, ఒక్క వర్గం మినహాయించి." వారు అడిగారు: "ఏది అది, ఓ ప్రవక్తా?" ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: "నేను మరియు నా సహాబాలు ఉన్న మార్గంను అనుసరించినవారు."

[సునన్ తిర్మిజీ (2641)].

మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

"«నిశ్చయంగా రెండు గ్రంథాల ప్రజలు తమ ధర్మంలో డబ్బై రెండు వర్గములుగా విడిపోయారు. మరియు ఈ సమాజం డబ్బై మూడు వర్గములుగా విడిపోతుంది - అనగా: మనోవాంఛలు - ఒక వర్గము తప్ప అన్ని వర్గములు నరకములో ఉంటారు, మరియు అది జమాఅత్.»"

[ముస్నద్ అహ్మద్ (16937), అబూదావూద్ (4597)].

"నిజానికి, మీలో ఎవరైతే (నా తర్వాత) జీవించి ఉంటారో, వారు చాలా విభేదాలు చూస్తారు. ధర్మంలో కొత్తగా ఆవిష్కరించబడిన విషయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే అవి మార్గభ్రష్టత. కనుక మీలో ఎవరైతే ఆ పరిస్థితిని చూస్తారో, వారు నా విధానాన్ని (సున్నతులను) మరియు సన్మార్గగాములైన మార్గదర్శక ఖలీఫాల విధానాన్ని ఖచ్చితంగా అనుసరించాలి. దానిని మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకోండి."

[సుననె తిర్మిజీ (2676, మరియు సుననె ఇబ్నె మాజ 43), మరియు తిర్మిజీ ఈ హదీసు హసన్ (ఉత్తమ) మరియు సహీహ్ (ప్రామాణిక) హదీసు వర్గీకరణకు చెందుతుందని పలికారు].

మరియు ఈ వర్గమే నిజమైన ఇస్లాంకు ప్రాతినిధ్యం వహిస్తుంది, అది జీవితంలోని అన్ని రంగాలలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు అనుసరించిన మార్గం, మరియు వారే అహ్లె సున్నత్ వల్ జమాఅత్.

నాలుగు : యూదులు మరియు క్రైస్తవులు విభేదించారు, అందువలన వారిలో ఏ వర్గమూ సత్యంపై మిగిలి లేదు. అయితే ఈ ధర్మంలో మరియు ఇస్లామిక్ సమాజంలో, అల్లాహ్ ఆజ్ఞ వచ్చే వరకు ఈ సమాజం నుండి ఒక వర్గము ఎల్లప్పుడూ సరైన ధర్మంపై ఉంటుంది, దీని గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శుభవార్త తెలిపినట్లుగా:

నా ఉమ్మత్ నుండి ఒక సమూహం ఎల్లప్పుడూ సత్యంపై ప్రబలంగా ఉంటుంది. వారిని విడిచిపెట్టిన వారు వారికి హాని చేయలేరు, అల్లాహ్ ఆజ్ఞ వచ్చే వరకు వారు అలాగే ఉంటారు.

[సహీహ్ ముస్లిం (170)].

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾వారు అల్లాహ్ జ్యోతిని (ఇస్లాంను) తమ నోటితో ఊది, ఆర్పి వేయాలనుకుంటున్నారు. కాని సత్యతిరస్కారులకు ఎంత అసహ్యకరమైనా! అల్లాహ్ తన జ్యోతిని వ్యాపింపజేయాలని నిర్ణయించుకున్నాడు.

బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అది ఎంత అసహ్యకరమైనా, తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్నీ ఇచ్చి పంపి దానిని సకల ధర్మాల మీద ప్రబలింప జేసినవాడు (ఆధిక్యతనిచ్చిన వాడు) ఆయన (అల్లాహ్) యే!﴿

[సూరతు అస్సఫ్: 6]

ఐదవది: ఇస్లాంలో విభేదాలు రెండు రకాలు: ఆమోదయోగ్యమైన విభేదం, ఇందులో విభేదించిన వ్యక్తి భ్రష్టుడు లేదా వక్రమార్గం పట్టినవాడు అని పరిగణించబడడు. ఇది కొన్ని ఫిఖ్హ్ సమస్యలలోని అనగా ఆచరణాత్మక శాఖా తీర్పులలోని విభేదం వలె ఉంటుంది. ఉదాహరణకు: శుచిత్వం, నమాజు, క్రయవిక్రయాలు మరియు న్యాయ సంబంధిత సమస్యలు. ఈ విభేదానికి గల కారణాలలో అవగాహనలోని వ్యత్యాసం ఒకటి. ప్రజలలో కొందరి మేధస్సు మరియు అవగాహన విస్తృతంగా మరియు సూక్ష్మంగా ఉంటుంది, కనుక ఇతరులు గ్రహించలేని విషయాన్ని వారు గ్రహిస్తారు. ఇతర కారణాలతో పాటు ప్రామాణిక ఋజువు అస్పష్టంగా ఉండటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. విభేదానికి గురైన ఇటువంటి సమస్యలు పండితుల ఇజ్తిహాద్‌కు అవకాశమున్న పరిధిలోనివే.

రెండవ రకం: నిషేధించబడిన భేదాభిప్రాయం, ఇది అనేక వాక్యాలలో ఖండించబడింది, వాటిలో అల్లాహ్ వాక్కు:

﴾నిశ్చయంగా, ఎవరైతే తమ ధర్మంలో విభేదాలు కల్పించుకొని, వేర్వేరు తెగలుగా చీలి పోయారో, వారితో నీకు ఎలాంటి సంబంధం లేదు. నిశ్చయంగా, వారి వ్యవహారం అల్లాహ్ ఆధీనంలో ఉంది. తరువాత ఆయనే వారు చేస్తూ వున్న కర్మలను గురించి వారికి తెలుపుతాడు.

[సూరతుల్ అన్ఆమ్: 18]

అల్లాహ్ వాక్కు:

﴾వారిలో ఎవరైతే, తమ ధర్మాన్ని విభజించి వేర్వేరు తెగలుగా చేసుకున్నారో! ప్రతివర్గం వారు తమ వద్దనున్న దాని (సిద్ధాంతం) తోనే సంతోషపడుతున్నారు.﴿

[సూరతుర్ రూమ్: 32]

మరియు అది ప్రవక్తత్వం, విశ్వాసం, ఖదర్ (విధి), గుణగణాలు మరియు సహాబాల వంటి విశ్వాసానికి సంబంధించిన ప్రధాన విషయాలలో ఉన్న విభేదం. కావున వర్గములలో ఈ విషయాలలో వారి విభేదం సలఫ్ (పూర్వీకుల) ఏకాభిప్రాయానికి విరుద్ధంగా ఉన్నందున వారిని ఇస్లాం పరిధి నుండి వైదొలగేలా చేసేదిగా పరిగణించబడేవి ఉన్నవి, మరియు వాటిలో అలా పరిగణించబడనివి కూడా ఉన్నవి.

అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.

المصدر

قسم الأديان والفرق

ملاحظات

--