ఇస్లాంకు వ్యతిరేకంగా యుద్ధం చేయని ముస్లిమేతరుల పట్ల ఇస్లాం వైఖరి ఏమిటి?
- محاور التعريف بالإسلام
- الشبهات والاعتراضات
- مصدر الإجابة
- قسم ما يتعلق بغير المسلمين والشرك والعبادة
- الباب / الفصل
- (قسم ما يتعلق بغير المسلمين والشرك والعبادة)
السؤال
ఇస్లాంకు వ్యతిరేకంగా యుద్ధం చేయని ముస్లిమేతరుల పట్ల ఇస్లాం వైఖరి ఏమిటి?
الجواب
ముస్లిమేతరుల పట్ల ఇస్లాం వైఖరిని స్పష్టం చేస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-
﴾ఎవరైతే ధర్మవిషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో! వారి పట్ల మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్ నిషేధించలేదు. నిశ్చయంగా, అల్లాహ్ న్యాయవర్తనులను ప్రేమిస్తాడు.﴿
[అల్ ముమ్'తహిన: 8]
వారి పట్ల మంచితనం చూపడంలో వారికి మేలు చేయడం, వారికి దానం చేయడం, వారితో మంచి పొరుగువారిగా మెలగడం, వారి అవసరాలను తీర్చడంలో వారికి సహాయం చేయడం, వారి మతంతో సంబంధం లేని వారి కార్యక్రమాలలో పాలుపంచుకోవడం, మరియు వివాహం తదితర సందర్భాలలో వారు ఇచ్చే ఆహ్వానానికి హాజరుకావడం ఇమిడి ఉన్నాయి. అయితే మనిషి తన ధర్మాన్ని (దీన్ ను) సురక్షితంగా ఉంచుకోవాలనే షరతు ఉంది, మరియు వారు అందులో మద్యం సేవించడం లాంటి నిషిద్ధ కార్యాలను (మున్కర్ ను) బహిర్గతం చేయకూడదు. అస్మా బిన్త్ అబూబకర్ రజియల్లాహు అన్హుమా తెలియజేశారు, ఆమె ఇలా అన్నారు:
దైవప్రవక్త ఖురైష్తో ఒప్పందం కుదుర్చుకున్న రోజుల్లో ఒకసారి మా అమ్మ నా దగ్గరికి వచ్చింది. అప్పటికి ఆమె ఇంకా బహుదైవారాధకురాలిగానే ఉంది. అప్పుడు నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగాను: “ఓ దైవప్రవక్తా! మా అమ్మ నా దగ్గరికి వచ్చి ఉంది. ఆమె నా నుండి సద్వర్తనను ఆశిస్తోంది. మరి నేను మా అమ్మ పట్ల మంచిగా మెలగవచ్చా?” అందుకాయన “అవును, నువ్వు నీ అమ్మ పట్ల సత్ప్రవర్తనతో మెలగాలి” అని అన్నారు.
[ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (2620) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1003) లో ఉల్లేఖించారు].
వారి పట్ల చూపే అత్యంత గొప్ప ఉపకారం మరియు సదాచరణ, వారిని ఇస్లాం వైపునకు ఆహ్వానించడమే. దావా మరియు ఫికహ్ గ్రంథాలలో వివరించబడినట్లుగా, నిస్సందేహంగా ఇస్లాం వైపునకు ఆహ్వానించడం అనేది దశలవారీగా జరుగుతుంది.
జిమ్మీ లేదా ముఆహిద్ (ఒప్పందం కుదుర్చుకున్న) అవిశ్వాసికి ముస్లింలపై హక్కులు ఉన్నాయి, కాబట్టి అతణ్ణి చంపడం సంగతి అటుంచితే, కనీసం అతడిని బాధపెట్టడం కూడా అనుమతించబడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తిని హతమార్చినవాడు స్వర్గపు పరిమళాన్ని కూడా పీల్చలేడు, నిశ్చయంగా స్వర్గపు పరిమళం నలభై సంవత్సరాల ప్రయాణవ్యత్యాసం వరకు వ్యాపించి ఉంటుంది.
[దీనిని బుఖారీ (3166) ఉల్లేఖించారు],
కావున ఇస్లాము న్యాయం, సమతుల్యత మరియు కరుణ యొక్క ధర్మం.
المصدر
ملاحظات
--