ఒక మనిషి మహోన్నతుడైన అల్లాహ్ను ఎందుకు ఆరాధించాలి?
- محاور التعريف بالإسلام
- الشبهات والاعتراضات
- مصدر الإجابة
- قسم ما يتعلق بغير المسلمين والشرك والعبادة
- الباب / الفصل
- (قسم ما يتعلق بغير المسلمين والشرك والعبادة)
السؤال
ఒక మనిషి మహోన్నతుడైన అల్లాహ్ను ఎందుకు ఆరాధించాలి?
الجواب
ఈ ప్రశ్నకు సమాధానం ఎంతో గొప్పది, దీనికి చాలా విపులీకరణ మరియు సవిస్తరమైన వివరణ అవసరం, కానీ మేము సాధ్యమైనంత వరకు సంక్షిప్తం చేస్తాము, కాబట్టి మేము పలుకుతున్నాము - అల్లాహ్ తోనే భాగ్యము ప్రాప్తించును :
నిశ్చయంగా ధర్మాన్ని ఆచరించడం ఒక అత్యవసరమైన అంశం, దీని అర్థం ఏమిటంటే ఆత్మ దానిని కోరుకుంటుంది, అంతరాత్మ దాని కోసం పరితపిస్తుంది మరియు బుద్ధి దానిని తప్పనిసరి చేస్తుంది, మరియు మనిషి ధర్మం లేకుండా జీవించడాన్ని అంగీకరించలేడు; అందువల్లే అన్ని జాతులు ఆరాధించడం మీరు చూస్తారు, వారు ఆరాధించినంత మాత్రాన వారి ఆరాధన సరైనది అని దీని అర్థం కాదు, కాకుండా ఆరాధించడం అనేది ఒక సహజమైన మరియు అత్యవసరమైన అంశం అని ఇది సూచిస్తుంది.
నిశ్చయంగా అల్లాహ్ పవిత్ర ప్రభువు అందమైన పేర్లను మరియు మహోన్నతమైన లక్షణాలను కలిగి ఉన్నాడు. ఆయనే ప్రభువు, ఉపాధిప్రధాత, సమస్త వ్యవహారాల నిర్వాహకుడు, సార్వభౌముడు, ప్రాణమిచ్చేవాడు మరియు మరణమిచ్చేవాడు. మనకు తెలిసిన మరియు మనకు తెలియని సకల అనుగ్రహాలను మనకు ప్రసాదించిన వాడు ఆయనే. విషయమిలా ఉండగా, మానవుడు ఆరాధన చేయడానికి బద్ధుడై ఉన్నందున, ఆరాధనకు అర్హుడైన అల్లాహ్ పవిత్ర ప్రభువును మాత్రమే ఆరాధించాలి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు!﴿
ఆయన (అల్లాహ్) యే మీ కొరకు భూమిని పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను (పంటలను) ఉత్పత్తి చేశాడు! కావున ఇది తెలుసుకొని కూడా, మీరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా నిలబెట్టకండి.﴿
[సూరతుల్ బఖరహ్: 129]
నిశ్చయంగా మానవుడికి తన అన్ని వ్యవహారాలలో మార్గదర్శనం అవసరం, మరియు అల్లాహ్ మాత్రమే సన్మార్గం చూపేవాడు. కావున అతను ఆయనను ఆరాధించకపోతే, ఆయనతో మార్గదర్శనం ఎలా అర్ధిస్తాడు? మరియు ఒక ముస్లిం ప్రతి నమాజులో మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చిన విధంగా ఇలా అంటాడు:
﴾మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము.
మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి.
నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు.﴿
[సూరతుల్ ఫాతిహ: 5-7]
మరియు అల్లాహ్ అతనికి మార్గదర్శనం ప్రసాదించనట్లయితే, అతని వ్యవహారాలు కష్టతరమవుతాయి.
నిశ్చయంగా మనిషి సహజంగానే మంచి, సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటాడు, మరియు ఈ మంచి జీవితం విశ్వాసపరులకు మాత్రమే లభిస్తుంది, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా చెప్పాడు:-
﴾ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.﴿
[నహల్ : 97]
మంచి జీవితంలో మనిషికి ప్రశాంతత, సంతృప్తి మరియు శాంతి లభిస్తాయి.
నిశ్చయంగా జీవిత స్వభావంలో ఆపదలు మరియు పరీక్షలు ఉంటాయి. విశ్వాసం మరియు అల్లాహ్ ఆరాధన -అల్లాహ్ అనుమతితో- వాటిని కలిగి ఉన్నవారికి పరీక్షల సమయంలో సమతుల్యతను ప్రసాదిస్తాయి; తద్వారా ఆపద సమయంలో అతను తన సమతుల్యతను కోల్పోకుండా ఉంటాడు. ఎందుకంటే విశ్వాసం మనిషికి స్థిరత్వాన్ని మరియు సహనాన్ని చేకూరుస్తుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾భూమి మీద గానీ లేదా స్వయంగా మీ మీద గానీ విరుచుకు పడే ఏ ఆపద అయినా సరే! మేము దానిని సంభవింప జేయక ముందే గ్రంథంలో వ్రాయబడకుండా లేదు. నిశ్చయంగా, ఇది అల్లాహ్ కు ఎంతో సులభం.﴿
[సూరతుల్ హదీద్: 22]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఏ ఆపద కూడా, అల్లాహ్ అనుమతి లేనిదే సంభవించదు. మరియు ఎవడైతే అల్లాహ్ ను విశ్వసిస్తాడో, అల్లాహ్ అతని హృదయానికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.﴿
[సూరతు తగాబున్:11]
మానవుడు ఇహలోకంలో మరియు పరలోకంలో తన ప్రభువు మరియు సృష్టికర్త సంతృప్తిని పొందాల్సిన అవసరం ఉంది. మరియు ఆయనను విశ్వసించి, ఆయన ఆదేశించిన విధంగా ఆరాధించే వారిని మినహాయించి, ప్రభువు సంతృప్తి లభించదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా చెప్పాడు:-
﴾నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారు, వారే సృష్టిలో అత్యంత ఉత్కృష్ట జీవులు.
వారికి తమ ప్రభువు నుండి లభించే ప్రతిఫలం శాశ్వతమైన స్వర్గవనాలు. వాటిలో క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. వారు, వాటిలో శాశ్వతంగా కలకాలముంటారు. అల్లాహ్ వారితో ప్రసన్నుడవుతాడు మరియు వారు ఆయనతో సంతుష్టులవుతారు. ఇదే తన ప్రభువుకు భయపడే వ్యక్తికి లభించే ప్రతిఫలం.﴿
[సూరతుల్ బయ్యిన: 7-8].
నిశ్చయంగా అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఉండటం మరియు ఆయనను ఆరాధించడం మానవుడికి సత్యం మరియు అసత్యం మధ్య, మరియు సన్మార్గం మరియు మార్గభ్రష్టత్వం మధ్య వ్యత్యాసాన్ని గుర్తించే ఒక ప్రమాణాన్ని ప్రసాదిస్తుంది. మానవుడికి తన అన్ని పరిస్థితులలోనూ ఈ ప్రమాణం అవసరం; తద్వారా ఏ విషయానికీ దాని అర్హతకు మించిన ప్రాముఖ్యతను ఇవ్వకుండా ఉండేందుకు, లేదా ఘనతకు అర్హత లేని దానిని ఘనపరచకుండా ఉండేందుకు, లేదా గౌరవించబడటం మరియు అనుసరించబడటం హక్కుగా గల విషయాలలో లోపం చేయకుండా ఉండేందుకు.
నిశ్చయంగా మనిషికి ఒక నిర్ణీత గడువు ఉన్నది మరియు ఖచ్చితంగా దానిని కలుసుకోవలసి ఉంది, మరియు మరణ సమయం అతని వద్దకు వస్తుంది, మరియు మరణం దానికదే ఒక భయంకరమైన విషయము, కాని తన ప్రభువును ఆరాధించే విశ్వాసపరుని మరణము, అవిశ్వాసపరుని మరణము కంటే భిన్నంగా ఉంటుంది, మరియు విశ్వాసపరుని మరియు అవిశ్వాసపరుని ఈ రెండు ముగింపులను పరిశీలించండి, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఆ రోజు నరకం (ముందుకు) తీసుకు రాబడుతుంది. ఆ రోజు మానవుడు (తన కర్మలన్నీ) జ్ఞప్తికి తెచ్చుకుంటాడు; కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజనమేమిటీ?
అతడు: "అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు.
అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు! మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు!
(సన్మార్గునితో ఇలా అనబడుతుంది): "ఓ తృప్తి పొందిన ఆత్మా!
నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై!
నీవు (పుణ్యాత్ములైన) నా దాసులలో చేరిపో! ٢٩
మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు!﴿
[సూరతుల్ ఫజర్: 23-30]
﴾నిశ్చయంగా, ఎవరైతే: "అల్లాహ్ యే మా ప్రభువు!" అని పలుకుతూ తరువాత దాని పైననే స్థిరంగా ఉంటారో! వారిపై దేవదూతలు దిగి వచ్చి (ఇలా అంటారు): "మీరు భయ పడకండి మరియు దుఃఖపడకండి, మీకు వాగ్దానం చేయబడిన స్వర్గపు శుభవార్తను వినండి!﴿
[సూరా ఫుస్సిలత్ :30]
﴾మరియు సత్యతిరస్కారుల ప్రాణాలను దైవదూతలు తీసే దృశ్యాన్ని నీవు చూపడగలిగితే (ఎంత బాగుండేది). వారు (దేవదూతలు) వారి ముఖాలపైనను మరియు వారి పిరుదులపైనను కొడుతూ ఇలా అంటారు: "భగభగమండే ఈ నరకాగ్ని శిక్షను చవి చూడండి.﴿
[సూరతుల్ అన్'ఫాల్: 50]
అల్లాహ్ తెలియజేశాడు మరియు ఆయన వార్త సత్యమైనది, ఆయన వాగ్దానం చేశాడు మరియు ఆయన వాగ్దానం సత్యమైనది; నిశ్చయంగా అల్లాహ్ సమాధులలో ఉన్నవారిని లేపుతాడు. మరియు ఆయన దీని కొరకు లెక్కలేనన్ని రుజువులను సిద్ధంచేశాడు, అవి దివ్య ఖుర్ఆన్ లో విశదపరచబడి ఉన్నాయి. మరియు మనిషి తన ప్రభువు వైపుకు తీసుకువెళ్ళబడే రోజు తప్పక రానుంది. ఇక ఎవరైతే విశ్వాసిగా ఉంటాడో అతని కొరకు శాశ్వత స్వర్గంలో శాశ్వత అనుగ్రహం ఉంటుంది. మరియు ఎవరైతే అవిధేయునిగా ఉంటాడో అతని కొరకు నరకాగ్నిలో శాశ్వత శిక్ష ఉంటుంది.
المصدر
ملاحظات
--