Skip to content

దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవప్రవక్తలలో, సందేశహరులలో చిట్టచివరి ప్రవక్త అన్నది నిజమేనా? ఒకవేళ ఇది నిజమైతే, దాని వెనుక ఉన్న కారణం ఏమిటి? ఈ రోజుల్లో మానవాళికి మరింత మంది ప్రవక్తల అవసరం ఉందని మీరు భావించడం లేదా?

مصدر الإجابة
قسم النبوة
الباب / الفصل
(قسم النبوة)

السؤال

దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవప్రవక్తలలో, సందేశహరులలో చిట్టచివరి ప్రవక్త అన్నది నిజమేనా? ఒకవేళ ఇది నిజమైతే, దాని వెనుక ఉన్న కారణం ఏమిటి? ఈ రోజుల్లో మానవాళికి మరింత మంది ప్రవక్తల అవసరం ఉందని మీరు భావించడం లేదా?

الجواب

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తల (అలైహిముస్సలాతు వస్సలామ్) పరిసమాప్తి. మరియు ఆయనకు ఇచ్చి పంపబడిన ధర్మము అత్యంత పరిపూర్ణమైన ధర్మము అయినందున, అది ప్రతీ కాలము,ప్రదేశము కొరకు సముచితమైనది కావడం దాని లక్షణాలలో ఒకటి. మరియు దైవభీతి గల పండితులు ప్రజలకు ధర్మాన్ని ప్రచారం చేస్తారు మరియు దానిని వివరిస్తారు.

మరియు ప్రశ్నించే వ్యక్తి సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తో ఇలా అంటున్నట్లుగా ఉంది: "నాకు నీకంటే బాగా తెలుసు; నీవు సందేశాలను ఎందుకు వరుసగా వచ్చేలా చేయలేదు?" అల్లాహ్'కు తన సందేశాన్ని ఎక్కడ పెట్టాలో చాలా బాగా తెలుసు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు వారి వద్దకు ఏదైనా సూచన వచ్చినప్పుడు వారు: "అల్లాహ్ యొక్క సందేశహరులకు ఇవ్వబడినట్లు, మాకు కూడా (దివ్యజ్ఞానం) ఇవ్వబడనంత వరకు మేము విశ్వసించము." అని అంటారు. తన సందేశాన్ని ఎవరిపై అవతరింపజేయాలో అల్లాహ్ కు బాగా తెలుసు.... ﴿

[సూరతుల్ అన్ఆమ్: 18]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ మాకు ఇలా తెలియజేశాడు, నిశ్చయంగా ఆయన ఇబ్రహీము అలైహిస్సలాము, మూసా అలైహిస్సలాము మరియు ఈసా అలైహిస్సలాం ల సందేశాల వలె పూర్వపు సందేశాలను తమ జాతుల కొరకు ప్రత్యేక సందేశాలుగా చేశాడు. మరియు వాటికి ఒక గడువును నిర్ణయించాడు, దాని ముగింపుతో అవి ముగుస్తాయి. మరియు వాటిని భద్రపరిచే బాధ్యతను అల్లాహ్ తీసుకోలేదు; కానీ వాటి సంరక్షణ బాధ్యతను మానవులకు ఇచ్చాడు, అయితే వారు వాటిని పోగొట్టుకున్నారు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

﴾నిశ్చయంగా, మేము తౌరాత్ ను (మూసాపై) అవతరింపజేశాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి. అల్లాహ్ కు విధేయులైన (ముస్లింలైన) ప్రవక్తలు దానిని అనుసరించి, యూదుల మధ్య తీర్పు చేస్తూ ఉండేవారు. అదే విధంగా ధర్మ వేత్తలు (రబ్బానియ్యూన్) మరియు యూద మతాచారులు (అహ్ బార్ లు) కూడా (తీర్పు చేస్తూ ఉండేవారు). ఎందుకంటే వారు అల్లాహ్ గ్రంథానికి రక్షకులుగా మరియు దానికి సాక్షులుగా నియమింపబడి ఉండేవారు....﴿

[సూరతుల్ మాయిద : 44వ ఆయతు]

దైవదౌత్యలు మన ప్రవక్త ముహమ్మద్ (ﷺ) సందేశంతో ముగుస్తాయని అల్లాహ్ తన ప్రవక్తలకు (అలైహిస్సలాం) తెలియజేశాడు, మరియు మహోన్నతుడైన అల్లాహ్ దైవదౌత్యలను ఒకదానికొకటి సంపూర్ణం చేసుకునేలా చేశాడు, మరియు తరువాత వచ్చినది అంతకు మునుపటి కట్టడనిర్మాణాన్ని పరిపూర్ణం చేస్తుంది; అందుకనే దావూద్ ప్రవక్త (అలైహిస్సలాం) దీని గురించి తెలియజేస్తూ ఇలా చెప్పారు:- "నిర్మాతలు ఏ రాయిని అయితే తిరస్కరించారో ఆ రాయియే మూలరాయిగా మారింది. ఇది ప్రభువు వైపు నుండి జరిగింది, మరియు ఇది మన కళ్ళకు అద్భుతమైనది" (మజామీర్: 118: 22).

ఈ శుభవార్త యొక్క అర్థం ఏమిటంటే: దైవ సందేశాలు ఒక కట్టడ నిర్మాణాన్ని పోలి ఉంటాయి, మరియు ప్రతి ప్రవక్త తమకు పూర్వం వచ్చిన ప్రవక్త ప్రారంభించిన దానిని పూర్తి చేస్తూ వచ్చారు. ప్రవక్తల పరంపర సంపూర్ణమై, కేవలం చివరి ప్రవక్త రాక మాత్రమే మిగిలి ఉన్నప్పుడు, ఆ కట్టడ నిర్మాణం పరిపూర్ణతకు చేరుకొని అందులో కేవలం ఒక ఇటుక స్థానం మాత్రమే మిగిలి ఉన్నప్పుడు అల్లాహ్ తన సందేశహరుడు మరియు ప్రాణమిత్రుడైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని పంపాడు. తద్వారా ఆయనతో ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు, అనుగ్రహాన్ని సంపూర్ణం చేశాడు, ప్రవక్తల పరంపరను ముగించాడు మరియు కట్టడ నిర్మాణాన్ని పరిపూర్ణం చేశాడు. ఆ విధంగా అల్లాహ్ యొక్క సందేశహరుడు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ప్రవక్తలు మరియు సందేశహరులకు (అలైహిముస్సలాం) అంతిమ ప్రవక్త అయ్యారు. దావూద్ (అలైహిస్సలాం) గారి మాటలలో సూచించబడిన రాయి (ఇటుక) ద్వారా ఆయన గురించే ఉదాహరణ ఇవ్వబడింది.

ఈ వార్త ఇంజీలులో కూడా వచ్చింది, ఇంజీలులో అంతిమ ప్రవక్తయైన దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ గురించి శుభవార్త వచ్చింది, మరియు ఈసా మసీహ్ అలైహిస్సలాం అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ రాకతో దైవదౌత్యాలు సంపూర్ణమవుతాయని, ధర్మం పరిపూర్ణమవుతుందని మరియు ఆయనతో అనుగ్రహం పూర్తవుతుందని విశదపరిచారు. అందుకే మత్తయి ఉల్లేఖించినట్లు ఆయన ఇలా అన్నారు:- «యేసు వారితో,"మీరు దాని గురించి పుస్తకాలలో ఎప్పుడు చదువలేదా:-కట్టడనిర్మాణకులు వదిలిన ఆ రాయి మూల కేంద్రబిందువు! ప్రభువు తరుపున ఇది జరిగింది,ఇది మా దృష్టిలో అద్భుతమైనది"అని అన్నారు» (మత్తయి: 21:42).

ఈ విషయం మొదటి పేతురు పత్రిక: 2:7 లో కూడా పేర్కొనబడింది.

దైవసందేశహరులైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పూర్వప్రవక్తలు ప్రారంభించిన దానిని ఎలా సంపూర్ణ పరిచారో, మరియు ఆయన కార్యం వారి కార్యాలను ఎలా పరిపూర్ణం చేసిందో విశదీకరిస్తూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:-

{నాది మరియు నాకు మునుపు గతించిన ప్రవక్తల ఉపమానం ఆ వ్యక్తి లాంటిది అతను ఒక ఇంటిని నిర్మించాడు,దాన్ని అత్యుత్తమంగా మలచి అతి సుందరంగా తీర్చిదిద్దాడు కానీ ఒక మూల‘ఇటుక’ పెట్టె ప్రదేశం మాత్రం వదిలేశాడు,ప్రజలు ఆ ఇంటిని చూడటానికి తరలి వస్తున్నారు ఆ ఇంటిని పరిశీలిస్తూ ఆశ్చర్యకితులవుతున్నారు,కానీ దానితో పాటు ఎందుకని ఇక్కడ ఒక ఇటుక’ పూరించలేదు’అని అంటున్నారు,దైవప్రవక్త సెలవిచ్చారు:-నేనే ఆ ఇటుకను మరియు నేనే ప్రవక్తలలో అంతిమ దైవప్రవక్తను}

[సహీహ్ బుఖారీ (3535) మరియు ఈ పదాలు వారివే, మరియు సహీహ్ ముస్లిం (2286)].

చివరకు మన ప్రవక్త ముహమ్మద్ (ﷺ) రాకతో ధర్మం పరిపూర్ణమై మరియు అనుగ్రహం సంపూర్ణమైనప్పుడు; మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ . . . ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్ కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను . . . ﴿

ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విషయానికి వస్తే, ఆయన సర్వమానవాళి కొరకు అల్లాహ్ ప్రవక్త అని అల్లాహ్ నిర్ణయించాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

﴾మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సర్వమానవులకు శుభవార్తనిచ్చే వానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము. కాని వాస్తవానికి చాలా మంది ప్రజలకు ఇది తెలియదు.﴿

[సూరతు సబా: 28]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ . . .(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను . . .﴿

[సూరతుల్ ఆరాఫ్: 158]

ఈ కారణంగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్యం ప్రళయ దినం వరకు మిగిలి ఉండిపోయేలా మహోన్నతుడైన అల్లాహ్ నిర్ణయించాడు మరియు దీనిని సురక్షితంగా ఉంచడానికి, ప్రళయ దినం వరకు మిగిలి ఉండిపోయేలా చేయడానికి అవసరమైన ప్రాపంచిక మరియు షరీఅతు పరమైన ఏర్పాట్ల రక్షణ బాధ్యతను ఆయనే స్వయంగా చేపట్టాడు. అందులో భాగమేమిటంటే: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితకాలంలో ఆయన్ను విశ్వసించి, ఆయన్ను కలుసుకుని, ఆయన నుండి బోధనలను గ్రహించి, ఆయన సందేశాన్ని ఇతరులకు వ్యాప్తి చేసిన వారి సంఖ్య ఒక లక్షకు పైగా ఉండేది. వీరు ఆయన నుండి ఈ దైవదౌత్యాన్ని తమ తర్వాతి తరాల వారికి అందించారు. కాగా, ఈసా అలైహిస్సలాం వెంట ఉన్న వారి అనుచరుల (హవారీయుల) సంఖ్య డెభ్భై మందికి మించలేదు, మరియు మూసా అలైహిస్సలాంను విశ్వసించిన వారు కూడా చాలా కొద్ది మందే.

నిస్సందేహంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క అంతిమ సందేశం, అది విశ్వాసాలకు, ఆరాధనలకు, వ్యవహారాలకు, ప్రవర్తనలకు మరియు స్థితిగతులకు సంబంధించినదైనా సరే, తరతరాలుగా వరుసగా ముతవాతిర్ క్రమంలో వ్యాప్తి చేయబడింది. ఈ కారణంగానే, ఈరోజు ముస్లింలు ఆచరిస్తున్న ఆరాధనా పద్ధతులు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అనుచరులు (సహాబా రజియల్లాహు అన్హుమ్) అమలు చేసినవేనని నేటి మానవుడు గమనిస్తున్నాడు. అదే విధంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తెచ్చిన దైవవాణి (వహీ), అది దివ్యఖుర్ఆన్ అయినా లేదా ప్రవక్త సున్నతు అయినా, అల్లాహ్ సంరక్షణలో సురక్షితంగా ఉంది, ఇందులో ఏ ఒక్క అక్షరం కూడా లోపించలేదు.

పరిస్థితి ఇలా ఉన్నందున, మరియు ఈ సందేశం శాశ్వతమైనది మరియు సురక్షితమైనది, మరియు ఇది ప్రతి కాలానికి మరియు సమయానికి అనువైనది, మరియు ప్రతి వాతావరణానికి అనువైనది, మరియు దీనిని ప్రతి పరిస్థితిలోనూ అమలు చేయవచ్చు, కాబట్టి ఈ రోజుల్లో ప్రజలు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మాన్ని దృఢంగా పట్టుకోవాల్సిన మరియు ఆయన సున్నత్‌పై అమలు చేయాల్సిన అవసరం ఉంది, మరియు ఇది వారికి సరిపోతుంది. ఒకవేళ ఏ ప్రవక్త అయినా వచ్చినా, వారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మత్‌లోని వారే అయి ఉండేవారు మరియు ఆయన షరియత్‌పైనే అమలు చేసి ఉండేవారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు అల్లాహ్ ప్రవక్తల నుండి తీసుకున్న గట్టి ప్రమాణాన్ని (జ్ఞాపకం చేసుకోండి): "నేను మీకు ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించిన తరువాత, ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి (మీ గ్రంథాలలో నుండి మిగిలివున్న) సత్యాన్ని ధృవపరిస్తే మీరు అతని (ధర్మాన్ని) విశ్వసించి, అతనికి సహాయం చేయవలసి ఉంటుంది." అని చెప్పి ఇలా ప్రశ్నించాడు: "ఏమీ? మీరు దీనికి అంగీకరిస్తారా? మరియు నా ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తారా?" వారన్నారు: "మేము అంగీకరిస్తాము." అప్పుడు ఆయన అన్నాడు: "అయితే, మీరు దీనికి సాక్షులుగా ఉండండి. మరియు నేను కూడా మీతోపాటు సాక్షిగా ఉంటాను.﴿

[సూరతు ఆలే ఇమ్రాన్: 81]

అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.

المصدر

قسم النبوة

ملاحظات

--