Skip to content

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు?

مصدر الإجابة
قسم النبوة
الباب / الفصل
(قسم النبوة)

السؤال

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు?

الجواب

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం: ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ అల్ ఖురషీ, వీరు ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం అలైహిస్సలాం వంశానికి చెందినవారు, మరియు ఆయన అంతిమ ప్రవక్త, మరియు ఆదమ్ సంతతికి నాయకుడు, మరియు ప్రళయదినాన సిఫారసు చేసేవారు మరియు సిఫారసు ఆమోదించబడేవారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

నిశ్చయంగా, ప్రతీ ప్రవక్తకు ఒక ప్రత్యేక ప్రార్థన (అవకాశం) ఉండేది, దానిని వారు ఈ లోకంలోనే ఉపయోగించుకున్నారు. మరియు నేను నా ప్రార్థనను నా ఉమ్మత్ (సమాజం) కొరకు సిఫారసుగా దాచిపెట్టాను. మరియు నేను ప్రళయదినాన ఆదం సంతతికి నాయకుడిని, ఇందులో గర్వపడాల్సినదేమీ లేదు. మరియు నేను మొట్టమొదటి వ్యక్తిని, ఎవరి కోసం భూమి బద్దలవుతుందో, ఇందులో గర్వపడాల్సినదేమీ లేదు. మరియు నా చేతిలో ప్రశంసల పతాకం ఉంటుంది, ఇందులో గర్వపడాల్సినదేమీ లేదు. ఆదం మరియు ఆయన తరువాత వచ్చిన వారందరూ నా పతాకం క్రింద ఉంటారు, ఇందులో గర్వపడాల్సినదేమీ లేదు.

ముస్నద్ అహ్మద్ తబ్అ అర్రిసాలహ్ హదీసు నెంబరు 2546, మరియు సుననె తిర్మిజీ హదీసు నెంబరు 3148,

మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశహరులలో కెల్లా గొప్పవారు. అల్లాహ్ ఆయనను పంపినట్లయితే, వారు ఆయనను అనుసరిస్తారని అల్లాహ్ తఆలా ప్రవక్తలందరి అలైహిముస్సలాం నుండి వాగ్దానం తీసుకున్నాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు అల్లాహ్ ప్రవక్తల నుండి తీసుకున్న గట్టి ప్రమాణాన్ని (జ్ఞాపకం చేసుకోండి): "నేను మీకు ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించిన తరువాత, ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి (మీ గ్రంథాలలో నుండి మిగిలివున్న) సత్యాన్ని ధృవపరిస్తే మీరు అతని (ధర్మాన్ని) విశ్వసించి, అతనికి సహాయం చేయవలసి ఉంటుంది." అని చెప్పి ఇలా ప్రశ్నించాడు: "ఏమీ? మీరు దీనికి అంగీకరిస్తారా? మరియు నా ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తారా?" వారన్నారు: "మేము అంగీకరిస్తాము." అప్పుడు ఆయన అన్నాడు: "అయితే, మీరు దీనికి సాక్షులుగా ఉండండి. మరియు నేను కూడా మీతోపాటు సాక్షిగా ఉంటాను.﴿

[సూరతు ఆలే ఇమ్రాన్: 81]

ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు:

ఆదమ్ అలైహిస్సలాం నుండి ఈసా అలైహిస్సలాం వరకు తాను పంపిన ప్రతి ప్రవక్త నుండి మహోన్నతుడైన అల్లాహ్ వాగ్దానం తీసుకున్నాడని ఆయన తెలియజేస్తున్నాడు: అల్లాహ్ వారిలో ఎవరికైనా ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించి, వారు ఎంతటి ఉన్నత స్థాయికి చేరుకున్నప్పటికీ, ఆ తరువాత వారి వద్దకు ఒక సందేశహరుడు వస్తే, వారు ఆయనపై తప్పనిసరిగా విశ్వాసం కనబరచాలని మరియు ఆయనకు సహాయం చేయాలని; మరియు వారి వద్ద ఉన్న జ్ఞానం మరియు ప్రవక్త పదవి, వారి తరువాత పంపబడిన వారిని అనుసరించకుండా మరియు ఆయనకు సహాయం చేయకుండా వారిని నిరోధించకూడదని... ఇంకా ఆయన ఇలా పేర్కొన్నారు: అలీ బిన్ అబీ తాలిబ్ మరియు అతని పినతండ్రి కుమారుడు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఇలా అన్నారు: "అల్లాహ్ ఏ ప్రవక్తను పంపినా అతని నుండి వాగ్దానం తీసుకున్నాడు: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడినప్పుడు అతను జీవించి ఉంటే ఆయనపై తప్పనిసరిగా విశ్వాసం కనబరచాలని, ఆయనకు సహాయం చేయాలని; మరియు తన జాతి వారితో వాగ్దానం తీసుకోవాలని అల్లాహ్ అతనికి ఆదేశించాడు: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్తగా పంపబడి, వారు సజీవంగా ఉంటే, వారు ఖచ్చితంగా ఆయనను విశ్వసించాలని మరియు ఆయనకు సహాయం చేయాలని."

తఫ్సీర్ ఇబ్నె కసీర్ (2/67).

దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం మునుపు వచ్చిన గ్రంధాలను మరియు సందేశాలను దృవీకరిస్తూ వచ్చారు, మరియు గత సందేశహరులను అలైహిస్సలాం విశ్వసించాలని పిలుపునిచ్చారు, మరియు ఆయన సందేశహరులు అలైహిస్సలాం తీసుకువచ్చిన దానికి అనుగుణంగా ఉన్నారు, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నూహ్ కు మరియు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలకు సందేశం (వహీ) పంపినట్లు, నీకు కూడా సందేశం పంపాము. మరియు మేము ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ లకు మరియు అతని సంతతి వారికి మరియు ఈసా, అయ్యూబ్, యూనుస్, హారూన్ మరియు సులైమాన్ లకు కూడా దివ్యజ్ఞానం (వహీ) పంపాము. మరియు మేము దావూద్ కు జబూర్ గ్రంథాన్ని ప్రసాదించాము.﴿

[సూరతు నిసా: 163],

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఆయన, నూహ్ కు విధించిన (ఇస్లాం) ధర్మాన్నే, మీ కొరకు శాసించాడు; మరియు దానినే (ఓ ముహమ్మద్!) మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము; మరియు మేము దానినే ఇబ్రాహీమ్, మూసా మరియు ఈసాలకు కూడా విధిగా చేశాము. ఈ ధర్మాన్నే స్థాపించాలని మరియు దానిని గురించి భేదాభిప్రాయాలకు గురి కాకుండా ఉండాలని. నీవు దాని వైపునకు పిలిచేది బహుదైవారాధకులకు ఎంతో సహింపలేనిదిగా ఉంది. అల్లాహ్ తాను కోరిన వానిని తన వైపునకు ఆకర్షిస్తాడు మరియు పశ్చాత్తాపంతో తన వైపునకు మరలేవానికి మార్గదర్శకత్వం చేస్తాడు.﴿

[సూరతు షూరా: 13]

ఆయనను దైవప్రవక్తగా పంపడం ద్వారా అల్లాహ్ తఆలా సకల లోకాల వారిపై కరుణ కురిపించాడు. ఆయన మక్కా పట్టణంలో జన్మించారు మరియు అక్కడి నుండే సమస్త మానవ మరియు జిన్ జాతుల కోసం దైవప్రవక్తగా పంపబడ్డారు. ప్రవక్తకు 40 సంవత్సరాల వయస్సులో దైవదౌత్యం లభించింది. ఆ తరువాత ఆయన మదీనా కు వలస (హిజ్రత్) వెళ్ళారు మరియు 63 సంవత్సరాల వయస్సులో అక్కడే పరమవదించారు.

మరియు ఎవరికైతే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దౌత్యం ప్రాప్తించిందో, ఆయనను విశ్వసించకుండా మరియు ఆయన్ను అనుసరించకుండా స్వర్గంలో ప్రవేశించడానికి అతనికి ఏ మార్గమూ లేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

“ఎవరి చేతిలోనైతే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా, ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదుల జాతి గాని, మరియు క్రైస్తవుల జాతి గానీ ఎవరైతే నా గురించి విని కూడా నేను ఏ సందేశముతో అయితే పంపబడినానో దానిని విశ్వసించకుండానే చనిపోతాడో, అతడు తప్పకుండా నరకవాసులలో ఒకడు అవుతాడు.”

[దీన్ని ముస్లిం ఉల్లేఖించారు].

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾నూన్, కలం సాక్షిగా! మరియు వారు (దైవదూతలు) వ్రాస్తున్న దాని సాక్షిగా!

నీ ప్రభువు అనుగ్రహం వలన నీవు (ఓ ముహమ్మద్) పిచ్చివాడవు కావు!

మరియు నిశ్చయంగా, నీకు ఎన్నటికీ తరిగిపోని ప్రతిఫలం ఉంది.

మరియు నిశ్చయంగా, నీవు ఉత్తమమైన శీలవంతుడవు!﴿

[సూరతుల్ ఖలమ్: 1-4]

మరియు అబ్దుల్లాహ్ ఇబ్నె సలామ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం:

"అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు, ప్రజలు ఆయన వైపుకు దూసుకుని వచ్చారు. ఇలా చెప్పబడింది: అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేసినారు. నేను ఆయనను చూడటానికి ప్రజలతో వచ్చాను. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఖం స్పష్టంగా చూసిన వెంటనే, ఇది ఒక అబద్ధాలకోరు ముఖం కాదని నాకు తెలిసిపోయింది."

[దీనిని అత్తిర్మిజి (2485) మరియు ఇబ్నె మాజా (1334) ఉల్లేఖించారు.]

మరియు ఇది సరైనది. అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.

చూడండి: 'అల్ ఫుసూల్ ఫీ సీరతిర్రసూల్'-రచన -ఇబ్న్ కసీర్, 'అర్రహీకుల్ మక్తూమ్'-రచన -ముబారక్'పూరి.

المصدر

قسم النبوة

ملاحظات

--