అల్లాహ్ మనల్ని ఎందుకు సృష్టించాడు? మరియు మన ఉనికి లక్ష్యం ఏమిటి?
- محاور التعريف بالإسلام
- الغاية من خلق الإنسان ومعنى الحياة
- مصدر الإجابة
- قسم الإيمان | كتاب: الإسلام دين رب العالمين، ص 9
- الباب / الفصل
- (قسم الإيمان)
السؤال
అల్లాహ్ మనల్ని ఎందుకు సృష్టించాడు? మరియు మన ఉనికి లక్ష్యం ఏమిటి?
الجواب
మన సృష్టి వెనుక ఉన్న వివేకం మరియు మన ఉనికి లక్ష్యం గురించి సర్వజ్ఞాని, సర్వం తెలిసిన అల్లాహ్ మనకు తెలియజేశాడు, ఆయన తన పవిత్ర గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే!﴿
[అద్-దారియాత్: 56]
అల్లాహ్ జిన్నులను మరియు మనుషులను సృష్టించిన ఉద్దేశ్యం ఇదే, మరియు ప్రవక్తలందరినీ దీని వైపుకు పిలవడానికే ఆయన పంపాడు, అదే ఆయన ఆరాధన. ఇందులో ఆయనను తెలుసుకోవడం మరియు ప్రేమించడం, ఆయన వైపుకు మరలడం మరియు ఆయనకు దగ్గరవ్వడం, మరియు అల్లహ్యేతరులను విడిచిపెట్టడం ఇమిడి ఉన్నాయి.
కాబట్టి, ఈ లక్ష్యం నుండి తొలగిపోయినవాడు అల్లాహ్ శిక్షకు హక్కుదారుడయ్యాడు, మరియు ఆజ్ఞకు లోబడి ఆచరించినవాడు శాశ్వతమైన అనుగ్రహాలకు హక్కుదారుడయ్యాడు. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-
﴾ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.﴿
[అన్ నహ్ల్ : 97]