Skip to content

మహోన్నతుడైన అల్లాహ్ యొక్క తౌహీద్ (ఏకత్వం) తప్పనిసరి అనడానికి ఆధారం ఏమిటి?

محاور التعريف بالإسلام
توحيد الله وإبطال الشرك
مصدر الإجابة
قسم الإيمان
الباب / الفصل
(قسم الإيمان)

السؤال

మహోన్నతుడైన అల్లాహ్ యొక్క తౌహీద్ (ఏకత్వం) తప్పనిసరి అనడానికి ఆధారం ఏమిటి?

الجواب

మహోన్నతుడైన అల్లాహ్ ను ఆయన రుబూబియత్ లో ఏకీకరించడం తప్పనిసరి అనడానికి మరియు ఆయన ఒక్కరే సృష్టికర్త, యజమాని, నిర్వాహకుడని, ఆయనకు ఎవరూ సాటి లేరనడానికి ఆధారం.

వాటిలో నుంచి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾అల్లాహ్ ఎవ్వరినీ కూడా తనకు సంతానంగా చేసుకోలేదు మరియు ఆయనతో పాటు మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టితో వేరై పోయేవాడు మరియు వారు ఒకరిపై నొకరు ప్రాబల్యం పొందగోరేవారు. అల్లాహ్! వారు కల్పించే వాటికి అతీతుడు.﴿

[అల్ ముమినూన్:12-14]

ఈ ఆయత్ పండితులు పిలిచే 'దలీల్ తమానుఅ్' ను కలిగి ఉంది: దాని అర్థం ఏమిటంటే, అల్లాహ్ తో పాటు ఇతర దేవుళ్లు కూడా ఉన్నారని, ఊహించినట్లయితే, అప్పుడు అవి:

అవి దైవత్వంలో ఆయనకు లొంగిపోవాలి, లేదా దాని కొరకు ఆయనతో తగువులాడాలి. మొదటి ఊహ వాటి దైవత్వాన్ని రద్దు చేస్తుంది; ఎందుకంటే లొంగిపోయినవాడు అధీనంలో ఉన్నవాడే కానీ ఆరాధ్యుడు కాజాలడు. ఒకవేళ అవి ఆయన అధికారంలో మరియు సామ్రాజ్యంలో ఆయనతో తగువులాడితే, ఈ తగువులాట యొక్క ప్రభావం విశ్వంలో ఆరాధ్యదైవాలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించే రూపంలో కనబడేది. మరియు ప్రతి ఆరాధ్యుడు తాను సృష్టించిన దానిని తీసుకుపోయేవాడు, తద్వారా ప్రతి ఒక్క ఆరాధ్యుడు తన సృష్టితో ప్రత్యేకమైపోయి, దానిపై తన ఇష్టానుసారంగా అధికారం చెలాయించేవాడు. మరియు మీరు వారిలో ప్రతి ఒక్కరి రాజ్యాన్ని ఇతరుల రాజ్యం నుండి వేరుగా చూసేవారు. ప్రపంచ రాజుల రాజ్యాలు ఏ విధంగానైతే వేరుగా ఉండి, వారు ఒకరిపై మరొకరు ఆధిపత్యం కోసం తగువులాడుతున్నారో మీరు చూస్తున్నట్లుగానే, ఆ ఆరాధ్యదైవాలు కూడా ఒకరిపై మరొకరు ఆధిపత్యాన్ని విజయాన్ని పొందేవి. మరి ఎప్పుడైతే మీరు రాజ్యాలు వేరుపడినట్లు మరియు ఆరాధ్యదైవాలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం పొందినట్లు ఎటువంటి ప్రభావాన్ని చూడటం లేదో, అలాంటప్పుడు ఆయన మాత్రమే ఏకైక ఆరాధ్యుడని, సమస్త వస్తువుల అధికారం ఆయన చేతిలోనే ఉందని తెలుసుకోండి.

ఒకవేళ ఎవరైనా ఇలా వాదించినట్లయితే: దైవాల మధ్య ఒక రకమైన సానుకూలత కుదిరి, ఎలాంటి సంఘర్షణ లేదా తగువులాట లేకుండా ప్రతి దైవం తాను సృష్టించిన దానికి మాత్రమే పరిమితమయ్యాడని; అది కూడా వారి దైవత్వం నిరాధారమైనదని చెప్పడానికి అతిపెద్ద ఆధారం అవుతుంది. ఎందుకంటే ప్రతి దైవం యొక్క దైవత్వం తాను సృష్టించని వర్గానికి సంబంధించి లోపభూయిష్టంగా ఉంటుంది, మరియు ఇది ప్రతి దైవంలో లోపానికి దారి తీస్తుంది, మరియు ఇది జరగడం అసాధ్యం; ఎందుకంటే దైవత్వానికి పరిపూర్ణత అవసరం, లోపం కాదు.

  • ఇక అల్లాహ్ యొక్క తౌహీదె ఉలూహియత్ ఆవశ్యకతకు సంబంధించిన ఆధారం విషయానికొస్తే, అది ఆరాధనా తౌహీదు. అనగా బహిరంగ మరియు అంతరంగిక ఆరాధనలన్నింటిలోనూ మహోన్నతుడైన అల్లాహ్‌ను ఒక్కరినే ఏకీకరించడం. ఉదాహరణకు నమాజు, దుఆ, అణకువ, నమ్మకం ఉంచటం, విధేయత, భయం మరియు ఆశ, జుబాహ్ చేయటం మరియు మొక్కుబడులు, సహాయం కోరటం, శరణు వేడుకోవటం, ఆపదలో రక్షణ కోరటం మరియు ఇతర ఆరాధనల రకాలన్నీ ఎవరూ సాటి లేని అల్లాహ్ ఒక్కడి కొరకే ప్రత్యేకించడం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు!﴿

[అల్ బఖర: 21]

కాబట్టి ప్రభువు మాత్రమే ఆరాధనకు అర్హుడు, ఇతరులంతా సృష్టించబడినవారు మరియు పోషించబడేవారు కావున వారు ఆరాధనకు అర్హులు కారు.

మహోన్నతుడైన అల్లాహ్ ముష్రికులు అల్లాహ్ ను వదిలి ఆరాధ్య దైవాలను చేసుకోవటమును అనేక బుద్ధిపరమైన ప్రమాణాలతో అసత్యపరచాడు; వాటిలో:

వారు తయారు చేసుకున్న ఈ ఆరాధ్య దైవాలలో ఉలూహియ్యత్ లక్షణాలలో నుంచి ఏదీ లేదు. వారు సృష్టించబడిన వారు, సృష్టించలేరు. తమ దాస్యం చేసే వారికి ఎటువంటి లాభము చేకూర్చలేరు మరియు వారి నుండి ఎటువంటి నష్టమును దూరం చేయలేరు. వారికి మరణ,జీవనాల అధికారం లేదు. ఆకాశములలో మరియు భూమిలో వారికి ఎటువంటి అధికారము లేదు.

దీనికి సంబంధించి మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు కూడా ఉంది:

﴾అయినా వారు ఆయనకు బదులుగా ఏమీ సృష్టించలేని మరియు తామే సృష్టింపబడిన వారిని ఆరాధ్యదైవాలుగా చేసుకున్నారు. మరియు వారు తమకు తాము ఎట్టి నష్టం గానీ, లాభం గానీ చేసుకోజాలరు. మరియు వారికి మరణం మీద గానీ, జీవితం మీద గానీ మరియు పునరుత్థాన దినం మీద గానీ, ఎలాంటి అధికారం లేదు.﴿

[ఫుర్ఖాన్: 3]

మరియు అల్లాహ్ సెలవిచ్చాడు:

﴾వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ఎవరినైతే, (ఆరాధ్యదైవాలుగా) భావిస్తున్నారో, వారిని పిలిచి చూడండి!" ఆకాశాలలో గానీ మరియు భూమిలో గానీ రవ్వ (పరమాణువు) అంత వస్తువుపై కూడా వారికి అధికారం లేదు. మరియు వారికి ఆ రెండింటిలో ఎలాంటి భాగస్వామ్యమూ లేదు. మరియు ఆయనకు వారిలో నుండి ఎవ్వడూ సహాయకుడునూ కాడు.﴿

[సబా: 22]

﴾ఏమీ? దేనినీ కూడ సృష్టించలేని మరియు (స్వయంగా) తామే సృష్టించబడిన వారిని, వారు ఆయనకు సాటిగా (భాగస్వాములుగా) కల్పిస్తారా?﴿

[అల్ ఆరాఫ్: 54]

అంటే: ఏమి? ఈ ముష్రికులు ఆరాధన విషయంలో అల్లాహ్ కు ఆయన సృష్టితాలను సాటి కల్పిస్తున్నారా ? అవి దేనినీ సృష్టించలేవు, పైగా అవి కూడా సృష్టితాలే.

ఈ ఆరాధ్యదైవాల పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, వారిని ఆరాధించడం పరమ మూర్ఖత్వం మరియు అస్సలు పనికిరాని పని.

  • ఇక మహోన్నతుడైన అల్లాహ్ యొక్క నామాలు మరియు గుణాలలో ఆయన ఏకత్వం (తౌహీద్) తప్పనిసరి అనటానికి ఆధారం, సృష్టికర్త సృష్టితం కంటే భిన్నమైనవాడని మనం తెలుసుకోవటం.

﴾... ఆయనకు పోలింది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.﴿

[అష్-షూరా: 11]

﴾... ఆయనకు పోలింది ఏదీ లేదు ...﴿

అంటే: ఆయన ఉనికిలో గానీ, ఆయన పేర్లలో గానీ, ఆయన గుణాలలో గానీ, ఆయన చర్యలలో గానీ ఆయన సృష్టిరాసులలో నుంచి ఆయనను పోలినది ఏదీ లేదు. ఎందుకంటే ఆయన నామాలన్నీ అత్యంత సుందరమైనవి, మరియు ఆయన గుణాలు పరిపూర్ణత మరియు గొప్పతనం గలవి. మరియు ఆయన తన చర్యల ద్వారా ఎవరి భాగస్వామ్యం లేకుండా గొప్ప సృష్టిరాసులను సృష్టించాడు. ఆయన ప్రతి కోణంలోనూ పరిపూర్ణతలో ఏకైకుడు మరియు అద్వితీయుడు అయినందున, ఆయనకు సమానమైనది ఏదీ లేదు.

షరియత్ ద్వారా రుజువైన పేర్లు మరియు గుణాలను నిర్ధారించడానికి గల మేధోపరమైన ఆధారాలలో ఒకటి ఏమనగా :

  1. ఈ మహత్తరమైన సృష్టులు — వాటి వైవిధ్యం, భిన్నత్వం, తమ ప్రయోజనాలను నిర్వర్తించడంలో ఉన్న సమన్వయం, మరియు వాటికి నిర్ణయించబడిన మార్గాల్లో సాగడం — ఇవన్నీ మహోన్నతుడైన అల్లాహ్ యొక్క మహిమ, ఆయన శక్తి, జ్ఞానం, జ్ఞానపూర్వకత, అలాగే ఆయన సంకల్పం మరియు చిత్తాన్ని సూచిస్తాయి.
  2. అనుగ్రహం, ఉపకారం, కష్టాలను తొలగించడం, మరియు బాధలను నివారించడం — ఈ విషయాలు కరుణ, దాతృత్వం మరియు ఉదారతను సూచిస్తాయి.
  3. పాపాత్ములకు శిక్ష విధించటం మరియు వారిపై ప్రతీకారం తీర్చుకోవటం, వారిపై అల్లాహ్ యొక్క ఆగ్రహమును మరియు వారి పట్ల ఆయన అయిష్టతను సూచిస్తాయి.
  4. విధేయులను గౌరవించడం మరియు వారికి ప్రతిఫలం ఇవ్వడం; వారి పట్ల అల్లాహ్ యొక్క ప్రసన్నతను మరియు వారి పట్ల ఆయన ప్రేమను సూచిస్తాయి.

﴾ ... భూమ్యాకాశాలలో ఆయన సామ్యమే సర్వోన్నతమైనది. ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేచనా పరుడు.﴿

[రూమ్: 27]. అనగా: పరమ పవిత్రుడైన ఆయన వర్ణించబడే ప్రతి విషయంలోనూ ఆయన గుణాలే సర్వోన్నతమైనవి, ఆయనను పోలినది ఏదీ లేదు. ఈ సర్వోన్నత గుణగణాలలో ఇద్దరు భాగస్వాములు కావడం అసాధ్యం; ఎందుకంటే, ఒకవేళ వారిద్దరూ సమానమైతే, వారిలో ఒకరు మరొకరి కంటే అత్యున్నతులు కాలేరు. ఒకవేళ వారు సమానం కాకపోతే, ఆ సర్వోన్నత గుణగణాలతో వర్ణించబడేది వారిలో ఒకరు మాత్రమే అవుతారు. కావున సర్వోన్నత గుణగణాలు కలిగిన ఆయనకు ఎవరూ సమానులు కానీ, భాగస్వాములు గానీ ఉండటం అసాధ్యం.

المصدر

قسم الإيمان

ملاحظات

--